WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

రిటైర్డ్‌ జడ్జి 'ఈశ్వరయ్య'పై 'యనమల' ధ్వజం...!

బిసి వర్గాలకు ముఖ్యమంత్రి 'చంద్రబాబు' వెన్నుపోటు పొడుస్తున్నారంటూ..హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి, జాతీయ బీసీ మాజీ కమీషనర్‌ ఈశ్వరయ్య చేసిన ఆరోపణలపై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా..అభ్యంతరం కూడా వ్యక్తం చేశారు. టిడిపికి పట్టుకొమ్మలైన బిసి వర్గాలను పార్టీకి దూరం చేయాలనే కుట్ర జరుగుతుందని, దీనిని ఆ వర్గాలన్నీ తిప్పికొడతాయని 'యనమల' హెచ్చరించారు. అంతే కాకుండా కుట్రదారులెవరైనా వారికి గుణపాఠం చెప్పడం ఖాయమని చెప్పారు. శుక్రవారం నాడు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వెనుకబడిన వర్గాలకు టిడిపి ప్రభుత్వం ఏమి చేసిందో...సంక్షేమ ఫలాలను అందుకుంటున్న ఆ వర్గాలకు తెలుసునని..కల్లబొల్లి మాటలతో..ఎవరెవరో రెచ్చగొడితే..సరిపోదని..ఉన్నత పదవులు అధిష్టించిన ఈశ్వరయ్య ఆ విధంగా వ్యాఖ్యానించడం సరికాదని 'యనమల' చెప్పారు. తెలుగుదేశం హాయంలో తొమ్మిది మంది హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులయ్యారని, మరి కొంత మంది మహిళలను న్యాయమూర్తులుగా నియమించడం జరిగిందని..ఇప్పుడు విమర్శలు చేసిన రిటైర్డ్‌ జడ్జి ఈశ్వరయ్య కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే హైకోర్టు జడ్జి అయ్యారని 'యనమల' గుర్తు చేశారు. టిడిపి ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల్లో జడ్‌పిటిసి,ఎంపిటీసీలు అయిన విషయం విమర్శలు చేసిన వారికి కూడా తెలుసనని 'యనమల' అన్నారు. 

  టిడిపిని ఇన్నిసార్లు అధికారంలోకి రావడానికి కారణం బిసీలేనని..గతంలో విమర్శలు చేసిన వారు కూడా అంగీకరించారని, విపక్షాల నాయకులు కూడా పరోక్షంగా అంగీకరించారని 'యనమల' గుర్తు చేశారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల సౌకర్యం కల్పించి..వారిని పంచాయితీ సర్పంచ్‌లుగా, ఎంపీపీలుగా జెడ్పీ ఛైర్మన్‌ పదవులు దక్కే విధంగా చేసిన ఘనత దివంగత ఎన్టీఆర్‌దేనని..ఏ పార్టీ అధికారంలో ఉన్నా...ఆ వర్గాలకు పదవులు దక్కడం టిడిపినే కారణమని 'యనమల' చెప్పారు. విమర్శలు చేసిన వారు తమ ఆరోపణలను వెనక్కు తీసుకోవాలని, టిడిపి అంటే బీసీల పార్టీ అనే గుర్తింపు ఉందని..వీరిని చెడగొట్టడం ఎవరి తరం కాదని 'యనమల' ధీమా వ్యక్తం చేశారు. రిటైర్డ్‌ జడ్జి మరియు జాతీయ బీసీ కమీషన్‌ మాజీ ఛైర్మన్‌ టిడిపి పక్షపాతి అని వారి బంధువులు అనేక పదవులు పొందారని, గతంలో చాలా మంది విమర్శలు చేశారు...ఈ విషయం అప్పట్లో సంచలనం సృష్టించింది. కానీ..ఈశ్వరయ్య యు టర్న్‌ తీసుకోవడం వెనుక ఎవరు ఉన్నారు...? 'చంద్రబాబు'పై విమర్శలు, ఆరోపణలు చేయమని ఎవరు ప్రోత్సహించారు..అనే వివరాలు తెలుసుకునేందుకు టిడిపి నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు.

(204)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ