WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

సీటు ఇస్తే...వందకోట్లు ఖర్చుపెడతానంటున్న టిడిపి మాజీమంత్రి...!

ఆయన రాజకీయాలకు కొత్త. అధికారిగా పనిచేసి...గత ఎన్నికల సమయంలో రాజకీయాల్లోకి వచ్చారు. ముందు ప్రతిపక్ష వైకాపాలో చేరదామని వెళ్లారు. కానీ..అక్కడ పుల్‌ అయిపోవడంతో... టిడిపిలో చేరారు. టిడిపి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. అధికారిగా పనిచేసిన అనుభవంతో పాటు...సామాజిక సమీకరణలు కలసి రావడంతో...ఏకంగా కీలకమైన శాఖకు మంత్రి అయిపోయారు. మంత్రి అయిన దగ్గర నుంచి మనోడి ప్రవర్తన మారిపోయింది. తనకు ఎదురులేదని...అందరూ తన మాటే వినాలని..రెచ్చిపోయి..వీర'కిశోర్‌'ంలా ప్రకటనలు గుప్పించారు. అంతే కాదు..శాఖను తన గుప్పెట పట్టారు. ప్రతి పనికి కమీషన్లు దండుకుని వందల కోట్లు సంపాదించారట. పైసల్‌ లేనిదే ఎటువంటి పని చేసేది లేదని...అధికారులకు తేల్చి చెప్పారు. తన మాట వినని అధికారులపై ఒంటికాలిపై లేస్తూ...బూతులు తిడుతూ...బెదిరించి పనులు చేయించుకుని వందలకోట్లు వెనుకేసుకున్నారట. 

  ఇవన్నీ అధికారికంగా సంపాదన కోసం అనుసరించిన విధానమైతే..రాజకీయంగా బలపడడానికి నియోజకవర్గంలో ప్రత్యేక గ్రూపులు ఏర్పాటు చేసి.. పార్టీతో సంబంధం లేకుండా...ఒంటరిగానే గెలవాలని భావించారట. దీంతో తనను గెలిపించిన వారిని...స్వంత సొమ్ము ఖర్చుచేసుకుని పార్టీ కోసం కష్టపడ్డవారిని దూరం పెట్టారు.  సొంత సొమ్ములు ఖర్చుపెట్టుకుని పార్టీ కోసం పనిచేసిన వారు..ఈయన వ్యవహారంపై  ముఖ్యమంత్రి చంద్రబాబుకు పదే పదే ఫిర్యాదులు చేశారు. దీంతో సిఎం..మంత్రిని పిలిపించుకుని..ఒకటికి రెండుసార్లు హెచ్చరించారు. అయినా మార్పు రాకపోవడంతో..మంత్రి పదవి నుంచి తొలగించారు. మంత్రి పదవి నుంచి తొలగించిన తరువాత కూడా ఆయనలో మార్పులేదు. సరికదా...తనను మంత్రి పదవి నుంచి తొలగించిన వారిపై కక్ష తీర్చుకుంటానని ప్రగల్బాలు పలుకుతున్నారట. అంతే కాదు..పార్టీని చీల్చుస్తానని..తన వెనుక 40మంది ఎమ్మెల్యేలు ఉన్నారని...ప్రకటించుకున్నారు. వైకాపా నాయకులతో కలసి...పార్టీలో చేరతానని..అవకాశం ఇవ్వాలని కోరారు. వారు స్పందించకపోవడంతో..కొన్నాళ్లు మౌనంగా ఉన్న ఈ మాజీ మంత్రి ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో..మరోసారి వార్తల్లోకి వస్తున్నారు.

   వచ్చే ఎన్నికల్లో తనకు ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పిస్తే...వంద కోట్ల రూపాయలు ఖర్చు చేస్తానని ఆయన బహిరంగంగానే చెబుతున్నారట. తన ఆఫర్‌ను వైకాపా అధినేత 'జగన్‌'కు కూడా మధ్యవర్తుల ద్వారా చెప్పించారట. అయితే...ఆయన వంద కోట్లు ఖర్చు పెట్టినా..గెలుస్తాడనే నమ్మకం లేదు..ఆయనను తీసుకుంటే లాభం ఏమిటని 'జగన్‌' వారిని ప్రశ్నించారట. ముందు పార్టీలో చేరమను..తరువాత సీటు సంగతి చూద్దామని 'జగన్‌' చెప్పారట. దీంతో వచ్చిన మధ్యవర్తులు.. విషయాన్ని మాజీమంత్రిగారికి విన్నవించారట. విషయం విన్న మాజీ మంత్రి...ఆ పార్టీ కాకపోతే 'జనసేన'...అదీ కాకపోతే...బిజెపి ఉండనే ఉందని..తాను వందకోట్లు ఖర్చు పెడితే..పార్టీ ఏదైనా తన గెలుపు ఖాయమని ఆయన విశ్వసిస్తున్నారట.

(840)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ