WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'గుడిసె' కోసం మంత్రి 'నక్కా' ఆరాటం...!

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో ఉన్న కొందరు మంత్రులు తామెంతో నిజాయితీ పరులమనీ, సమర్థులమని, తమ వల్లే పార్టీ నడుస్తుందనే రీతిలో వ్యవహరిస్తుంటారు. ఇంకొందరు ఏమీ తెలియని అమాయకుల్లా నటిస్తూ...ఎప్పటికప్పుడు తమకు కావాల్సిన పనులను ఆగమేఘాలపై చేయించుకుంటూ మూడో కంటికి తెలియకుండా వ్యవహారాలు నడుపుతారు. అటువంటి వారిలో రాష్ట్ర సాంఘిక,సంక్షేమ మంత్రి 'నక్కా ఆనందబాబు' ముందు వరుసలో ఉన్నారని సచివాలయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మంత్రిగా ఆయన పెద్దగా రాణించలేకున్నా...ఇతరత్రా మాత్రం బాగానే రాణిస్తున్నారనే మాట కూడా ఆ వర్గాల నుంచే వ్యక్తం అవుతోంది. ఎంతో కీలకమైన సాంఘిక,సంక్షేమశాఖమంత్రిగా 'నక్కా' ఆశాఖ కార్యదర్శితో కలసిమెలసి నడుస్తున్నారని, ఇద్దరూ స్వప్రయోజనాలను  కాపాడుకుంటూ కావాల్సిన వారికి అన్నీ చేసిపెడుతున్నారనే ఆయన అంతరంగిక వర్గాలే ఆఫ్‌ ది రికార్డుగా చెబుతున్నాయి.

   తాజాగా ఈ అమాయకుడైన మంత్రి...తనకు కావాల్సిన వారి కోసం ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారో..అన్న విషయంపై కథలు కథలుగా సచివాయల వర్గాలు చెప్పుకుంటున్నాయి. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా అవినీతి,స్త్రీలను వేధించారనే ఆరోపణలు ఉన్న 'గుడిసె దేవానంద్‌'ను నియమించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంతకు ముందే 'గుడిసె'ను కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా ప్రకటించినా...'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' ఇతర ప్రసార మాధ్యమాల్లో 'గుడిసె' అక్రమాల గురించి వార్తలు రావడంతో..ఆ నియామకాన్ని నిలిపివేసింది. 'గుడిసె' బాధితులు... 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌'కు ఫోన్‌ చేసి తమను ఏ విధంగా బాధించారో వివరించడం..అదీ కెమెరాల సాక్షిగా...ఆయన అక్రమాలు బయటకు రావడంతో..ప్రభుత్వం ఆయనను డైరెక్టర్‌గా నియమించి కూడా దాన్ని నిలుపుదల చేసింది. అయితే తాజాగా మంత్రి నక్కా ఆనందబాబు 'దేవానంద్‌'కు పదవి ఇప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారట. ఆ శాఖ కార్యదర్శిపై తీవ్ర ఒత్తిడి తెస్తూ...జీఓ విడుదల చేయాలని కోరుతున్నారట. అయితే...సిఎంఒ అధికారులు 'గుడిసె'పై వస్తోన్న ఆరోపణలను దృష్టిలో ఉంచుకుని...ఆయనను నియమించవద్దని సూచించారట. అయితే..మంత్రి 'నక్కా' మాత్రం 'దేవానంద్‌' తనకు సన్నిహితుడని...ఆయనపై ఆరోపణలు, విమర్శలు ఉన్నా నియమించాల్సిందేనని పట్టుబడుతున్నారట. మరి ప్రభుత్వం చివరకు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.

(429)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ