WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'పురంధేశ్వరి'కి షాక్‌ ఇచ్చిన తెలుగు ఓటర్లు...!

కేంద్ర మాజీ మంత్రి, బిజెపి నాయకురాలు 'దగ్గుబాటి పురంధేశ్వరి'కి కర్ణాటకలోని తెలుగు ఓటర్లు షాక్‌ ఇచ్చారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా...తెలుగు ఓటర్లు ఎక్కువగా ఉన్న క్యాంపులకు వెళ్లిన ఆమెను..అడుగడుగునా..తెలుగు ఓటర్లు నిలదీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసిన బిజెపి తరుపున ఎలా ఓట్లు అడుగుతున్నావని ఆమెను నేరుగానే ప్రశ్నిస్తున్నారు. నందమూరి తారకరామారావు కుమార్తెగా ఆమెపై తమకు గౌరవం ఉందని...కానీ...ఆమె..ఆంధ్రాకు అన్యాయం చేసిన వారి వైపే ఉంటారని అక్కడి ఓటర్లు ఆమెపై ధ్వజమెత్తుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో...ఆమె కాంగ్రెస్‌ పార్టీ తరుపున కర్ణాటకలో ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేయాలని...ఆమె వారిని కోరారు.

  గతంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రమంత్రి హోదాలో ఆమె ప్రచారం చేశారు. అప్పట్లో..కాంగ్రెస్‌ రాష్ట్ర విభజనకు శ్రీకారం చుట్టింది. అదే సమయంలో ఆమె అక్కడ ప్రచారానికి వెళ్లారు. అప్పట్లో...రాష్ట్ర విభజన వద్దని..కర్ణాటకలో ఉన్న తెలుగువారు కోరుకోగా...'పురంధేశ్వరి' మాత్రం అధిష్టానం ఆదేశాలంటూ...కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు. ఇదంతా గతం కాగా..రాష్ట్ర విభజన తరువాత..బిజెపిలో చేరిన ఆమె ఇప్పుడు ఆ పార్టీ తరుపున ప్రచారం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు విభజిత ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేస్తామని కల్లబొల్లికబుర్లు చెప్పి...ఆడిన మాట తప్పిన బిజెపిపై...తెలుగు ప్రజలు ధ్వజమెత్తుతున్న సందర్భంలో మరోసారి ఆమె ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆమెను..అక్కడి తెలుగుఓటర్లు అడుగడుగునా నిలదీస్తున్నారు. 'మీరు ప్రతిసారి..ఆంధ్రాకు అన్యాయం చేసిన పార్టీలనే వెనకేసుకొస్తున్నారు...గతంలో కాంగ్రెస్‌ అన్యాయం చేస్తే...ఆ పార్టీ తరుపున ప్రచారానికి వచ్చారు..ఈసారి...'మోడీ' వంచన చేస్తే...ఇప్పుడూ..వంచన చేసిన వారికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు..ఇది సరికాదు..మేము..మీరు చెప్పేదేమీ..వినం..అని ఖరాఖండిగా చెప్పేశారట. 

 కృష్ణా జిల్లా మూలాలు ఉన్న కొందరు మాట్లాడుతూ..'అన్న' కుమార్తెగా ఇక్కడకు వచ్చిందంటే... అభిమానం చూపిస్తాం..కానీ..మోసం,వంచన,దగా చేసిన 'బిజెపి' తరుపున ఆమె ప్రచారం చేస్తూ..ఓట్లు అడుగుతుంటే తమకు కంపరంగా ఉందని...ధ్వజమెత్తారు. కాగా..తనపై ధ్వజమెత్తు తున్న తెలుగుఓటర్లను...సముదాయించలేక 'పురంధేశ్వరి'..అధిష్టానం ఆదేశాలతో..ఇక్కడకు వచ్చాను...ఆంధ్రాకు..బిజెపి న్యాయం చేస్తుందనే మాటలు చెప్పి బయటపడుతోందట. మొత్తం మీద..ఆంధ్రాకు అన్యాయం, మోసం చేసిన పార్టీల వైపే 'పురంధేశ్వరి' ఉంటారని, ఆమెకు రాష్ట్ర ప్రయోజనాలపై ఆసక్తి లేదని, స్వార్థ, వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమని...ఆమె మరోసారి రుజువు చేసిందని...కర్ణాటకలోని తెలుగు ప్రముఖుడు ఒకరు వ్యాఖ్యానించారు.


(700)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ