WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

వైఎస్‌ఆర్‌పార్టీకి కొత్త నిర్వచనం...!

వైకాపా అంటే కొత్త నిర్వచనం చెబుతున్నారు టిడిపి మంత్రులు,ఎమ్మెల్యేలు. అది వై.ఎస్‌.జగన్‌ జేబు సంస్థ అని, తండ్రి మరణాన్ని అడ్డుపెట్టుకుని సిఎం కావడానికి ప్రయత్నించి విఫలమై స్వంతంగా పార్టీ పెట్టుకున్నారని...అనేక సందర్భాల్లో విమర్శలు, ఆరోపణలు చేశారు. తాజాగా కడప జిల్లాకు చెందినఒక నాయకుడు వైకాపాకు కొత్త నిర్వచనం చెప్పారు. ఆ నిర్వచనం చెప్పే ముందు ఆ నాయకుడు మాట్లాడుతూ..టిడిపి అంటే...గతంలో వ్యంగ్యంగా విమర్శించారు...తెలుగుదేశం పార్టీ అంటే దొంగల పార్టీ అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు..అప్పట్లో తాము మౌనం వహించామని...ఇంకా ఆ విమర్శలను తిప్పి కొట్టడానికి...తాము కూడా కొత్త నిర్వచనం చెపుతున్నామని అన్నారు. వై...అంటే ఎక్కడైనా..ఎస్‌... అంటే స్కాములు...ఆర్‌..అంటే రౌడీయిజం..సి..అంటే  చేసి చూపించే...డి..అంటే పార్టీ అని చెప్పారు. ఇది ఒక బహిరంగ వేదికపై ఒక నాయకుడు వ్యాఖ్యానించడంతో...చప్పట్లతో సభా ప్రాంగణం మారుమ్రోగిపోయింది. ఇన్ని సంవత్సరాలు మన పార్టీని ఈ విధంగా విమర్శించారు. మన నాయకుడు వైఎస్సాఆర్‌పార్టీ అంటే అందరికి తెలిసే విధంగా చేశారని అభినందనలు తెలిపారు. ఇన్నాళ్లూ టిటిడి అంటే రకరకాల పేర్లతో విమర్శించిన వైకాపా నాయకులకు ఖంగుతినే విధంగా...చేశారని మరి కొద్ది రోజుల్లో ఆ పేరు వాడుకలోకి వచ్చే అవకాశం లేకపోలేదు.

(164)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ