WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

అప్పుడు...ఒకటే..'నిర్భయ'...ఇప్పుడు...అడుగు...అడుగుకో...'నిర్భయ'...!

అది 2012 డిసెంబర్‌ నెల 16వ తేదీ. దేశ రాజధాని న్యూఢిల్లీ దక్షిణ ప్రాంతంలో  ఓ కదులుతున్న బస్సులోకి ప్రవేశించారు...ఓ యువతి...ఆమె స్నేహితుడు. సినిమా చూసి...బస్సు ద్వారా ఇంటికి వెళుతున్న ఆ జంటపై...బస్సు డ్రైవర్‌..అతని సహాయకులు కన్నేశారు. తొలుత...యువత స్నేహితుడిని కొట్టి...బస్సులోంచి విసిరేశారు...తరువాత కదులుతున్న బస్సులోనే ఆ యువతిపై నలుగురు ఉన్మాదులు అత్యంత కర్కశంగా రేప్‌కు తెగపడ్డారు...బస్సును ఢిల్లీ వీధుల్లో నడుపుతూనే...ఒకరి తరువాత..ఒకరు...ఆమెపై అత్యాచారం చేశారు. అత్యాచారంతో..కసి తీరక ఆమె...రహస్యాంగాల్లోకి ఇనుప రాడ్లు దూర్చి...తమ వికృతానందం పొందారు. నాటి దారుణ సంఘటన యావత్తు...జాతిని కుదిపేసింది. దేశ ప్రజలందరూ ఈ దారుణానికి వ్యతిరేకంగా ఉద్యమించారు..వీధుల్లో 'నిర్బయ'కు మద్దుతుగా...ర్యాలీలు, ధర్నాలు నిర్వహించి...ఆమెకు అండగా నిలిచారు. దుర్మార్గుల చేతిలో కర్కశత్వానికి బలైన..ఆమె మరణించినా..పార్టీలకు అతీతంగా..ఆ దారుణ సంఘటనను ఖండించారు.

  అది 2018 జనవరి నెల. కాశ్మీర్‌లోని కథువా జిల్లా...గొర్రెలు, గుర్రాలను కాస్తోన్న ఎనిమిదేళ్ల చిన్నారి...తన గుర్రాలు కనిపించడం లేదని..వెతుక్కుంటూ వెళితే...అక్కడే ఉన్న కొంత మంది ఉన్మాదులు...ఆ బాలికను చెరపట్టారు. బాలికను ఒక ఆలయంలోకి తీసుకెళ్లి...ఆమెకు మత్తు మందు ఇచ్చి....వరుసగా..ఏడు  రోజుల పాటు అత్యాచారం చేశారు. అన్నం, నీళ్లు ఇవ్వకుండా...మత్తు మందు..ఇచ్చి...అత్యాచారం చేసిన ఉన్మాదులు...చివరకు ఆమె తలపై బండరాయితో మోది హత్య చేశారు. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే ఈ పనికి పాల్పడడం..దేశాన్ని ద్రిగ్బాంతికి గురి చేసింది. వీళ్లు అసలు మనుషులేనా...? ఎనిమిది సంవత్సరాల చిన్నారిపై అత్యంత దారుణ అత్యాచారానికి ఒడిగట్టి...చిన్నారిని ప్రాణం తీసిన వారిపై ఎవరికైనా..కనికరం ఉంటుందా..? కానీ... కొంత మంది హిందూ మతోన్మాధులు...మాత్రం ఆ దుర్మార్గులకు మద్దతుగా ర్యాలీలు తీస్తున్నారు.  ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉంటుందా...?

ఉద్యోగం కోసం వచ్చిన యువతిపై...

ఉత్తరప్రదేశ్‌లోని తమను పాలించే...ఓ ఎమ్మెల్యే వద్దకు ఓ దళిత యువతి...ఉద్యోగం కోసం వెళ్లడమే నేరమైంది. ఉద్యోగం కోసం వచ్చిన యువతిపై స్వయంగా ఎమ్మెల్యే అత్యాచారం చేసి...తనలోని వికృతను బయటపెట్టుకున్నాడు. తనపై జరిగిన దారుణం గురించి మొదట ఎవరికీ చెప్పని..యువతి..తరువాత..ఈ విషయంపై బంధువులతో కలసి ఎమ్మెల్యేను ప్రశ్నించిన నేరానికి..మళ్లీ ఆమెపై ఆయన సోదరుడు, అనుచరులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన తెలిసిన యువతి తండ్రి ఈ అరాచకాన్ని ప్రశ్నించడమే తప్పయింది. ఆయనపై అక్రమ ఆయుధ చట్టాన్ని ప్రయోగించి...చివరకు లాకప్‌లో హత్య చేయించారు. జరిగిన సంఘటనలపై...దిగ్బ్రాంతికి లోనైన యువతి..సిఎం ఆదిత్యనాథ్‌ దాస్‌ ఇంటి ముందు...తనను తాను తగులపెట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు...ఎమ్మెల్యే...అతని అనుచరులు చేసిన అకృత్యం బయటకు వచ్చింది. దీనిపై స్పందించాల్సిన ముఖ్యమంత్రి కానీ...ఆయన మంత్రులు కానీ...స్పందించకుండా...చోద్యం చూసి..తమ రాజ్యంలో ఇంతేనని సరిపెట్టారు.

చర్చికి వెళితే...తప్పా....!

మధ్యప్రదేశ్‌లో ఓ యువతి...చర్చికి వెళ్లడం తప్పయింది. చర్చికి ఎందుకు వెళ్లావంటూ...ఆ దళిత యువతిపై అమానుషంగా...నడిరోడ్డుపై తగులపెట్టారు..కొందరు ముష్కురులు. దీనిపై చర్యలు ఏమీ లేవు. నడిరోడ్డుపై తగులబడుతూ...ఆమె అరిచిన ఆరుపులు...ఈ దేశంలో...ఒక ప్రభుత్వం ఉందా..? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది ? తమకు ఇష్టమైన మతాన్ని అనుసరించే హక్కు...భారత రాజ్యాంగమే కల్పించింది. మరి...ఇష్టమైన మతాన్ని అనుసరిస్తే...అది తప్పా...? దీనికి నడిరోడ్డుపై తగులబెడతారా..? ఎందుకీ కండకావరం..? ఎందుకీ ఉన్నాదం..? ఎందుకీ మతోన్మాదం..? ఎక్కడకీ పయనం...? నాడు మతోన్మాదంతో...పెట్రేగిన తాలీబాన్లకు వీళ్లు వారసులు కాదా..? వారికీ వీరికి తేడా ఏముంది...?  

పెట్రేగిపోతున్న హిందూ మతోన్మాదులు...!

దేశంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన...తరువాత...ఈ రకమైన అకృత్యాలు నిత్యకృతమయ్యాయి. పాలకుల అండ చూసుకుని హిందూ మతోన్మాదులు రెచ్చిపోతున్నారు. మతానికి వ్యతిరేకమంటూ...హింసకు పాల్పడుతూ..ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అకృత్యాలకు పాల్పడిన వారికి మద్దతుగా నిలుస్తూ...ర్యాలీలు తీస్తూ...తమ నైజం ఇదేనంటూ చాటుకుంటున్నారు. రాజధర్మం కాపాడాల్సిన పాలకులు చోద్యం చూస్తూ...56 అంగుళాల ఛాతిని మరింత ఎలా పెంచుకోవాలో...ఆలోచిస్తూ..తీరిక లేకుండా ఉన్నారు. మన పుత్రికలకు న్యాయం చేస్తామని..కపట ప్రేమను ఒలకబోస్తున్నారు. నేడు దళితులకు జరిగిన అన్యాయం రేపు వేరే వర్గాలకు జరగవచ్చు. తాము చెప్పిందే వేదం...తాము ఆచరించిందే ధర్మం...అంటూ ఈ శక్తులు పెట్రేగిపోతుంటుంటే...సామాన్యులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వణికిపోతున్నారు. ఆవు మాంసం రవాణా చేస్తున్నారంటూ...హత్యలకు పాల్పడినా...చర్చిలకు వెళుతున్నారని...నడిరోడ్డుపై...తగుల పెట్టినా..పాలకుల్లో స్పందన మాత్రం కనిపించడం లేదు. అటవిక సంస్కృతిని పెంచిపోషిస్తున్న... ఇటువంటి పాలకులను ప్రజలు ప్రశ్నించకపోతే...ఇప్పుడు వారికి జరిగింది...రేపు మనకు జరుగుతుందనడంలో సందేహం లేదు. ఇప్పటికైనా..ప్రజలు మేల్కొని...ప్రజాహంతక ప్రభుత్వాలకు సమాధి కట్టాల్సిందే.


(291)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ