WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

పుత్రరత్నం కోసం...మంత్రి అయ్యన్న రాజకీయ త్యాగం...!

2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తాను పోటీ చేయకుండా తన కుమారుని రాజకీయ వారసునిగా రంగంలోకి దింపాలని రోడ్లు,భవనాలశాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు నిర్ణయం తీసుకోవడం విశాఖపట్నంలో సంచలనం సృష్టించింది. ప్రతి విషయంలో నిర్మొహాటంగా మాట్లాడుతూ బాహాటంగా విమర్శలు, ఆరోపణలు చేసే మంత్రి అయ్యన్నపాత్రుడుకు ఉన్న ఏకైక బలహీనత ఆయనకు పుత్రరత్నంపై ఉన్న ప్రేమేనని ఇన్‌ఛార్జి నాయకులు చెబుతున్నారు. కుమారుడు ఒత్తిడిపై మంత్రి ఆ విధంగా వ్యవహరించారా..? లేదా బలమైన కారణాలు ఏమైనా ఉన్నాయా..? అనే విషయంపై పలువురు నాయకులు ఆరా తీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక..ముఖ్యమంత్రితో మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అయ్యన్నపాత్రుడు గతంలో వలే నిజాయితీగా,సమర్థవంతంగా పనిచేయలేకపోయారు. పంచాయితీశాఖ మరియు గ్రామీణనీటిపారుదలశాఖకు మంత్రిగా అయ్యన్న ఉన్నప్పుడు ముఖ్యనిర్ణయాలన్నింటిపై ఆయన కుమారుడి ప్రభావం పనిచేసిందని విమర్శలు వచ్చాయి. అనేక అవినీతి ఆరోపణలతో తండ్రీ, కుమారుడు కూరుకుపోయారు. ప్రస్తుతం కూడా పేరుకే మంత్రి అయ్యన్న అని...పెత్తనమంతా కుమారుడిదేనని ఆశాఖలో ప్రచారం జరుగుతోంది. పంచాయితీరాజ్‌శాఖ మంత్రిగా అయ్యన్నపాత్రుడు బాధ్యతలు నిర్వహించేటప్పుడు...ఆయన లెటర్‌హెడ్‌లపై జారీ చేసిన ఉత్తర్వులను ఆగమేఘాలపై అమలు చేసేవారు..ఆశాఖాధిపతి 'జవహర్‌రెడ్డి'. రోడ్లు,భవనాలశాఖ మంత్రిగా 'అయ్యన్న' బాధ్యతలు చేపట్టినప్పుడు అదే విధంగా ఉత్తర్వులు జారీ చేయడంతో...ఆ ఉత్తర్వులను అమలు చేయకుండా..పూర్తి సమాచారం దగ్గర ఉండి తెప్పించుకుని సంబంధిత ఫైల్స్‌నుమంత్రికి పంపేవారు. 

 ఈ విషయంలో వారిద్దరి మధ్య ఏర్పడ్డ అభిప్రాయబేధాలు..సిఎంఒకు ఫిర్యాదు చేసే వరకు వెళ్లాయి. అంతకు ముందు గ్రామీణాభివృద్ధిశాఖకు సీనియర్‌ అధికారి బాధ్యతలను నిర్వహించేటప్పుడు... పాతపద్దతిలోనే ఆదేశాలు ఇచ్చినా...అమలు చేయకుండా..ఈ విధానం మంచిది కాదు..ఎప్పటికైనా ఇది మీకు ఇబ్బందులు తెస్తుంది..మీరు పైళ్లు సర్కులేట్‌ చేయమంటే...సంబంధించిన ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. దీంతో అయ్యన్న దూకుడుకు తెరపడింది. ఇప్పటికీ ఒక్కోసారి అదే విధంగా ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ..అధికారులు మాత్రం నిబంధనల మేరకే ఫైళ్లు పంపుతున్నారు. ఈ ఉత్తర్వులు వెనుక మంత్రి అయ్యన్న కుమారుడి ప్రమేయం ఉందని అందరికీ తెలుసు. అటువంటి లక్షణాలు కలిగిన పుత్రరత్నాన్ని రాజకీయ వారసుడిగా 'అయ్యన్న' తీసుకొస్తే..చంద్రబాబు ఓకే అంటారా..? అని టిడిపి నాయకులు ప్రశ్నిస్తున్నారు. తాను ఎన్నికల్లో పోటీ చేయమంటే పోటీ చేస్తానని తన కుమారునికి కూడా అవకాశం ఇవ్వాలని మంత్రి అయ్యన్న పట్టుపడుతున్నారు. 1996లో అనకాపల్లి ఎంపీగా అయ్యన్నపాత్రుడు విజయం సాధించి 1998లో ఓడిపోయారు.అప్పట్లో తాను ఎంపీగా గెలిచానని..మళ్లీ తనకు అవకాశం ఇవ్వాలని..తన కుమారునికి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని అయ్యన్న పట్టుబట్టే అవకాశం ఉంది. ఒక ఇంట్లో ఇద్దరికి ఇచ్చే అవకాశం లేదని 'చంద్రబాబు' తేల్చి చెప్పడం జరిగినా..అయ్యన్న విషయంలో ప్రత్యేక సడలింపు 'చంద్రబాబు' ఇస్తారా..? అనే విషయంపై వేచి చూడాల్సిందే.

(151)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ