WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

విఫలమైన ఇంటిలిజెన్స్‌-పట్టించుకోని 'బాబు'...!

చంద్రబాబు ప్రభుత్వంపై ఎవరెవరు ఏ విధంగా ఆరోపణలు, విమర్శలు చేస్తారో..అనే విషయంలో ఇంటిలిజెన్స్‌ విభాగం ఘోరంగా విఫలమైందని..మంత్రులు, ఎమ్మెల్యేలు విరుచుకుపడుతున్నారు. గతంలో ఇంటిలిజెన్స్‌ విభాగం అధిపతిగా పనిచేసిన 'అనురాధ' సమర్థంగా పనిచేయలేదని బదిలీ చేసిన 'చంద్రబాబు' ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలపై విఫలం చెందిన ఆశాఖాధిపతిపై వేటు వేయడానికి జంకుతున్నారు. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు..ఐవైఆర్‌.కృష్ణారావు, అజయ్‌కల్లంలు ఎప్పుడు ఎవరిని కలిశారు..అనే విషయాన్ని ఇంటిలిజెన్స్‌ విభాగం కనిపెట్టలేకపోయింది. 'చంద్రబాబు'ను వ్యతిరేకించే మీడియా వర్గాలు ఐవైఆర్‌, అజయ్‌లను అనేకసార్లు కలిశారని..వారిచ్చిన సూచనలతోనే బయటకు వచ్చి విమర్శలు చేశారని మాట వినిపిస్తోంది. అయినా ఇంటిలిజెన్స్‌ విభాగం ఈ విషయాన్ని ముందుగా తెలుసుకోలేకపోయింది. త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. సకాలంలో సమాచారం తెలుసుకోలేని..ఇంటిలిజెన్స్‌ అధికారులను బాధ్యతల నుంచి తప్పిస్తారా..? జూన్‌లో నూతన డీజీపీని నియమించే సమయంలో ఇంటిలిజెన్స్‌ విభాగాధిపతిని కూడా బదిలీ చేసి..మరో సమర్థుడు, నిజాయితీపరుడైన ఐపిఎస్‌ అదికారిని నియమిస్తారా..? ఈవిషయంలో అటు మంత్రులు కానీ..పార్టీ ముఖ్యులు కానీ..తమ అభిప్రాయాలను బయటపెట్టడంలేదు. సిఎం చంద్రబాబు మనసులో ఎటువంటి ఆలోచన ఉంది. ఇంటిలిజెన్స్‌ విభాగంపై ఆయనకు ఏరకమైన అభిప్రాయం ఉంది. అనే విషయం బయటపడడం లేదు. కానీ ఇంటిలిజెన్స్‌ విభాగాధిపతికి సిఎంఒ అధికారుల మద్దతు ఉందని...అందుకే ఆయనను ఇప్పటికీ అదే పోస్టులో కొనసాగిస్తున్నారని..పోలీసు అధికారుల నుండి ఈ విషయం బయటకు పొక్కింది. డిఎస్పీల బదిలీలు, పోస్టింగ్‌ల వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా కలుగ చేసుకుని వాటిని పర్యవేక్షిస్తున్నారని ప్రచారం జరుగుతున్నా..డిజిపి, ఇంటిలిజెన్స్‌ అధికారి, సిఎంఒ అధికారి, హోంమంత్రిలు కలసి నిర్ణయం తీసుకుంటున్నారు. వీరు భర్తీ చేసిన పోస్టుల్లో...లక్షలు చేతులు మారాయని..వైఎస్‌ అభిమానులకు కీలక పోస్టులు దక్కాయని..గతంలో టిడిపిని ఇబ్బంది పెట్టిన వారిని కూడా ముఖ్యమైన ప్రాంత్లో ఉన్నారు. ఇంత తతంగం జరుగుతున్నా..ఈ విషయాన్ని సిఎం దృష్టికి తీసుకెళ్లలేదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఇలా చెప్పుకుపోతుంటే అనేక కారణాలు కూడా ఉన్నాయని...గతంలో ఎంతో సమర్థవంతంగా పనిచేసిన ఇంటిలిజెన్స్‌ విభాగం క్రమక్రమంగా దారి తప్పుతుందని..ఇప్పటికైనా ప్రక్షాళన చేసి...జిల్లా స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు సమర్థులైన అధికారులను నియమించకపోతే...2004 పరిస్థితి ఖాయమని కొన్ని వర్గాలు అంటున్నాయి.

(302)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ