WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఆరోపణలు ఉన్న రైల్వే ఉద్యోగే...టిటిడి ఛైర్మన్‌ సుధాకర్‌ యాదవ్‌కు ముద్దా....?

టిటిడి ఛైర్మన్‌గా చదలవాడ కృష్ణమూర్తి బాధ్యతలు నిర్వహించినప్పుడు...ఆయన అంతరంగిక అధికారిగా బాధ్యతలు నిర్వహించిన రైల్వే ఉద్యోగినే ప్రస్తుత ఛైర్మన్‌ సుధాకర్‌యాదవ్‌ తన పిఎస్‌గా నియమించుకోబోతున్నారు. రెండు రోజుల కిందట ఇఒకు లిఖితపూర్వకంగా 'గిరిధర్‌కుమార్‌'ను నియమించాలని కోరారు. రెండేళ్లపాటు అందినంత దోచుకోవడమే కాకుండా పలుసార్లు టిటిడి విజిలెన్స్‌ అధికారులు విచారణ జరిపి ఆయనపై వచ్చిన ఆరోపణలు నిజమేనని..అప్పటి ఛైర్మన్‌కు నివేదిక ఇచ్చారు. టిటిడిలో సుమారు వెయ్యిమంది ఉద్యోగులు వివిధ హోదాల్లో పనిచేస్తుండగా..రైల్వే అధికారిని అంతరంగిక అధికారిగా నియమించుకోవాల్సిన అవసరం సుధాకర్‌యాదవ్‌కు ఎందుకు కలిగింది. ఆ అధికారిని ఎవరు సిఫార్సు చేశారు..? ఒకవైపు అన్యమతానికి మద్దతుదారునిగా ఆరోపణలు ఎదుర్కొన్న 'సుధాకర్‌' మళ్లీ ఇప్పుడు...అంతరంగిక అధికారిగా రైల్వే అధికారిని నియమించుకోవడంపై యాదవసంఘాల నాయకులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 

  గతంలో సిఎంకు, మంత్రికి, విజిలెన్స్‌ అధికారికి ఆ అంతరంగిక అధికారిపై ఫిర్యాదు చేయటం జరిగింది. ఆ విషయం అప్పటి ఛైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తికి కూడా తెలుసు. ఆ రెండేళ్లు ఛైర్మన్‌ సిఫార్సు చేసిన టిక్కెట్‌ విషయంపై విచారణ జరిపితే..అసలు విషయాలు బయటకు వస్తాయని టిటిడి ఉద్యోగులు చెబుతున్నారు. అటువంటి వివాదాస్పద అధికారిని తన అంతరంగిక అధికారిగా నియమించాలని సుధాకర్‌యాదవ్‌ కోరడం, ఇఒ దాన్ని పెండింగ్‌లో పెట్టడం జరిగింది. ఒకవైపు నిజాయితీగా పనిచేస్తాను..పారదర్శకంగా పనిచేస్తాను..ఒత్తిళ్లు వచ్చినా..తట్టుకుని పనిచేస్తానని చెప్పుకున్న ఛైర్మన్‌ సుధాకర్‌యాదవ్‌ తన అంతరంగిక అధికారి విషయంలోనేతప్పుటడుగు వేశారనే విమర్శలను ఎదుర్కొంటున్నారు.


(338)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ