WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'దాచేపల్లి' నిందితుడు 'సుబ్బయ్య' ఆత్మహత్య...!

దాచేపల్లిలో  మైనర్‌ బాలికను రేప్‌ చేసిన నిందితుడు 'సుబ్బయ్య' ఆత్మహత్య చేసుకున్నాడని వార్తలు వస్తున్నాయి. మైనర్‌ బాలికను రేప్‌ చేసి పరార్‌ అయిన 'సుబ్బయ్య' కోసం గుంటూరు జిల్లా పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. బుధవారం నాడు జరిగిన ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాలిక రేప్‌ సంఘటనపై సంబంధిత బాలిక బంధువులు, ఇతరులు రాస్తారోకో,ఆందోళనకు దిగడం, అది హింసాత్మకంగా మారడంపై ప్రభుత్వం ఈ వ్యవహారంపై సీరియస్‌గా దృష్టిసారించింది. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసి గాలిస్తోంది. నిన్న బాలికను రేప్‌ చేసిన 'సుబ్బయ్య' బంధువులను అరెస్టు చేసి...వారి ద్వారా...'సుబ్బయ్య'తో పోలీసులు ఫోన్‌తో మాట్లాడించారు. ఈ సందర్భంగా తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని 'సుబ్బయ్య' వారికి చెప్పినట్లు తెలిసింది. అయితే శుక్రవారం నాడు  గుంటూరు జిల్లా దైద-తేలుకుట్ల...గ్రామాల్లో అటవీ ప్రాంతంలో 'సుబ్బయ్య' చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని వార్తలు వస్తున్నాయి. ఆత్మహత్యకు పాల్పడింది..'సుబ్బయ్యే'నని ఆ ప్రాంత ప్రజలు స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ విషయంపై ప్రతిపక్ష వైకాపా నాయకులు, మహిళా సంఘాలు, ఇతర సంఘాలు ఆందోళన నిర్వహిస్తున్నాయి. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.  


(1256)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ