WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'బాబు'కు 'శెట్టిబలిజ' కులస్తుల మద్దతు...!

 ఉభయగోదావరి జిల్లాల్లో కాపులకు వ్యతిరేకంగా శెట్టిబలిజ నాయకులు పార్టీలకు అతీతంగా సమావేశమయ్యారు. ఎప్పుడైతే...'జనసేన' నేత..టిడిపిపై, చంద్రబాబుపై విమర్శలు చేసిన అనంతరమే...రెండు జిల్లాలకు చెందిన కుల నాయకులు ఒక సమావేశం నిర్వహించి..తామందరం ఒకే తాటిపై నిలబడాలి...రాజకీయాలకు అతీతంగా తమ కుల సత్తా చాటాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. టిడిపి పార్టీ నిన్న మొన్నటి వరకు కాపులకు పెద్దపీట వేసింది...శెట్టిబలిజలకు కూడా చంద్రబాబు ఎమ్మెల్సీలు, మంత్రులు ఇచ్చారు...రాబోయే ఎన్నికల్లో కాపులు 'జనసేన'కు మద్దతు ఇస్తారని...కాపుల దూకుడుకు అడ్డు కట్టవేయాలంటే..తామందరం ఒకే పార్టీకి మద్దతు ఇవ్వాలని...అని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. 

  వైకాపాకు చెందిన కొందరు నాయకులు ఈ సమావేశంలో మాట్లాడుతూ..బీసీలకు, తమ కులానికి అండగా నిలిచేది టిడిపినే అని ఒప్పుకుంటాం...కానీ కాపులను కూడా 'చంద్రబాబు' భుజాన వేసుకుంటున్నారు..ఒక వరలో రెండు కత్తులు ఉండవు కదా..అని వ్యాఖ్యానించడంతో...ఆ సమావేశంలో ఉన్న బిజెపి నాయకులు మాట్లాడుతూ..మొన్నటి వరకు ఏమి జరిగిందో అంతా మరిచిపోదాం..ఇప్పుడు కాపులందరూ 'జనసేన'కు మద్దతు ఇస్తున్నారు..ముద్రగడ వైకాపాకు మద్దతు ఇస్తున్నారు..మీరూ..మేమూ కలసి టిడిపికి మద్దతు ఇద్దాం...వచ్చే ఎన్నికల్లో టిడిపి విజయంసాధిస్తుంది. తరువాత జరిగే మంత్రివర్గంలో మనకు ప్రాధాన్యత ఇస్తారు..ఇందుకు తామే బాధ్యత వహిస్తామని హామీ ఇచ్చారు. ఆ సమావేశానికి హాజరైన మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఇటీవల కాలంలో 'జగన్‌' కూడా కాపులకే పెద్దపీట వేయాలనుకుంటున్నారు...తాము ఇప్పటికే..ఆయనను కలసి చెప్పినా..తమ మాట వినడంలేదని..అందరం ఒకే తాడితో నిలబడి శెట్టిబలిజ సత్తా చూపిద్దాం...కానీ..అందరం ఒకే పార్టీకి మద్దతు ఇద్దాం..ఆ పార్టీ మెజార్టీ వర్గాన్ని నిర్ణయిస్తే..తాము కూడా అదే దారిలో నడుస్తామని చెప్పారు. చివరకు అంతా కలసి టిడిపికి మద్దతు ఇద్దామని ఏకగ్రీవంగా నిర్ణయం చేశారు. త్వరలో 'చంద్రబాబు'ను కలసి తమ నిర్ణయాన్ని చెప్పబోతున్నారు. రాజకీయాలకు అతీతంగాసమావేశమైన శెట్టికులస్తులు..ఈ విధమైన నిర్ణయం తీసుకోవడంతో..వైకాపా నాయకులు షాక్‌కు గురయ్యారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ఓటర్లు కట్టుబడి ఉంటారా..? లేదా అన్న ది వేచి చూడాల్సిందే.

(195)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ