WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

శివారు ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా

మంచినీటి సమస్య తలెత్తకుండా టోల్‌ఫ్రీ నెంబర్‌...!

నగర పాలక అభివృద్ధి పనులపై కలెక్టర్‌ 'కోన' సమీక్ష..!


గుంటూరు పట్టణ పరిధిలో మంచి నీటి పైపుల మరమ్మత్తుల దృష్ట్యా మంచినీటి  సరఫరా జరగని శివారు ప్రాంతాలకు వారం  రోజులపాటు   ట్యాంకర్ల  ద్వారా మంచి నీటి  సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ ఆధికారులను ఆదేశించారు.   జిల్లా కలెక్టర్, నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారి కోన శశిధర్  మునిసిపల్ కమీషనర్ శ్రీకేష్ తో కలిసి నగరంలో మెరుగైన త్రాగునీటి సరఫరా కొరకు జరుగుచున్న యు జి డి పనుల వేగవంతం మరియు పలు అభివృద్ధి పనులపై నగర పాలక సంస్థ,  ప్రజారోగ్య శాఖ ఇంజనీరింగ్ అధికారులతో బుధవారం నగర కమీషనర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

   ఈ సమీక్షా సమావేశంలో  కలెక్టర్ మాట్లాడుతూ  గత రెండు రోజులుగా నగరంలోని కొన్ని ప్రాంతాలలో ఏర్పడిన మంచి నీటి సరఫరా సమస్యకు గల కారణాలను  తెలియజేయాల్సిందిగా కోరగా నగర పాలక సంస్థ యస్ ఈ  పైప్ లైన్  డిజైన్ ల  మరమ్మత్తు పనుల వివరాలు తెలిపారు.   నగరంలోని మంచినీరు సరఫరా చేయు పైప్ లైన్ల పూర్తి డిజైన్లను సిద్దం చేయాలని యస్ ఈ ని ఆదేశించారు.   ఈ సందర్భంగా నగరానికి మంచినీటి సరఫరా రోజుకు ఎన్ని యం యల్ డి లు అవసరమని, మనం ప్రస్తుతం ఎన్ని యం యల్ డి లు సరఫరా చేస్తున్నామని, నీటి వనరులు తదితర అంశాలపై క్షుణ్ణంగా సమీక్షించారు.  ఉండవల్లి నుండి మంగళగిరి పంపింగ్ కేంద్రం వరకు గ్రావిటీ ద్వారా, మంగళగిరి పంపింగ్ కేంద్రం నుండి తక్కెళ్ళపాడు పంపింగ్ కేంద్రం వరకు పైప్ లైన్ ల ద్వారా జరిగే వివరాలను అడిగి తెలుసుకున్నారు.  భవిష్యత్ లో నగరంలో పూర్తి స్తాయి నీటి సరఫరా జరిగేందుకు 1600 యం యం డయా పైప్ లైన్ కు పలు ప్రాంతాలలో ఉన్న గ్యాప్ లను అనగా నులకపేట  మరియు హైవే క్రాస్ రోడ్ల వద్ద ఉన్న గ్యాప్ లను వారం లోపు  పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.  ప్రస్తుతం నగరంలో త్రాగు నీటి సరఫరా తక్కువగా జరుగుచున్న రిజర్వార్ల వివరాలను అడిగి  తెలుసుకొని, బి.అర్  స్టేడియం, నల్ల చెరువు మరియు శ్రీనివాసరావు తోట ప్రాంతాలకు అవసరమైన నీటిని  ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలన్నారు.  నగర పాలక సంస్థలో ప్రపంచ బ్యాంకు నిధులతో అనుసంధాన పనులు పూర్తయ్యే వారంలోపు ప్రజలకు ఏమాత్రం మంచి నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అందుకోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు.  నగరంలో మంచి నీటి ట్యాంకర్ కొరకు కంట్రోల్ రూమ్ నెంబర్ 0863-2345103, 2345104 మరియు 9849908397 లకు  డయల్  యువర్ టాంకర్   ద్వారా ఫోన్ చేసిన రెండు గంటలలో నీటిని పొందవచునన్నారు.  మంగళగిరి నుండి తక్కెళ్ళపాడు పంపింగ్ కేంద్రం వద్ద గల పాత పైప్ లైన్ పని విధానం పై వివరాలు అడిగి తెలుసుకొని, పూర్తి స్తాయి మరమ్మతులు నిర్వహించి అందుబాటులోకి తీసుకు రావాలన్నారు.  అలాగే పంపింగ్ కేంద్రాల వద్ద విద్యుత్ అంతరాయ  సమస్యల వివరాలను అడిగిన  కలెక్టర్, మంగళగిరి పంపింగ్ కేంద్రం వద్ద తరచు విద్యుత్ అంతరాయాలు జరుగకుండా మంగళగిరి పంపింగ్ కేంద్రమునకు విద్యుత్ అంతరాయ సమస్య తలెత్తాకుండా సత్వరమే సంబంధిత ట్రాన్స్ కో  యస్ ఈ తో ఫోన్ ద్వారా చర్చింఛి డెడికేటెడ్ ఫీడర్ లైన్ ఏర్పాటు చేయాలన్నారు.  ట్రాన్స్ కో  కి చెల్లించవలసిన మొత్తాని వెంటనే చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. 

అనంతరం ఆనందపేట, బార ఇమాం పంజా తదితర ప్రాంతాలలో నూతన పైప్ లైన్ ఏర్పాటు విషయం పై వివరాలు అడుగగా 10 కిలోమీటర్ల ద్వారా పాత గుంటూరు లోని అతిసార పీడిత ప్రాంతాలలో నూతన పైప్ లైన్ ఏర్పాటు చేయుట పూర్తయిందని నగర మునిసిపల్ కమీషనర్ ప్రాంతాల వారీగా వివరించారు.  మిగిలిన 100 కిలోమీటర్లకు పైప్ లైన్ ల ఏర్పాటుకు రూ. 39 కోట్లతో సమగ్ర డి పి ఆర్ లను సిద్దం చేసి అనుమతుల కొరకు ఈ యన్ సి కి పంపామని కలెక్టర్ కు తెలియచేశారు.  ఈ విషయంపై  సత్వరమే స్పందించిన కలెక్టర్ డి యం ఏ ను  ఫోన్ లో సంప్రదించి  వీలైనంత త్వరలో అనుమతులు జారీ చేయాలని కోరారు.  అనంతరం నగరంలో ప్రధాన ప్రాంతాలలో కూడా డ్రైన్ లు లేకపోవుట పై అనేక పిర్యాదులు అందుతున్నాయని, రానున్న వర్షాకాలం ముందుగానే బి ఆర్ స్టేడియం, బ్రాడీపేట, శ్యామలా నగర్, వసంతరాయపురం తదితర ప్రాంతాల వారీగా అనుసంధానం చేస్తూ ప్యాకేజీల వారీగా సైడ్ డ్రైన్ ల అంచనాలను  వారం లోపు సిద్దం చేయాలని యస్ ఈ ని ఆదేశించారు.  అదేవిధంగా నగరంలో జరుగుచున్న యు జి డి పనులపై సమీక్షించి వై టు వై జంక్షన్ ల వరకు పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.  నగరంలో స్కూల్ జోన్ ప్రాంతాలలో జరుగుచున్న యు జి డి పనులు 48 గంటలలో యుద్ద ప్రాతిపదికన  గుంటలు పూడ్చాలని పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ అధికారులు, గుత్తేదారు ప్రతినిధులను ఆదేశించారు.  అలాగే ప్రజలకు అసౌకర్యం కలుగకుండా పనులు జరిగే ప్రాంతాలలో రేడియం ప్రమాద చూచిక స్టిక్కర్ బోర్డు లను  ఏర్పాటు చేయాలన్నారు.ఈ సమావేశం నందు అదనపు  కమీషనర్ కె రామచంద్రా రెడ్డి, యస్ ఈ   సత్యనారాణ,  ఈ ఈ లు     రామ్ నాయక్,   డి శ్రీనివాసరావు,   వెంకటేశ్వర రావు, పబ్లిక్ హెల్త్ ఈ   సంతోష్, షాపూర్జి పల్లోంజి సంస్థ ప్రతినిధీ   రమేష్  తదితరులు పాల్గొన్నారు.  

(181)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ