WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

డిజిపి రేసులో ఆ నలుగురు...!?

డిజిపి నియామకానికి సంబంధించిన కేంద్ర నిబంధనలను పక్కన పెట్టి..స్వంతంగా చట్టాన్ని సవరించుకున్న రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఆ పోస్టులో నిబంధనల ప్రకారం నండూరి సాంబశివరావును నియమించారు. ప్రస్తుత డిజిపి మాలకొండయ్యను అదే నిబంధనల ప్రకారం నియమించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన చట్టం ప్రకారం డిజిపిగా నియమితులైన వారు..తప్పనిసరిగా సర్వీసును బట్టి రిటైర్‌ కావాల్సిందే తప్ప..ఎటువంటి పొడిగింపులు ఉండవు. కానీ...ఒకటి రెండు పత్రికలు..సోషల్‌మీడియాలో 'మాలకొండయ్య' సర్వీసును పొడిగింపు కావాలని కేంద్రానికి లేఖ రాశారని...ముక్కుసూటిగా...వ్యవహరించే...'మాలకొండయ్య' ఎన్నికల సమయంలో ఎదురు తిరుగుతారని...చెబుతున్నాయి. ఇది కావాలని టిడిపి ప్రభుత్వంపై బురద జల్లడమే తప్ప...నూతన చట్ట ప్రకారం ఏ అధికారికి సర్వీసు పొడిగింపు ఇవ్వడం కుదరదు. తెలిసి ఇటువంటి కథనాలు ప్రచురించి...అటు పత్రికలు..ఇటు వెబ్‌సైట్లు అప్రదిష్ట మూట కట్టుకుంటున్నాయి. ఇది ఇలా ఉంటే...జూన్‌లో మాలకొండయ్య రిటైర్‌ కానుండడంతో...నలుగురు సీనియర్‌ అధికారులు..డీజీపీ రేసులో ఉన్నారని పోలీసు వర్గాలు అంటున్నారు. ఎసీబీ డిజిపి ఠాకూర్‌, విజయవాడ పోలీసు కమీషనర్‌ గౌతమ్‌ సవాంగ్‌, ఆర్టీసీ ఎండి సురేంద్రబాబు, హోంశాఖ ముఖ్యకార్యదర్శి అనురాధ(సురేంద్రబాబు భార్య) తెరపైకి వస్తున్నాయి. మరో ఇద్దరు ముగ్గురు అధికారుల పేర్లు ప్రచారంలో ఉన్నా...పైన పేర్కొన్న నలుగురిలో ఎవరినో ఒకరిని పదవిలో ఎంపిక చేసే అవకాశం ఉంది. మాలకొండయ్యను నియమించకముందే..తనకు డీజీపీ పదవి వస్తుందని 'ఠాకూర్‌' భావించినా...ఆఖరు నిమిషంలో తప్పిపోయింది. ఈసారి ఆ పోస్టు తనకు దక్కడం ఖాయమని 'ఠాకూర్‌' పూర్తి నమ్మకంతో ఉన్నారు. గౌతమ్‌ సవాంగ్‌ కూడా..ఆ పోస్టు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. వీరిద్దరూ రాష్ట్రేతర పోలీసులు అధికారులు. ఆర్టీసీ ఎండి సురేంద్రబాబు 'చంద్రబాబు' సామాజికవర్గానికి చెందిన ఐపిఎస్‌ అధికారి. 'అనురాధ' సురేంద్రబాబు సతీమణి. ఈ నేపథ్యంలో 'కమ్మ' సామాజికవర్గానకి చెందిన 'మాలకొండయ్య'కు డీజీపీ పదవి ఇచ్చారు. మళ్లీ అదే సామాజిక వర్గానికి ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. అనురాధ సామాజికవర్గం ఏదైనప్పటికీ...ఆమె సురేంద్రబాబు సతీమణి కావడంతో...ఆమెను కూడా 'కమ్మ' సామాజికవర్గం కిందే పరిగణిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ...సామాజికవర్గానికి పరిగణలోకి తీసుకోకుండా..నిజాయితీనీ..పరిగణలోకి తీసుకుంటే...డీజీపీ రేసులో ఉన్న సురేంద్రబాబు నెంబర్‌వన్‌ అధికారిగా పేరుంది. 'చంద్రబాబు'కు వీరవిధేయుడుగా పేరొన్న 'ఠాకూర్‌'కు డీజీపీ పోస్టు దక్కడం ఖాయమని కొందరు ఐపిఎస్‌ అధికారులు మీడియా వర్గాలతో చెబుతున్నారు. 

  ఇంత వరకు..మహిళా ఐపిఎస్‌ అధికారుల్లో ఏ ఒక్కరికీ డిజీపీ పోస్టు దక్కని విషయం యధార్థమే. ఒకవేళ దీనిని పరిగణలోకి తీసుకుంటే 'అనురాధ'కు డీజీపీ పోస్టు దక్కే అవకాశం ఉంటుంది. కానీ...ఇంటిలిజెన్స్‌ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించడంలో ఆమె విఫలమయ్యారనే కోపంతో..ఎంతో ప్రాధాన్యత కల పోస్టు నుంచి ఆమెను బదిలీ చేశారు 'చంద్రబాబు'. ఈ నేపథ్యంలో ఆమెను ఈ పోస్టు కోసం పరిగణలోకి తీసుకోవడం కష్టమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ నలుగురిలో ఒకరికి డిజిపి పోస్టు దక్కడం ఖాయమని..ఇక అనివార్య పరిస్థితుల్లో...కేంద్ర సర్వీసులో ఉన్న ఐపిఎస్‌ అధికారులకు ఆ పోస్టు దక్కినా ఆశ్చర్యపోనవసరం లేదు. విధాన నిర్ణయాలను ఆఖరి నిమిషంలో తీసుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు జూన్‌ 25 వరకు తన మనోగతం బయటపెట్టరు. సురేంద్రబాబు కన్నా..ఠాకూర్‌నే ఆ పోస్టులో నియమించాలని..బలమైన ఉత్తరాది లాబీ తెరవెనుకుండి..తంతగాన్ని నడిపించే అవకాశాలున్నాయి. ఇది ఇలా ఉంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న 'దినేష్‌కుమార్‌' సెప్టెంబర్‌లో రిటైర్‌ కానున్నందున...ఆయన స్థానంలో సిఎంఒ ఇన్‌ఛార్జి సతీష్‌చంద్రను నియమిస్తారని..ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రెండు ప్రాధాన్యత కల పోస్టుల్లో ఒక ప్రాంతం వారికి కల్పిస్తారా..? లేక ఒకరికి మాత్రమే అవకాశం ఇస్తారా..? దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. సిఎం చంద్రబాబు మనసులో కాబోయే సిఎస్‌ ఎవరనేది...ఆయననిర్ణయం తీసుకుంటే...డిజిపి ఎవరిని నియమిస్తారో...అప్పుడే పూర్తి స్థాయి స్పష్టత వస్తుంది.


(341)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ