లేటెస్ట్

అలా అయితే ఆయన 'జగన్‌' ఎందుకవుతారు...?

ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వ్యవహారశైలి గురించి రకరకాలుగా ప్రజల్లోనూ, రాజకీయ నాయకుల్లోనూ, ఆయన పార్టీ కార్యకర్తల్లోనూ చర్చ జరుగుతూ ఉంటుంది. ఆయనకు ముక్కుసూటిగా వ్యవహరించడమే తెలుసనని, తెరచాటు రాజకీయాలు, అస్పష్టత, సంశయాలు, అదురు,బెదురు ఉండవని ఆయనను తెలిసిన వారు చెబుతారు. తాజాగా..ఇటువంటి సంఘటనే ఒకటి జరిగింది. టిడిపికి చెందిన 'జూపూడి ప్రభాకర్‌రావు' ఆ పార్టీకి రాజీనామా చేసి వైకాపాలో చేరిన విషయంపై జర్నలిస్టు వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎవరికి చెప్పకుండా..'జూపూడి' రహస్యంగా వైకాపాలో చేరడం, దానిపై వైకాపాలో కొంత మంది వ్యతిరేకత వ్యక్తం చేయడం జరిగింది. వైకాపాకు చెందిన 'సాక్షి' ఛానెల్‌లో 'జూపూడి' చేరికపై చర్చ జరుగుతున్న సందర్భంలో కొందరు కాలర్స్‌, వైకాపా కార్యకర్తలు ఆయన పార్టీలోకి రావడాన్ని నిరసించారు. ఈ సందర్భంగా 'సాక్షి' యాంకర్‌ 'కొమ్మినేని శ్రీనివాసరావు' కలుగ చేసుకుని 'జూపూడి'ని పార్టీలో చేర్చుకునే విషయంలో పార్టీ సరిగా వ్యవహరించలేదని, ఒక వ్యూహం ప్రకారం చేర్చుకోలేదనే వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా 'జూపూడి'ని హడావుడిగా పార్టీలో చేర్చుకోవడం వల్ల వైకాపా కార్యకర్తల నుంచి నిరసన వ్యక్తం అయిందని, అలా కాకుండా...'జూపూడి'ని చేర్చుకునే విషయంపై ముందుగానే మీడియాకు లీకులు ఇచ్చి ఉంటే బాగుండేదని, దీనిపై పార్టీలోనూ, ప్రజల్లోనూ చర్చ జరిగేదని, ఆ తరువాత ఆయనను పార్టీలో చేర్చుకుంటే...ఇంత నిరసన వచ్చేది కాదని వ్యాఖ్యానించారు. దీనిపై కొందరు జర్నలిస్టులు స్పందిస్తూ..'కొమ్మినేని' ఇంకా 'చంద్రబాబు' తరహా రాజకీయాల గురించే ఆలోచిస్తున్నారని, 'చంద్రబాబు' వలే ముందుగా లీకులు ఇచ్చి ఆ తరువాత..కొన్నాళ్లు నానబెట్టి, తర్జనభర్జనలు పడి..నిర్ణయం తీసుకుంటారని ఆయన వలే 'జగన్‌' నిర్ణయం తీసుకోవాలా..? ఒక నిర్ణయం తీసుకునే టప్పుడు ఎటువంటి జంకు లేకుండా, నిర్భయంగా 'జగన్‌' నిర్ణయాలు తీసుకుంటారని, ఆయన ఒక నిర్ణయం తీసుకున్న తరువాత వెనుక్కుపోరని, నానబెట్టడడం...అసలే ఉండదని వారు అంటున్నారు. చేయాలనుకున్న పనిని చేస్తారని, అంతే కాని 'చంద్రబాబు' వలే నాన బెడితే ఆయన 'జగన్‌' ఎలా అవుతారని ప్రశ్నిస్తున్నారు. 

(378)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ