డిప్యూటీ కలెక్టర్‌గా విధుల్లో చేరిన క్రీడాకారుడు 'కిడాంబి'...! 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

డిప్యూటీ కలెక్టర్‌గా విధుల్లో చేరిన క్రీడాకారుడు 'కిడాంబి'...!

ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ కు రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్ గా నియమించిన సందర్భంగా బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ కోన శశిధర్ కు డిప్యూటీ కలెక్టర్ గా విధులలో చేరుతున్నట్లు శ్రీకాంత్ లిఖితపూర్వకంగా తెలియజేశారు. ఇందుకు సంబంధించిన జాయినింగ్ రిపోర్ట్ ను కలెక్టర్ కు అందజేశారు.

  ఈ సందర్భంగా కలెక్టర్ శశిధర్ మాట్లాడుతూ, బాడ్మింటన్ క్రీడా విభాగంలో అత్యంత ప్రతిభ కనపరచి అనేక విజయాలు సాధించి జిల్లాకు, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకువచ్చిన నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కిడాంబి శ్రీకాంత్ ను   డిప్యూటీ కలెక్టర్ గా నియమించిందని చెప్పారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, శ్రీకాంత్ కోరిక మేరకు గుంటూరు లో డిప్యూటీ కలెక్టర్ గా ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందని  చెప్పారు. క్రీడాకారునిగానే కాకుండా ప్రజల మన్ననలు పొందే ఉద్యోగిగా పేరు తెచ్చుకోవాలని అన్నారు.

  కిడాంబి శ్రీకాంత్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిగా ప్రభుత్వం తనకు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని, ప్రభుత్వ ఉద్యోగిగా సేవలందించేందుకు అవకాశం ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, జిల్లా కలెక్టర్ కు కృతజ్ఞతలు అని  అన్నారు. స్పోర్ట్స్ కేర్రీర్ ముగిసిన అనంతరం ప్రభుత్వం ఉద్యోగంలో చేరతానని ఆయన తెలిపారు. క్రీడలకు ప్రాదాన్యతనిస్తానని ఆయన వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తోందని, అందుకు నిదర్శనమే రాహుల్, సాత్విక్ లని అన్నారు. మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి కె. నాగబాబు, రాష్ట్ర బాడ్మింటన్ సంఘం అధ్యక్షులు రాయపాటి రంగారావు, తదితరులు పాల్గొన్నారు.

(238)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ