లేటెస్ట్

'రాధాకృష్ణ, అమిత్‌షా' మీటింగ్‌పై 'జగన్‌' మీడియా ఆశ్చర్యం...!

ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సమావేశం అవడంపై 'జగన్‌' మీడియా ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. ఎందుకు ఆయన ఇంత అర్జెంట్‌గా 'అమిత్‌షా'తో సమావేశం అయ్యారు. దీని వెనుక ఏం ఉంది..? ఎందుకు ఈ సమావేశం జరిగింది...? సమావేశంలో ఏం జరిగిందో అన్న దానిపై రకరకాలైన ఊహాగానాలను వ్యక్తం చేస్తూ..'జగన్‌' పట్ల సానుకూలంగా ఉండే మీడియా వార్త కథనాలను ప్రచురించింది. ముఖ్యంగా వెబ్‌మీడియాలో దీనిపై రకరకాలైన వార్తలను వండేశారు. 'రాధాకృష్ణ, అమిత్‌షా' మీటింగ్‌కు అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదంటూనే..ఆయన తన స్వంత పనుల కోసం కేంద్ర హోంమంత్రిని కలిశారని కొందరు రాయగా, మరి కొన్ని వెబ్‌సైట్లు మాత్రం 'చంద్రబాబు', బిజెపి పెద్దల మధ్య రాజీ చేయడానికి ఆయన అనుసంధాన కర్తగా వ్యవహరిస్తున్నారని, ఇందుకే ఆయన కేంద్రహోంమంత్రిని కలిశారని పేర్కొంటూనే 'రాధాకృష్ణ'కు అంత సీన్‌ లేదని, 'చంద్రబాబు' బిజెపి పెద్దలతో రాజీ చేసుకోవాలంటే ఆయన వేరే వ్యక్తుల ద్వారా వెళతారని, రాధాకృష్ణను పంపరని రాశాయి. మరో వైపు..తన సంస్థపై ఆంధ్రాలో విధించిన నిషేదం గురించి 'అమిత్‌షా'తో మొరపెట్టుకున్నారని, తన సంస్థను ఆంధ్రాలో నిషేదించినా..తనకు కేంద్ర పెద్దల మద్దతు ఉందని చెప్పుకోవడానికే 'రాధాకృష్ణ' తాపత్రయపడ్డారని రాసుకొచ్చాయి. ఆంధ్రా సిఎం జగన్మోహన్‌రెడ్డి, తెలంగాణ సిఎం కె.చంద్రశేఖర్‌రావుతో 'రాధాకృష్ణ' సున్నం పెట్టుకున్నారని, ఇప్పుడు ఆయన తనకు కేంద్ర పెద్దల మద్దతు ఉందని తన మీడియాలో ఫొటోలు వేసుకున్నా వీరిద్దరూ ఆయనను వదలరని కూడా పేర్కొన్నారు. మొత్తం మీద తెలుగు మీడియాలో మూడోస్థానంలో ఉన్న ఒక మీడియా సంస్థ అధినేత కేంద్ర హోంమంత్రిని కలుసుకుని గంట సేపు ముచ్చటించడం ఆ విషయాన్ని తన సంస్థ మీడియాలో ప్రకటించుకోవడం ప్రస్తుత పరిణామాల మధ్య ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఏది ఏమైనా 'రాధాకృష్ణ' తాను 'జగన్‌', కెసిఆర్‌లకు లొంగేది లేదని, అవసరమైతే కేంద్ర పెద్దల సహాయం తీసుకుంటానని చెప్పకనే చెప్పినట్లు అయింది. 

(795)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ