'స్వకులం నుంచే సవాళ్లు'.. కథనానికి విశేష స్పందన...! 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'స్వకులం నుంచే సవాళ్లు'.. కథనానికి విశేష స్పందన...!

ఆదివారం నాడు 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' ప్రచురించిన 'చంద్రబాబు'కు స్వకులం నుంచే సవాళ్లు' అనే కథనానికి టిడిపి వర్గాల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సొంత సొమ్ములు ఖర్చు పెట్టుకున్నవారు...టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు...దీనిపై మాట్లాడుతూ... 'చంద్రబాబు' చుట్టూ...కోటరీ ఉందని...ఒకప్పుడు..వీరి ఆస్తులు ఎంత...? ప్రస్తుతం వీరి ఆస్తులు ఎంత..? అనే విషయం విచారణ చేపిస్తే తెలుస్తుందని అన్నారు. తమ మనస్సులో ఉన్న అభిప్రాయాలను...కథనంలో రాశారని..ఇటువంటి కథనాలతోనైనా...'చంద్రబాబు' వాస్తవాలు తెలుసుకోవాలని కోరారు. కోటరీ విషయాన్ని ప్రస్తావిస్తూ...అనేక కొత్త వివవరాలను తెలిపారు. ప్రజల్లో పట్టులేని వారు..ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యాపారలావాదేవీలు నిర్వహించుకున్నవారు..చంద్రబాబు చుట్టూ కనిపిస్తున్నారని వారిలో కొందరు మాత్రమే నిజాయితీపరులని...వారిలో కొంత మంది అహంకారులని...కోటరీలో మెజార్టీ వారిని తప్పించాలని అనేక మంది కోరుతున్నారంటే....వారిపై ఎటువంటి వ్యతిరేకత ఉందో స్పష్టం అవుతోంది. ఆ విధంగా అభిప్రాయం వ్యక్తం చేసిన వారిలో 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌'తో పరిచయాలు లేవు. ఇప్పటికైనా 'చంద్రబాబు' కళ్లు తెరిచి...మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్‌రావు ఎమ్మెల్సీ జనార్థన్‌, ఇతర నాయకులందరినీ దూరం పెడితే...చాలా మంది అభినందిస్తారనివారుఅంటున్నారు. గతంలో ఇటువంటి విధానం ఉండేది కాదని..ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు...లోకేష్‌ ఎందుకు వీరిని ప్రోత్సహిస్తున్నారు. వీరి వల్ల పార్టీకి ఒరిగేదేముంది..? పార్టీ కోసం పది రూపాయలు ఖర్చుపెట్టి...వంద రూపాయలు ఖర్చు పెట్టామని తీసుకునేవారు వీరు. త్వరలో ఎన్నికలు రాబోతున్నాయని..ఇప్పటికైనా..వీరిని దూరంపెడితే పరిస్థితిలో కొంత మార్పు వస్తుందని వారు చెబుతున్నారు.

(300)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ