కలెక్టర్లు భాస్కర్‌, ప్రవీణ్‌లను బదిలీ చేస్తారా...!? 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

కలెక్టర్లు భాస్కర్‌, ప్రవీణ్‌లను బదిలీ చేస్తారా...!?

పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ను విశాఖపట్నం కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసే అవకాశాలు ఉన్నాయి. మూడేళ్లుకు పైగా ఈ ఇద్దరు అధికారులు కలెక్టర్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలో వారిని బదిలీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. మరో సంవత్సరంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో...మూడు సంవత్సరాలకు పైగా..పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్న వారిని అక్కడే కొనసాగడానికి..ఎన్నికల సంఘం అంగీకరించదు. అప్పుడు ఎన్నికల సంఘంతో చెప్పించుకునే దాని కన్నా..ఇప్పుడే వారిని బదిలీ చేస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవనేది పాలకుల అభిప్రాయం. ఇదే విధమైన అభిప్రాయాన్ని కూడా ఆ ఇద్దరు కలెక్టర్లు వ్యక్తం చేస్తున్నారు. వీరి పనితీరు బాగా ఉన్నా...సమర్థత, నిజాయితీలతో బాధ్యతలు నిర్వహిస్తున్నా..ఎన్నికల సంఘం నిబంధనల మేరకు వారిని బదిలీ చేసే అవకాశం ఉంది. త్వరలో వీరిద్దరినీ బదిలీ చేస్తారా.. లేక...వీరిని అటు...ఇటు మారుస్తారా..? అనే దానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌ భాస్కర్‌ విషయంలో...సిఎంఒ కానీ..ఇతరులు కానీ...జోక్యం చేసుకునే అవకాశం లేదు. ఆయన బదిలీపై ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమే నిర్ణయం తీసుకుంటారు. 

  ఇప్పటికే మూడు సంవత్సరాలకు పైగా ఇక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్నాను..తనను బదిలీ చేయాలని 'భాస్కర్‌' కోరినా...సిఎం ససేమిరా..అన్నారు. ఎన్నికల కమీషన్‌ నిర్ణయం తీసుకుని బదిలీ చేయడం కన్నా..ప్రభుత్వమే..నిర్ణయం తీసుకుని ఇప్పుడు బదిలీ చేస్తే...ఆయన అప్పట్లోగా పరిస్థితులను ఆకలింపు చేసుకుంటారని అంటున్నారు. ఆయన బదిలీకి అధికారులెవరూ సహకరించలేదు. అదే విధంగా ప్రవీణ్‌కుమార్‌ విషయంలో కూడా సిఎం అదే అభిప్రాయంతో ఉన్నారా..? ఆయనపై సిఎం ఎటువంటి అభిప్రాయంతో ఉన్నారా..? అనేది తెలియదు. ఇంతకు ముందు భాస్కర్‌ను బదిలీ చేయాలని ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక సంస్థల ప్రతినిధులు అనేక సందర్బాల్లో కోరడం..దానికి సిఎం తిరస్కరించడం జరిగింది. తాజాగా ఏర్పడిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో...'భాస్కర్‌'ను కొనసాగించాలని వీరందరూ ముక్తకంఠంతో కోరుతున్నారు. ప్రవీణ్‌కుమార్‌కు సంబంధించిన విషయంలో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు..ఆయనను బదిలీ చేయమని కోరలేదు..ఏనాడూ బహిరంగ విమర్శలు చేయలేదు. ప్రవీణ్‌ను కూడా ఎన్నికల కమీషన్‌ నిబంధనల మేర బదిలీ చేయాల్సి ఉంటుంది. ఆయన కూడా ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో చిత్తశుద్దితో పనిచేశారనే అభిప్రాయం పాలకుల్లో ఉంది. చివరకు వీరిద్దరి బదిలీ వ్యవహారంలో సిఎం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారో తేలాల్సి ఉంటుంది.

(222)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ