లేటెస్ట్

'జగన్‌'కు ఉన్న తెలివి 'చంద్రబాబు'కు లేకపోయే...!

ఇప్పటి వరకు 'చంద్రబాబునాయుడే' మంచి పరిపాలనాదక్షుడు, పాలనాపరంగా నిర్ణయాలు తీసుకోవడంలో ఆరితేరిన వ్యక్తి అని ఆయన మందిమాగాధులతోపాటు..ఇతరులు కూడా కితాబు ఇస్తారు. కానీ..ఆయన గత ఐదేళ్లల్లో తీసుకున్న నిర్ణయాలు ఎలా వికటించాయో.. మొన్నటి ఎన్నికల్లో చూశాం. తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిన విషయాల్లో నానబెట్టడం, లేదా..సాగదీయడం...అసలు నిర్ణయాలు తీసుకోకుండా వదిలేయడం టిడిపికి ఎంతో నష్టాన్ని చేకూర్చింది. స్వంత పార్టీ నాయకుల పట్ల వ్యవహరించిన తీరు, వారు చేస్తోన్న అరాచకాలను అదుపుచేయలేక..చేతులు ఎత్తేయడంతో ఆయన ప్రజల్లో పలుచనయ్యారు. ఎంతో రాజకీయ, అధికార అనుభవం ఉన్న...'చంద్రబాబు' నుంచి ప్రజలు ఎంతో ఆశిస్తే...చివరకు వారి ఆశలను ఆయన ఆడియాసలు చేశారు. దీంతో..ఎన్నికల్లో ఆయనకు ప్రజలు సరైన గుణపాఠమే నేర్పారు. నాడు 'చంద్రబాబు'కు ఎదురైన పరిస్థితే నేటి ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డికి ఎదురైతే ఎంత చాకచక్యంగా, ఎంతో సమర్థంగా, తెలివిగా వ్యవహరించిన తీరును చూసి కొందరు టిడిపి నేతలు కూడా ముగ్ధులవుతున్నారు. 'జగన్‌'కు ఉన్న తెలివి మా నేతకు ఉంటే ఇప్పటి పరిస్థితి ఉండేది కాదని వ్యాఖ్యానిస్తున్నారు. 

తాజాగా నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వ్యవహారంలో 'జగన్‌' వ్యవహరించిన తీరుపై టిడిపి నేతలు ఔరా అంటున్నారు. ఎంపిడిఓ ఇంటికి ఎమ్మెల్యే వెళ్లి రభస చేశారని, ఇంటికికరెంట్‌ కట్‌ చేశారని, రభస చేశారని పెద్ద ఎత్తున వార్తలు రావడంతో..ఆయనపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. స్వంత పార్టీ ఎమ్మెల్యే, తనకు ఎప్పటి నుంచో మద్దతు దారు..పైగా స్వంత సామాజికవర్గానికి చెందిన బలమైన నేతనే ఆయన అరెస్టు చేయించారు. ఎంపిడిఒ ఇంటిపై ఎమ్మెల్యే దాడి చేయడం రాజకీయంగా నష్టాన్ని కల్గిస్తుందని, అదే సమయంలో అది సుధీర్ఘకాలం..ప్రజల్లో నానుతుందని పసిగట్టిన 'జగన్‌' వెంటనే స్వంత ఎమ్మెల్యేను అరెస్టు చేయించారు. ఆయనపై బెయిల్‌కు వీలుకలిగిన సెక్షన్‌లు నమోదు చేయించి..ఉదయం అరెస్టు చేయించి...అరగంటలో బెయిల్‌ ఇప్పించారు. దీంతో...తప్పు చేస్తే..స్వంత పార్టీ నేతలపైనే తమ నేత చర్యలు తీసుకుంటారని చెప్పుకునే వీలును 'జగన్‌'ఆ పార్టీ నాయకులకు కల్గించారు. గత ప్రభుత్వ హయాంలో 'చింతమనేని ప్రభాకర్‌' ఇదే విధంగా ఎమ్మార్వోపై దాడి చేశారని వార్తలు రాగా...ఎమ్మార్వోపైనే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారని, ఎవరు అక్కడకు వెళ్లామన్నారని ప్రచారం జరిగింది.దీంతో..గత ఐదేళ్లు 'చింతమనేని' ఇదే విషయంపై వార్తల్లో నానారు. ఎమ్మార్వోపై ఎమ్మెల్యే దాడి చేశారని వార్తలు వస్తే..ఆయనపై చర్యలు తీసుకోలేదని, స్వంత సామాజికవర్గ నేతను 'చంద్రబాబు' రక్షించారని ప్రతిపక్షాలతో సహా మేధావులు కూడా రచ్చ రచ్చ చేశారు. నాడు...'చంద్రబాబు' కూడా..ఇప్పుడు 'జగన్‌' పెట్టించినట్లు...ఏదో ఒక సెక్షన్‌ కింద కేసు నమోదు చేయించి గంటలో బెయిల్‌ తెప్పించి బయటకు తెస్తే..అంత రచ్చ ఉండేది కాదని, కానీ...మా నేతకు 'జగన్‌'కు ఉన్నంత తెలివి లేదని, మహిళ విషయంలో రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసీ చిన్నవిషయమని వదిలేశారని, అది చివరకు కొంప ముంచిందని వారు ఇప్పుడు వాపోతున్నారు. మొత్తం మీద...ఇద్దరు సిఎంలు..స్వంత ఎమ్మెల్యేల విషయంలో తీసుకున్న చర్యలు ఇప్పుడు సోషల్‌మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. 

(446)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ