విశాఖ,వెస్ట్‌,కడప,విజయనగరం జిల్లా కలెక్టర్ల బదిలీ...! 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

విశాఖ,వెస్ట్‌,కడప,విజయనగరం జిల్లా కలెక్టర్ల బదిలీ...!

విశాఖపట్నం,పశ్చిమగోదావరి,కడప,విజయనగరం జిల్లాల కలెక్టర్లను బదిలీ చేయడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. తూర్పుగోదావరి, కృష్ణా,గుంటూరు,ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు కలెక్టర్లను బదిలీ చేయరు. కర్నూలు కలెక్టర్‌ను బదిలీ చేయాలా..? లేదా అనే విషయంపై స్పష్టత రావడం లేదు. ఇటీవల అధికారులతో ఈ విషయాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించి నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌గా 'కాటంనేని భాస్కర్‌'ను..అక్కడ పనిచేస్తోన్న 'ప్రవీణ్‌'ను పశ్చిమగోదావరిజిల్లాకు బదిలీ చేస్తారని తెలుస్తోంది. నిజాయితీగా పనిచేస్తోన్న విజయనగరం జిల్లా కలెక్టర్‌ 'వివేక్‌యాదవ్‌'పై కొందరు దుష్రృచారం చేస్తున్నారని..వారి మాటలను ముఖ్యమంత్రి చంద్రబాబు నమ్మి ఆయనను బదిలీ చేయాలని నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. కడప కలెక్టర్‌ బాబారావునాయుడు సర్వీసు కేవలం సంవత్సరం లోపు ఉన్న నేపథ్యంలో తనను డైరెక్టరేట్‌ అధిపతిగా నియమించాలని ఆయన ముఖ్యమంత్రిని కోరుతున్నారు. అంతే కాకుండా..ఆయన మరో ఆరు నెలల్లో ఐఎఎస్‌ వ్యవస్థ నుంచి తప్పుకుని...విశాఖపట్నం పాడేరు కానీ...లేక మరో నియోజకవర్గం నుంచో..ఎమ్మెల్యేగా కానీ..ఎంపీగా కానీ...టిడిపి అభ్యర్థిగా పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇద్దరు మంత్రులతో వేగలేక..వారి ఆధిపత్య పోరాటం మధ్య నలిగిపోతున్న నెల్లూరు జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజు గతంలో ముఖ్యమంత్రిని కలసి తనను బదిలీ చేయమని కోరారు. ఎందుకో గానీ...ముఖ్యమంత్రి ముత్యాలరాజును నెల్లూరులోనే కొనసాగించాలని భావిస్తున్నారు. 

  గుంటూరు కలెక్టర్‌ కోనశశిధర్‌ను హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండిగా నియమించాలని సిఎం భావిస్తున్నారు. (ఈ పోస్టులో కాంతిలాల్‌దండే ఉన్నారు) 'కోన' స్థానంలో 'ప్రకాశం'' జిల్లా కలెక్టర్‌ వియన్‌చంద్‌ను నియమించాలని సిఎం భావించినా...ఆఖరు నిమిషంలో ఇది ఆగిపోయింది. కర్నూలు జిల్లా కలెక్టర్‌ను బదిలీ చేయాలని ముఖ్యమంత్రి భావించినప్పటికీ స్థానిక నేతలు, డిప్యూటీ ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి ఆయనను అక్కడే కొనసాగించాలని పట్టుబడుతున్నారు. అనంతపురం జిల్లా కలెక్టర్‌ విషయంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. నిన్న మొన్నటి వరకు ఇద్దరు ముగ్గురు కలెక్టర్లను బదిలీ చేయాలని భావిస్తున్నారని బయటకు వార్తలు వచ్చాయి. అయితే...హఠాత్తుగా ఒక్కసారే నలుగురు నుంచి ఐదుగురు వరకు కలెక్టర్లను బదిలీ చేయాలని నిర్ణయానికి సిఎం రావడంపై పలు రకాలైన మాటలు వినిపిస్తున్నాయి. సచివాలయంలోని కార్యదర్శులను మార్చాలని సిఎం నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతున్నా...అవి లీకింగులకు మాత్రమే పరిమితమవుతున్నాయి. ఈ నెలాఖరు లోపల కలెక్టర్ల బదిలీలపై ఉత్తర్వులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

(355)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ