WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'ఆ ఎమ్మెల్సీ తాచుపాములాంటోడు...!

వాళ్లిద్దరూ రాజకీయ చైతన్యం కలిగిన జిల్లా చెందిన నాయకులు. వారిలో ఒకరు ఓసీ వర్గానికి చెందిన వారు...మరొకరు..అణగారిన వర్గాలకు చెందిన వారు. గతంలో కాంగ్రెస్‌ రాష్ట్రంలో అధికారం చెలాయించినప్పుడు...ఇద్దరూ రెండు సామాజికవర్గాల కోటాలో..మంత్రి పదవులు పొందారు. దివంగత వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి కుటుంబానికి వీరవిధేయులు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు ఇద్దరూ జిల్లాలో చక్రం తిప్పారు. అయితే...కాలం మారింది...! రాష్ట్ర విభజనతో..కాంగ్రెస్‌కు రాష్ట్రంలో నూకలు చెల్లిపోవడంతో...ఇద్దరు నాయకులు చెరో పార్టీనీ ఆశ్రయించారు. ఆయా పార్టీల తరుపున... పనిచేస్తూ...మళ్లీ రాజకీయంగా పైచేయి సాధించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకరు గతంలో తాను దూషించిన పార్టీలోనే చేరి...ఎమ్మెల్సీ అయ్యారు. మరొకరు....రాజకీయంగా తనను అధికార పార్టీ వేధిస్తుందని భావించి..జాతీయ పార్టీలో చేరిపోయారు. అయితే...ఇటీవల కాలంలో ఈయన పార్టీ మారతారని ప్రచారం జరిగింది. 

  ఈ నేపథ్యంలో...ఆయనను తమ పార్టీలోకి ఆహ్వానించాలని..ఆ ఎమ్మెల్సీని..పార్టీ నాయకులు కోరారు. అయితే...దానిపై ఆ ఎమ్మెల్సీ స్పందిస్తూ...మనకెందుకు..అతనితో...వదిలేయండి...? అని చెప్పాడట. అయితే...ఇదే విషయాన్ని ఆయన పక్కన ఉన్న నాయకులు...సదరు మాజీ కాంగ్రెస్‌ నాయకుడికి..తెలిపారట. అమ్మో...ఆ ఎమ్మెల్సీ తాచుపాములాంటోడు...వాడితో...పెట్టుకోలేం...!? ఎప్పుడు కాటేస్తాడో..తెలియదు...? అతని పక్కన ఉంటే...తాచు పామును పక్కన పెట్టుకుని తిరిగినట్లే...అని వ్యాఖ్యానించారట. అయితే...ఆశ్చర్యకరంగా..వారిద్దరూ..ఒక ఫంక్షన్‌లో ఎదురైయ్యా రట. అప్పుడు ఇద్దరూ..ఎంతో ఆప్యాయంగా...'అన్నా' ఎలా ఉన్నావు..?అని ఒకరి యోగక్షేమాలు.. మరొకరు..అడిగి తెలుసుకున్నారు. ఈ సన్నివేశాన్ని చూసిన..ఆ నాయకులు..అమ్మో..ఈ మాజీ కాంగ్రెస్‌ నేతలతో చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించుకున్నారట.


(523)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ