WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'కెసిఆర్‌' 'మోడీ' చేతిలో పావుగా మారాడా...!?

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటనలు అంత తేలిగ్గా ఎవరికీ అర్థం కావు. ఆయన మనసులో ఉండేది ఒకటి..చేసేది మరోటి. ఒకవైపు తాను కాంగ్రెస్‌,బిజెపి పార్టీలకు దూరమని, జాతీయ స్థాయిలో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తున్నానని ప్రకటిస్తారు..మరోవైపు..ప్రధాని మోడీ చెప్పినట్లా ఆడుతుంటారు. కాంగ్రెస్‌కు దూరమనే మాటలు ప్రస్తుతానికి నిజమేనేమోకానీ...బిజెపికి దూరమనే మాటలు మాత్రం యధార్థం కాదు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలంగాణ ఇస్తే...టిఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో కలిపేస్తానని చెప్పి...ఆఖరి నిమిషంలో ఆ పార్టీకి ఝలక్‌ ఇచ్చిన కెసిఆర్‌ తరువాత నుంచి ఆ పార్టీకి దూరంగానే ఉంటున్నారు. అదే సమయంలో అధికార బిజెపికి మాత్రం దగ్గరగా మసలుతుంటారు. కేంద్రానికి ఇబ్బంది వచ్చినప్పుడల్లా...వారిని ఆదుకుంటారు...! ఇటీవల పార్లమెంట్‌లో బిజెపి ప్రభుత్వంపై అవిశ్వాసం సందర్భంగా ఇదే జరిగింది. లోక్‌సభ వెల్‌లోకి తన ఎంపీలను పంపి అవిశ్వాసం చర్చ జరగకుండా శాయశక్తులా అడ్డుకున్నారు. అదొక్కటే కాదు...బిజెపికి అవసరమైన ప్రతి సందర్భంలోనూ...కెసిఆర్‌ ఇదే రీతిలో వ్యవహరించారు.

    తాజాగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో...బిజెపిని ఆదుకునేందుకు...కెసిఆర్‌ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. బిజెపి వ్యతిరేక ఓట్లను చీల్చడానికి...ప్రత్యేకంగా కర్ణాటకలో పర్యటించారు. నేరుగా బిజెపికి మద్దతు ఇవ్వకుండా...బిజెపి బి టీమ్‌ అయిన 'జెడిఎస్‌'కు మద్దతు ప్రకటించారు. తెలుగువారంతా...జెడిఎస్‌కు ఓట్లు వేయాలని...పిలుపునిచ్చారు. ఆంధ్రాకు బిజెపి చేసిన అన్యాయంపై రగిలిపోతున్న కర్ణాటకాంధ్రులు...కాంగ్రెస్‌కు ఓటు వేయాలని భావిస్తుంటే...కెసిఆర్‌ మాత్రం...ఆ ఓట్లను చీల్చి...బిజెపికి లబ్ది చేకూర్చడానికి శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదొక్కడే కాదు..తనను ఎదిరించిన..ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కక్ష తీర్చుకోవాలనుకుంటున్న 'మోడీ' కోసం ...ఓటుకు నోటు కేసును తిరగదోడుతున్నానంటూ..లీకులు ఇస్తున్నారు. ఓటుకు నోటు కేసులో 'చంద్రబాబు' ప్రమేయం ఉందని...ఆయనను జైలుకు పంపుతామని...కెసిఆర్‌ గతంలో ప్రకటించారు. తాజాగా...'మోడీ' ఆదేశాలతోనే...ఆయన ఓటుకు నోటును కదిలించారని..చెబుతున్నారు. మొత్తం మీద ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉన్న నేపథ్యంలో తనను తాను రక్షించుకోవడానికి...బిజెపి పెద్దలను మెప్పించడానికి...రాబోయే రోజుల్లో...బిజెపి మళ్లీ కేంద్రంలో అధికారంలోకి వస్తే..అధికారంలో భాగస్వామి కావడానికి...కెసిఆర్‌ బిజెపి పెద్దలు ఆడించినట్లా...ఆడుతున్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లోనూ, ప్రజల్లోనూ వ్యక్తం అవుతోంది.


(321)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ