WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

కృష్ణా జిల్లాకు అరుదైన గౌరవం...!

రోడ్డు ప్రమాదాల నివారణలో మొదటి స్థానం...!

రాష్ట్రస్థాయి అవార్డు కైవసం చేసుకున్న కృష్ణా జిల్లా...!

రోడ్డు ప్రమాదాల నివారణలో కృష్ణా జిల్లా అరుదైన అవార్డు దక్కించుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించడంలో మొదటి స్థానంలో ఉన్న కృష్ణా జిల్లా రవాణా అధికారులకు రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా అవార్డును అందజేశారు. వెలగపూడి సెక్రటేరియట్‌లోని బ్లాక్‌-1 సిఎం కాన్ఫరెన్స్‌లో నిర్వహించిన అవార్డుల ప్రధాన కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ మాలకొండయ్య, సిఎంఒ కార్యాలయ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌ చంద్రల చేతుల మీదుగా ఆ అవార్డును జిల్లా ఉప రవాణాశాఖాధికారి(టీడీసీ) ఈమీరా ప్రసాద్‌ అందుకున్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించడంలో పలుసూచనలు, సలహాలు ఇచ్చిన జిల్లా కలెక్టర్‌ లక్ష్మీకాంతం చేశారని...అంతే కాకుండా జిల్లాలో రోడ్డు సేప్టీ కమిటీకి ఆయనే నాయకత్వం వహిస్తుండడంతో ఆ అవార్డును టీడీసీ ఈమీరా ప్రసాద్‌ కలెక్టర్‌ లక్ష్మీకాంతానికి అంధజేశారు. జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల వల్ల 2016 సంవత్సరలో 839 మంది చనిపోగా...2017 సంవత్సరంలో735మంది చనిపోయారు. గత సంవత్సరం కంటే 12.40శాతం రోడ్డు ప్రమాదాలను నివారించినందుకు గాను...కృష్ణా జిల్లా రోడ్డు సేప్టీ చాంపియన్‌ అవార్డుకు ఎన్నికైంది.

(369)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ