WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'ముద్దు' వారసులకు 'నగరి' టిక్కెట్‌ లేనట్లే...!?

పిట్టపోరు..పిట్టపోరు పిల్లి తీర్చిన చందంగా...'చంద్రబాబు' తన అపార రాజకీయ అనుభవంతో...దివంగత టిడిపి నేత ముద్దుకృష్ణమనాయుడు కుమారులు కలహాన్ని తనకు అనుకూలంగా మలచుకున్నారు. టిడిపి ఎమ్మెల్సీ సీటును 'ముద్దు' భార్యకు కేటాయించి...తన రాజకీయ చతురతను చూపించారు. 'ముద్దు'పై నగరిలో ప్రజల్లో అపారమైన నమ్మకం,విశ్వసనీయత ఉన్నాయి. దానిని అనుకూలంగా మలచుకోవడంలో 'ముద్దు' కుమారులు విఫలమయ్యారు. ఎమ్మెల్యే ఎలా ఉండాలి..?మంత్రి పదవిలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి..? అనే దానిపై పలువురు రాజకీయనాయకులకు ఆదర్శమైన 'ముద్దు' ఈ రోజుకి రాష్ట్ర నలుమూలల అభిమానులు ఉన్నారన్నది నిజం. అటువంటి మహనీయుడైన నాయకుని కుమారులైన వారు..పరస్పరం చర్చించుకుని రాజకీయంగా ఎదగాల్సిన వారు..తమకు ఎమ్మెల్సీ కావాలి..ఇన్‌ఛార్జి కావాలని కోరడంతో...ఆయన ఆగ్రహంతో ఆ సీటును 'ముద్దు' భార్యకు కేటాయించడం జరిగింది. అంతకు ముందు కుటుంబసభ్యులతో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కానీ...ఎమ్మెల్సీ కానీ..మీకు ఇవ్వను...మీ నాన్న ఎమ్మెల్సీ ఇస్తా..అని 'చంద్రబాబు' చెప్పిన సమయంలో ఇద్దరిలో ఒకరు ఆ పదవి కోరుకుంటే...వివాదం లేకుండా ఉండేది. 'ముద్దు' భార్యకు ఎమ్మెల్సీ రావడంతో..భవిష్యత్‌లో ఎమ్మెల్యే సీటు విషయంపై వారికి స్పష్టత రావడం లేదు. దీనిని బట్టి చూస్తే..'నగరి' సీటు మరొకరికి ఇవ్వాలని నిర్ణయించారు. ఆ ఒక్కరు ఎవరు అనే విషయాన్ని 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' గతంలోనే ప్రచురించింది. ఇదే ప్రాంతంలో ఉన్న టిటిడి జెఇఒ శ్రీనివాసరాజుకు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలో రాజులు, బీసీలు, కమ్మ సామాజికవర్గానికి చెందిన వారు..టిడిపిని సమర్థిస్తారు. దీంతో..టిడిపి విజయం సాధిస్తుందని చంద్రబాబునమ్మకం. సొమ్ములు లేని 'ముద్దు' కుటుంబసభ్యుల కన్నా...ఎన్నికోట్లు అయినా ఖర్చు పెట్టగలిగిన 'శ్రీనివాసరాజు'కు టిక్కెట్‌ ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. దీంతో..'ముద్దు' రాజకీయ వారసుల రాజకీయ జీవితానికి ఫుల్‌స్టాఫ్‌ పడినట్లే. ముద్దు కుమారుల అంతకలహాలు..ఆధిపత్యపోరు..ఆ కుటుంబానికి శాపంగా మారిందని చెప్పవచ్చు.


(485)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ