'కలెక్టర్‌ లక్ష్మీకాంతం' ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారా...!? 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'కలెక్టర్‌ లక్ష్మీకాంతం' ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారా...!?

కృష్ణా జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ అనేక అవార్డులు అందుకున్న లక్ష్మీకాంతం సర్వీసు మరో సంవత్సరం మాత్రమే ఉండడంతో...ఆయనను పార్టీలోకి తీసుకుని ఎమ్మెల్యేగా పోటీచేయించి గెలిపించి మంత్రి పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నట్లు కొందరు ముఖ్యనేతలు ఆఫ్‌ ది రికార్డుగా చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు వీరవిధేయుడిగా పేరున్న 'లక్ష్మీకాంతం' కృష్ణా జిల్లాలో ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేయడంలో చాలా మంది కలెక్టర్లకన్నా ముందుకు దూసుకుపోయారన్నది యధార్థం. గతంలో కృష్ణా జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన బి.ఆర్‌.మీనాకు ఏనిమిదేళ్లు పనిచేస్తే..పేరు ప్రతిష్టలు రాగా...కేవలం ఏడాదిలోనే 'లక్ష్మీకాంతం' మంచిపేరు తెచ్చుకోవడం విశేషం. అధికార, విపక్షాల నాయకులు ఎవరూ ఆయనపై ఈ ఏడాది కాలంలో ఎటువంటి ఆరోపణలు చేయలేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు..వివిధ వేదికలపై 'లక్ష్మీకాంతం' పనితీరును కొనియాడారు. ఆయన పనితీరును చూస్తోన్న టిడిపి నాయకులు ఆయనను పార్టీలో చేర్చుకోవాలని భావిస్తున్నారట. 

  మరో ఆరు నెలల పాటు...ఆయన సర్వీసులో కొనసాగి..తరువాత..స్వచ్చంధ పదవీ విరమణ చేస్తారని...తరువాత టిడిపిలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని చెబుతున్నారు. ఈవిషయంలో ఆయనను సంప్రదించేందుకు ప్రయత్నిస్తే...ఆయన అందుబాటులోకి రాలేదు. రాజకీయాల్లోకి చేరాలని...లక్ష్మీకాంతానికి కోరిక ఉందని ఆయన అనేక సందర్బాల్లో ప్రసంగించిన తీరును చూస్తే స్పష్టం అవుతోంది. ముందు ముందు ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో..ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆయనను ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తారా... పోటీ చేసి గెలిచిన తరువాత మంత్రి పదవిని కూడా ఇస్తారా..? అనే చర్చ జరుగుతోంది. సామాజికవర్గాలను బేరీజు వేసుకుంటే... లక్ష్మీకాంతం సామాజికవర్గం ఆయనకు అవకాశాలు కల్పిస్తుందనేది సుస్పష్టం. మరి కొద్ది రోజులు గడిస్తే కానీ...అసలు విషయం బయటపడదు. సిఎంఒ అధికారులతోనూ..టిడిపి ముఖ్యనాయకులతో.. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సన్నిహితంగా మెలిగే రాజకీయ,పారిశ్రామికవర్గాలతో లక్ష్మీకాంతంకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఐఎఎస్‌ అధికారిగా లక్ష్మీకాంతం రిటైర్‌ అయి ఇంటికే పరిమితమవుతారా..? లేదా...ఆరు నెలలు ముందు స్వచ్చంధ పదవీ విరమణ చేసి..ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా..? అనే విషయం మరి కొద్ది రోజుల్లో స్పష్టత రానుంది.

(666)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ