WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

భారీగా...ఐఎఎస్‌ల బదిలీలు...!?

మే మొదటివారంలో సచివాలయ శాఖాధిపతులను, వివిధ జిల్లాల కలెక్టర్లను, జాయింట్‌ కలెక్టర్లను ముఖ్యమంత్రి చంద్రబాబు బదిలీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా సచివాలయంలో వివిధశాఖాధిపతుల్లో సమర్థులకు పెద్దపీట వేసి...అసమర్థులతో పాటు, బాధ్యతలను సక్రమంగా నిర్వహించని వారిని పక్కన పెడతారని సిఎంఒ వర్గాలు చెబుతున్నాయి. సుమారు ఐదారుగురు కలెక్టర్లను బదిలీ చేయడం ఖాయమని..ఆ వర్గాలే ఆఫ్‌ ది రికార్డుగా బయటపెడుతున్నాయి. ఆర్థిక, రెవిన్యూశాఖలతో పాటు విద్య, పంచాయితీ, గ్రామీణాభివృద్ధి శాఖాధిపతుల్లో ఎక్కువ మందిని బదిలీ చేసి వారి స్థానంలో వేరే వారిని నియమించే అవకాశాలున్నాయి. ఆర్థికశాఖ ఇన్‌ఛార్జి బాధ్యతలను సీనియర్‌ అధికారుల్లో ఎవరికి అప్పచెప్పాలని సిఎం ఇంత వరకు నిర్ణయం తీసుకోలేదు. కలెక్టర్లుగా మూడేళ్లు పాటు పనిచేసిన వారిని బదిలీ చేయాలని మొదట సిఎం నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌ కె.భాస్కర్‌ మూడేళ్లుగా పనిచేస్తుండడంతో...ఆయన బదిలీ అవుతారని..ఎక్కువ మంది భావించారు. అయితే...ఆయనను అక్కడే కొనసాగించాలని తాజాగా సమాచారం వస్తోంది. వీరితో పాటు ప్రకాశం, గుంటూరు, నెల్లూరు, కృష్ణా, కర్నూలు జిల్లా కలెక్టర్లును బదిలీ చేయాలని సిఎం ఆలోచిస్తున్నారట. 

  నిన్నటి వరకు ఎల్‌వి సుబ్రహ్మణ్యంపై శీత కన్ను వేసిన సిఎం...ఆయనకు ప్రాధ్యాత కల పోస్టు ఇవ్వాలని భావిస్తున్నారట. కానీ..ఈ విషయంలో సిఎంఒ అధికారి ఒకరు అడ్డుపడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. సచివాలయంలో కీలక ప్రాధాన్యత శాఖాధిపతిగా పోస్టు పొందాలని 'పునీతా' తపన పడుతున్నారు. ఇంతకు ముందు ఆయన రోడ్డు,భవనాలశాఖ కానీ..పంచాయితీశాఖ కార్యదర్శి పదవి పొందాలని సిఎంను అడిగారు. మానవ వనరులశాఖాధిపతి ఆధిత్యనాథ్‌దాస్‌పై సిఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన సచివాలయానికి కనీసం రెండు రోజులు కూడా రావడంలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో 'దాస్‌'కు బదిలీ తప్పదని..ఆ వర్గాల నమ్మకం. వీటిపై ఇప్పటికే ఇద్దరు ముగ్గురు అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించినట్లు బయటకు పొక్కినా...చివరి వరకు ఉత్తర్వులు జారీ అయ్యే వరకు అనుమానమేనని సచివాలయ ఉద్యోగవర్గాల అభిప్రాయం. మరో సంవత్సరం లోపు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని భారీగా మారుస్తారా..? లేదా..ఇలాగే కొనసాగిస్తారా..? మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

(461)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ