WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

కర్ణాటకలో 'అశోక్‌' ప్రచారంపై అభ్యంతరం...!

ఆంధ్రప్రదేశ్‌ను నమ్మించి మోసం చేసిన బిజెపి పార్టీ వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగసంఘం నాయకుడు 'అశోక్‌బాబు' ప్రచారం చేయటంపై కొందరు ఉద్యోగులు,రాజకీయపార్టీ నేతలు, ఇతర వర్గాలకు చెందిన వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వీరు కాకుండా...బెంగుళూరులో స్థిరపడిన తెలుగువారిలో కొందరు నిరసన వ్యక్తం చేస్తున్నారు. 'అశోక్‌బాబు' ఏ హోదాలో 'కర్ణాటక'లో ప్రచారం చేస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు...? ఆయన టిడిపి ఏజెంట్‌గా పనిచేస్తున్నారని, అందుకే ఇక్కడ ప్రచారానికి వచ్చారని వైకాపాను, బిజెపిని సమర్థించే కొందరు కర్ణాటక తెలుగువారు మండిపడుతున్నారు. ఆయన ఎవరు..? ఇక్కడ మా రాష్ట్రంలో ప్రచారం చేయడానికి..? ఆయనకు ఉన్న హోదా ఏమిటి..? ఆంధ్రప్రదేశ్‌ను విభజించిన కాంగ్రెస్‌కు ఓటు వేయమని చెప్పడానికి ఆయన ఎవరు..? అని మరి కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనపై కొంత మంది జర్నలిస్టు సంఘాల నాయకులపై కూడా దాడికి దిగారు. 'అశోక్‌బాబు' టిడిపి ఏజెంట్‌ అని...ఆయనకు ఉద్దేశ్యాలను అంటగడుతూ..వారు దాడులకు తెగబడ్డారు.

ఎందుకు అభ్యంతరం...!?

ఉద్యోగసంఘాల నాయకుడిగా ఉన్న 'అశోక్‌బాబు' కర్ణాటకలో ప్రచారం చేయడం సర్వీసు రూల్‌కు విరుద్దమని కొందరు వైకాపా సానుభూతిపరులు వాదిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న 'అశోక్‌బాబు' రాజకీయ పార్టీల సభకు వెళ్లడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. వ్యక్తిగతంగా రాజకీయ అభిమానం ఉండవచ్చు కానీ...ప్రత్యక్షంగా ఫలానా పార్టీని ఓడించమని వక్తాలా పుచ్చుకోవడం,ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం సరికాదని చెబుతున్నారు. ఇదంతా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆడిస్తున్న నాటకమని వారు ఆరోపిస్తున్నారు. సిఎం చంద్రబాబే ఆయనను కర్ణాటకకు పంపించారని...ఆయన టిడిపి ఏజెంట్‌గా పనిచేస్తున్నారని వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.


(269)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ