WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

గుంటూరు కలెక్టర్‌ 'కోన శశిధర్‌'ను అభినందించిన సిఎం...!

ఎన్‌.టి.ఆర్‌. వైద్య సేవల అమలులో రాష్ట్రంలో గుంటూరు జిల్లా మొదటి స్థానంలో నిలిచినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా కలెక్టర్‌ కోనశశిధర్‌ను అభినందించారు. మంగళవారం నాడు ఉండవల్లిలోని సిఎం నివాసం వద్ద ఉన్న గ్రీవెన్స్‌హాలులో జరిగిన రాష్ట్ర కలెక్టర్ల రెండు రోజుల కాన్ఫరెన్స్‌లో మొదటి రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఎన్‌.టి.ఆర్‌ వైద్యసేవల అమలులో గుంటూరు జిల్లా అగ్రస్థానంలో నిలవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్‌ కృషి వల్లే...గుంటూరుకు ఆరోగ్యరంగంలో మొదటి స్థానం వచ్చిందని..ఆయన వలే ఇతర జిల్లాల కలెక్టర్లు కూడా పనిచేయాలని కోరారు. 

  అదే విధంగా మైనారిటీ నిరుద్యోగ యువతకు రుణాల మంజూరులోనూ గుంటూరు జిల్లా అగ్రస్థానం సాధించింది. 2017-18 సంవత్సరంలో 2,157 మంది యువతకు రుణఆలు ఇవ్వాలని లక్ష్యం పెట్టుకోగా 2,169 మందికి రుణాలు మంజూరు చేశారు. దీంతో...రుణాల మంజూరులోనూ గుంటూరు ప్రథమ స్థానంలో నిలచింది. వ్యర్థ పదార్థాల ప్లాంట్స్‌ నిర్మాణంలో ఎదురౌతున్న ఇబ్బందులను కలెక్టర్‌ శశిధర్‌ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పంచాయితీ కార్యదర్శి జవహర్‌రెడ్డి మాట్లాడుతూ గ్రీన్‌ ఛానెల్‌ ద్వారా ఎన్ని ప్లాంట్స్‌ అయినా నిర్మించుకోవచ్చని కలెక్టర్‌ శశిధర్‌ దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంలో మిగతా జిల్లా కలెక్టర్లు కూడా దీనిని అనుసరించాలని ముఖ్యమంత్రి ఆయా జిల్లాల కలెక్టర్లకు సూచించారు. జూన్‌12 నుంచి పాఠశాలలు తెరుస్తున్నందున ముందుగానే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సకాలంలో టెక్ట్స్‌బుక్స్‌ అందేలా తగు ఆదేశాలు జారీ చేయాలని విద్యాశాఖ సమీక్ష సందర్భంగా కలెక్టర్‌ కోనశశిధర్‌ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. పాఠశాలలు తెరిచేనాటికి పుస్తకాలు అందుబాటులో ఉంచాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.


(301)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ