WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'జగన్‌'ను ఆ ఒక్కటీ అడగొద్దు....!

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కోసం మొదటి నుంచి పోరాడుతుంది..తామేనని...తమలా ఎవరూ...దీనిపై పోరాడలేదని ప్రతిపక్షనేత వై.ఎస్‌.జగన్‌ ఇప్పటికే పలుసార్లు కితాబు ఇచ్చుకున్నారు. హోదా కోసం తమ ఎంపీలు రాజీనామా చేశారని...ఇప్పుడు ఎమ్మెల్యేల చేత కూడా రాజీనామాలు చేయిస్తానని ఆయన లీకులు ఇస్తున్నారు. తమ పార్టీ ఎంపీలు పార్లమెంట్‌లో హోదా కోసం పోరాడుతున్నారని...హోదా రాకపోతే...ఎంపీ పదవులకు రాజీనామా చేస్తారని...అదే విధంగా తమ ఎంపీలు రాజీనామా చేశారని, తరువాత ఆమరణ నిరాహార దీక్ష చేశారని చెప్పుకున్నారు. హోదా కోసం ఎంత వరకైనా వెళతానని..చెబుతోన్న..ఆయన ఒక విషయం గురించి మాత్రం అసలు ప్రస్తావించడం లేదు. ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాలను సులువుగా చేయించిన 'జగన్‌' రాజ్యసభ ఎంపీల విషయంలో మాత్రం నోరెత్తడం లేదు. తన అక్రమాస్తుల కేసులో నిందితుడు 'విజయసాయిరెడ్డి' కూడా ఎంపి పదవికి రాజీనామా చేయించమంటే...మాత్రం ఆ ఒక్కటీ అడగొద్దనట్లు మాట్లాడుతున్నారు. ఎంపీలు రాజీనామా చేసినా...అవి ఇప్పట్లో ఆమోదం పొందవని తెలుసు కనకనే...ఆయన వారి చేత రాజీనామాలు చేయించారు. 

  పార్లమెంట్‌ సమావేశాలు జరగని రోజుల్లో ఎంపీల రాజీనామాపై స్పీకర్‌ నిర్ణయం తీసుకోరు కనుక...ఎంపీలు రాజీనామా అంటూ...కాలం గడుపుతున్నారు. రాజీనామాలపై 'జగన్‌'కు చిత్తశుద్ది ఉంటే...వెంటనే రాజ్యసభ సభ్యులు 'విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి'తో కూడా రాజీనామా చేయించవచ్చు..కదా...అని టిడిపి నేతలు ప్రశ్నిస్తుంటే...'జగన్‌' దాన్ని పట్టించుకోకుండా... విననట్లువ్యవహరిస్తున్నారు. రాజ్యసభ సభ్యులు కనుక..రాజీనామా చేస్తే...జరిగే ఉప ఎన్నికల్లో... అధికార పార్టీ వాటిని కైవసం చేసుకుంటుందని...అందుకే తన సన్నిహితుడి రాజ్యసభ సభ్యత్వం పోకుండా..ముందు జాగ్రత్తగా..వారిచేత రాజీనామా చేయించుకుండా..'జగన్‌' నాటకాలు ఆడు తున్నారని...ఆయన ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా...ఎంపీలు, ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయిస్తున్న 'జగన్‌' పనిలో పనిగా...'విజయసాయిరెడ్డి'తో కూడా రాజీనామా చేస్తే...ఆయనలో కొంచెమయినా..చిత్తశుద్ది ఉందని తాము నమ్ముతామని కూడా వారు.. అంటున్నారు. మరి 'జగన్‌'కు ఈ మాటలు వినిపిస్తున్నాయో...లేదో...!?


(198)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ