WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

కర్ణాటక ఎన్నికల్లో తెలుగుపార్టీలు ఎటువైపు...!?

హోరాహోరిగా సాగుతున్న కర్ణాటక ఎన్నికలు...అధికార కాంగ్రెస్‌కు ముచ్చెమటలు పట్టిస్తుంటగా... అదేస్థాయిలో బిజెపి శ్రేణులు వణికిపోతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలవకపోతే...తమ పార్టీ రాబోయే సార్వత్రిక ఎన్నికలు, కొన్ని రాష్ట్రాల్లో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికల్లో కుదేలవుతుందని...బిజెపి ఆగ్రనాయకులు భావిస్తున్నారు. ఇటీవలే..స్వంత రాష్ట్రమైన గుజరాత్‌లో 'మోడీ' అపోసోపాలు పడి గెలిచాననిపించుకున్నారు. నాలుగేళ్ల పాలనలో ప్రజాగ్రహాన్ని ఎదుర్కొంటున్న 'మోడీ'కి...ఇప్పుడు కర్ణాటక ఎన్నికలు కంటిమీద కునుకుపట్టనీయడం లేదు. ప్రజల ఆగ్రహాన్ని చూసిన ఆయన ఇక్కడ ప్రచారానికి రావడానికి కూడా భయపడుతున్నారని వార్తలు వస్తున్నాయి. 'మోడీ' ప్రచారానికి రాకుండా ఉంటే బాగుండని...పలువురు బిజెపి నాయకులు అంతరంగిక సంభాషణలో చెబుతున్నారట. 'మోడీ'పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తమ కొంప ముంచుతుందన్న అభిప్రాయం వారిలో వ్యక్తం అవుతుండగా..పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో పనిచేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ గెలుస్తామనే విశ్వాసంలో ఉన్నా..పూర్తిస్థాయి మెజార్టీ రాదేమోనన్న బెంగ ఆ పార్టీలో కనిపిస్తోంది. ఇక జెడిఎస్‌ తమకు మెజార్టీ రాకపోయినా..హంగ్‌ అసెంబ్లీ వస్తుందని..రాబోయే ప్రభుత్వంలో తమదే కీలకపాత్ర అనే భావనతో ఉంది.

   ఇది ఇలా ఉంటే...కర్ణాటకకు పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు...కర్ణాటక ఎన్నికలను నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఆ రాష్ట్రంలో బిజెపిని ఓడించాలని ఈ రెండు రాష్ట్రాల్లోని రాజకీయపార్టీల్లో కొన్ని పిలుపునివ్వగా..మరికొన్ని ప్రస్తుతానికి మౌనం వహిస్తున్నాయి. కొన్ని పార్టీలకు చెందిన నేతలు..ఆయా పార్టీల తరుపున రహస్యంగా ప్రచారం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని మెజార్టీ ప్రజలు...బిజెపి ఓడిపోయాలని కోరుకుంటుండగా..కొన్ని రాజకీయపార్టీల అధినేతలు మాత్రం ఎలాగైనా..బిజెపిని గెలిపించాలనే ధ్యేయంతో పనిచేస్తున్నాయి. ఇటువంటి వాటిలో ఆంధ్రాకు చెందిన వైకాపా పార్టీ ఒకటి. వారు బిజెపి గెలుపు కోసం ఇప్పటికే...విజయసాయిరెడ్డిని అక్కడ దింపారని ప్రచారం జరుగుతోంది. ఆయన అక్కడ తెలుగువారితో మాట్లాడి..ఆ పార్టీని గెలిపించాలని రహస్యంగా కోరుతున్నారట. మరోవైపు.. తెలంగాణకు చెందిన టిఆర్‌ఎస్‌ పైకి తాము జెడిఎస్‌కు మద్దతు ఇస్తున్నామని చెబుతున్నా...బిజెపిని వ్యతిరేకించే తెలుగుఓటర్లల్లో చీలిక తెచ్చి..తద్వారా..బిజెపికి మేలు చేయాలనే తలంపుతో ఉన్నారనే మాటలు వినిపిస్తున్నాయి. కెసిఆర్‌ కర్ణాటకలో పర్యటించి..జెడిఎస్‌ను గెలిపించాలని తెలంగాణకు చెందిన వారికి పిలుపునిచ్చారు. 

  ఎన్నికలు ముగిసిన తరువాత బిజెపి, జెడిఎస్‌ పొత్తు పెట్టుకుంటాయనే విశ్లేషణలు వినిపిస్తున్నసమయంలో...ఆయన జెడిఎస్‌కు మద్దతు ఇవ్వాలని ప్రకటించడం..పరోక్షంగా బిజెపికి మేలు చేసేందుకేనన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఇక ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ...ఇప్పటి వరకు ఎవరికీ మద్దతు ఇవ్వకపోయినా...ఆ పార్టీ బిజెపిని ఓడించాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. తెలుగుదేశానికి చెందిన సానుభూతిపరులు ఎక్కువ మంది కర్ణాటకలో కాంగ్రెస్‌ గెలవాలని..ఆపార్టీని గెలిపిస్తామని బహిరంగంగానే చెబుతున్నారు. అయితే..పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం ఇంత వరకు ఈ విషయంపై నోరు తెరవలేదు. మొత్తం మీద...కర్ణాటక ఎన్నికల్లో...తెలుగు పార్టీల హడావుడి బాగానే ఉందని..తెలుగు ఓటర్లను ఈ పార్టీలు కొంత వరకు ప్రభావితం చేయగలవనేది విశ్లేషకుల అభిప్రాయం.


(235)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ