WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

దాచేపల్లి నిందితుడిని అరెస్టు చేస్తాం:కలెక్టర్‌ కోన

గుంటూరు జిల్లా దాచేపల్లిలో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తిని పట్టుకుని కరినంగా శిక్షిస్తామని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ తెలియజేసారు.  శాంతి భద్రతల పరిస్థితిని సమీక్షించేందుకు దాచేపల్లికి వచ్చిన కలెక్టర్ పరిస్థితిని ఐ.జి గోపాలరావు, యస్.పి వెంకట అప్పలనాయుడుతో కలిసి అదుపులోకి తీసుకువచ్చారు.  ఆందోళన చేస్తున్న ప్రజలకు నచ్చ చెప్పి బాధితురాలికి న్యాయం చేయుడంతో పాటు దుర్మార్గానికి పాల్పడ్డ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరుగుతుందని, అరెస్ట్ చేయడమే కాక అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తిపై ఉన్న చట్టాలన్ని ఉపయెగించి కరినంగా శిక్షిస్తామని కలెక్టర్ చెప్పారు.  దుండగున్ని పట్టుకునేందుకు స్పెషల్ టీం ఏర్పాటు చేసి గాలిస్తున్నామని, త్వరలోనే పట్టుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు.  ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నది ముఖ్యంగా బాధితురాల్లకు బాగా తెలిసినా వారై వుండడమే కాగ, ఇరుగు పొరుగు వారై వుండడం బాధాకరమని ఆయన అన్నారు.  ఇటువంటి వ్యక్తులను ఒక కంట కనిపెట్టాల్సిన అవసరం తల్లి తండ్రులపై ఎంతైనా వుందని కలెక్టర్ తెలిపారు. 

          బాధితురాలికి జి.జి.హెచ్ లో మెరుగైన వైద్యమందిస్తున్నారని, ఈ రోజు ఉదయం వెళ్లి పరామర్శించి రావడం కుడా జరిగిందని, పాప ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే వుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.  పాపకు చదువుకునేం దుకు ప్రభుత్వం తరపున సహకారం అందిస్తామని అంటే కాకుండా ప్రభుత్వం ఎక్స్ గ్రేసియాతో పాటు భవిష్యత్ లో అన్ని రకాలుగా అండ దండలుగా ఉంటామని తెలియజేసారు.   జిల్లా వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరుగకుండా వుందెందుకు ప్రజలలో చైతన్యం తెచ్చేందుకు డి.ఆర్.డి.ఎ , మెప్మా ల ద్వారా పలు కార్యక్రమాలను చేపట్టనున్నామని, పొలీస్ శాఖ వారు కూడా సబల అనే  కార్యక్రమాన్ని తీసుకువచ్చి ప్రజలో చైతనం  తేనున్నారని   తెలిపారు.  ముఖ్యమంత్రి గారు ఈ కేసు విషయమై ఎప్పటికప్పుడు జరుగుతున్నా పరిణామాలను తెలుసుకుంటు తమకు సలహాలు సూచనలు ఇస్తున్నారని అన్నారు. ఐ.జి కేవి.వి గోపాలరావు మాట్లాడుతూ తొమ్మిది సంవత్సరాల బాలికపై అరవై సంవత్సరాల వృద్దుడు అత్యాచారానికి పాల్పడం దురదృష్టకరమని డుండగున్ని పట్టుకుని కరినంగా శిక్షిస్తామన్నారు.  ప్రజలు అపోహలు నమ్మ వద్దని, పాప సురక్షితం గానే వుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.  ప్రజలు శాంతి భద్రతల విషయంలో పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.ఈ పర్యటనలో జాయింట్ కలెక్టర్ ఎ.యండి.ఇంతియాజ్, రూరల్ యస్.పి వెంకట అప్పల నాయుడు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.  

(100)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ