WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

కలెక్టర్‌ బాబూరావునాయుడు బదిలీ వెనుక...!

కడప జిల్లా కలెక్టర్‌ బాబూరావునాయుడును గిరిజన కోపరేటివ్‌ ఎండిగా బదిలీ చేయడం వెనుక...అర్థం..పర్థం వేరుగా ఉందట. అదేమిటంటే...టిడిపి సానుభూతిపరుడైన అధికారిగా ఆయనకు పేరుంది. ఆయన విశాఖపట్నంకు చెందిన గిరిజన వర్గానికి చెందిన అధికారి. 'చంద్రబాబు'ను అత్యంత అభిమానంగా 'బాబూరావు' చూస్తుంటారు. అదే విధంగా సిఎం చంద్రబాబు 'బాబూరావు'ను ప్రత్యేకంగా చూస్తుంటారు. ఇక అసలు విషయం ఏమిటంటే...విశాఖపట్నం జిల్లా పాడేరు నియోజకవర్గం నుంచి 'బాబూరావునాయుడు' పోటీ చేయాలని...భావించారట. ఈ విషయాన్ని ఆయన ముఖ్యమంత్రిని కలసి స్వయంగా చెప్పారట. గిరిజన వర్గానికి చెందిన మీలాంటి వారు పోటీ చేయడానికి ముందుకు రావడం...ఆహ్వానించదగ్గ పరిణామమని...సమయం,సందర్భం చూసుకుని పార్టీలో చేరుదురు కానీ...అని ఆయన సూచించారట. బాబూరావు ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయమని..మళ్లీ టిడిపి అధికారంలోకి రావడం అంతకన్నా ఖాయమని...గిరిజన కోటాలో మంత్రి పదవి పొందడం ఖాయమని, ఆ నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు. 

  ఈ విషయాలన్నీ ఇంతకు ముందే తెలిసినప్పటికీ మీడియా వర్గాలు పసిగట్టలేకపోయాయి. మరో ఆరు నెలల్లో స్వచ్చంధ పదవీ విరమణ చేసి 'బాబూరావు' టిడిపిలో చేరే అవకాశాలున్నాయి. పార్టీనేత ముఖ్యమంత్రికి ఈ విషయం చెప్పడంతో...ఇక ఆయనదే ఆలస్యమని...అన్నారట. ఇప్పుడే పదవీ విరమణ చేసి పార్టీలో చేరతారని..కొంత మంది నాయకులు చెబుతుంటే...'బాబూరావు' చిరునవ్వుతో దాటవేశారట. గిరిజన కార్పొరేషన్‌ ముఖ్య కార్యాలయం విశాఖపట్నంలో ఉన్న నేపథ్యంలో అక్కడకు ఏరికోరి బదిలీ చేయించుకున్న 'బాబూరావు' పాడేరు నియోజకవర్గంపై దృష్టిపెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా..? లేదా అరకు ఎంపీగా పోటీ చేస్తారా..? అనే విషయం బయటపడనప్పటికీ ఎంపీగా పంపినా ఆశ్చర్యంలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా ఐఎఎస్‌ అధికారి 'బాబూరావు' స్వచ్చంధంగా పదవీ విరమణ చేయడం ఖాయమని, ఆయన టిడిపిలో చేరడం ఖాయమనేది స్పష్టం అవుతోంది.

(263)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ