WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

పాలనాయంత్రాంగంపై 'బాబు' పట్టుకోల్పోయారా...!?

పాలనాయంత్రాంగంపై పట్టుసాధించి, ఆగమేఘాలపై అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసిన ఘనమైన చరిత్ర ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం పాలనాయంత్రాంగంపై పట్టు కోల్పోయారని...ఇంతకు ముందు జరిగిన సంఘటనలు...తాజాగా జరుగుతున్న సంఘటనలపై పలువురు...అధికారులు విమర్శిస్తున్నారు. ఇటీవల ఐఏఎస్‌ అధికారుల బదిలీలు, పోస్టింగుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొండను తవ్వి ఎలుకను పట్టారన్న విమర్శను కొని తెచ్చుకున్నారు. మూడేళ్లు సర్వీసు పూర్తి అయిన వారందరినీ బదిలీ చేయాలని భావించి వివిధ కారణాలతో కేవలం సంవత్సరం లోపు పనిచేసిన కలెక్టర్లను బదిలీ చేసి...ఏనుగు తిన్న వెలగపండును గుర్తు చేశారు. బదిలీ చేయమని కోరిన కలెక్టర్లను బదిలీ చేయకుండా...మూడేళ్లు సర్వీసు పూర్తి చేసిన కలెక్టర్లను బదిలీ చేస్తామని చెప్పి...ఆఖరు నిమిషంలో ఆ ప్రతిపాదనను విరమించుకోవడంపై.. పాలనా వ్యవహారాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టుకోల్పోతున్నారని అధికారవర్గాలు చెబుతున్నాయి. మరో రెండు,మూడు మాసాల్లో ఐదు జిల్లాలకు చెందిన కలెక్టర్లను బదిలీ చేసే అవకాశాలు ఉన్నాయని లీకులు ఇస్తున్నారు. విశాఖ,పశ్చిమగోదావరి జిల్లాల కలెక్టర్లు మూడేళ్లకు పైగా అక్కడే పనిచేస్తున్నా..వారికి స్థానభ్రంశం కలిగించలేకపోయారు. 

  నాలుగేళ్ల నుండి పంచాయితీరాజ్‌ మరియు గ్రామీణాభివృద్ధిశాఖాధిపతిగా పనిచేస్తోన్న 'జవహర్‌రెడ్డి'ని బదిలీ చేయడానికి 'చంద్రబాబు' భయపడుతున్నారని సచివాలయంలో ప్రచారం జరుగుతోంది. నెల్లూరు జిల్లాలో మంత్రులు నారాయణ, సోమిరెడ్డిల మధ్య నలిగిపోతున్న కలెక్టర్‌ ముత్యాలరాజు తనను బదిలీ చేయాలని కోరినా..పట్టించుకోలేదట సిఎం. తనను ఏదో ఒక జిల్లాకు బదిలీ చేయమని 'ముత్యాలరాజు' స్వయంగా సిఎంను కలసి విన్నవించినా...ఆయన కోరిక నెరవేరలేదు. ఈ విషయాన్ని ఆయన తరువాత ఖండించినా...ఆ ఇద్దరు మంత్రులతో వేగలేకపోతున్నారనేది నిజమని కింది స్థాయి ఉద్యోగులు, అధికారులు చెబుతున్నారు. అధికార యంత్రాంగాన్ని భారీగా ప్రక్షాళన చేద్దామని భావించిన ముఖ్యమంత్రి ఆఖరి నిమిషంలో తుస్సుమనిపించారని...పలువురుశాఖాధిపతులు సన్నిహిత వర్గాలతో చెప్పినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఈ మధ్య కాలంలో చేసిన గొప్ప పనేమిటంటే...తిరుమల కొండను మరో రెండేళ్లపాటు 'శ్రీనివాసరాజు'కు రాసిచ్చారని కొందరు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. సాంప్రదాయాలు తెలియని, అనుభవం లేని 'అనిల్‌ సింఘాల'ను తిరుమలకు ఇఒగా నియమిస్తే...ఆయన ప్రభుత్వ ప్రతిష్టను మంటగలిపారని, తిరుమల జేఇఒలకు అధికారం అప్పచెప్పి చేతులు దులుపుకున్నారని...వారు ఇష్టారాజ్యంగా వ్యవహరించి తిరుమల ప్రతిష్టను, ప్రభుత్వ ప్రతిష్టను రోజు రోజుకు దిగజారుస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. వెయ్యికోట్ల రూపాయలను ప్రైవేట్‌ బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసి సింఘాల్‌ ప్రభుత్వ పరువు తీశారు. ఇటువంటి అధికారులను సిఎం ప్రోత్సహిస్తున్నారని..వీరి వల్ల సిఎం కూడా అప్రదిష్ట పాలవుతున్నారు. తాను తలచిందే...తడువుగా..అటు జిల్లాలో...ఇటు సచివాలయంలో... అధికారుల నియామకంలో...'చంద్రబాబు' తప్పుటడుగులు వేస్తున్నారని..వీరి నియామకంతో పాలనపై 'చంద్రబాబు' పట్టుకోల్పోతున్నారనే అభిప్రాయం ఐఎఎస్‌ వర్గాల నుంచి వ్యక్తం అవుతోంది.

(278)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ