WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఓట్లు రాల్చే పథకాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి...!

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనకు సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు లాంటివని ఎంత చెప్పుకున్నా...వాటి అమలులో ఆయన సమతూకం పాటిస్తున్నా...రాబోయే ఎన్నికల్లో ఓటు రాల్చే పథకాలపై తీవ్రమైన దృష్టి పెట్టాల్సిన అవరం ఎంతైనా ఉంది. మంగళవారం నాడు జరిగిన జిల్లా కలెక్టర్ల తొలిరోజు సమావేశంలో ఆయన సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నాని చెబుతున్నా...ఆచరణలో మాత్రం సగానికి పైగా జిల్లాల్లో ఇంకా సంక్షేమ కార్యక్రమాలు వందశాతం అమలుకు నోచుకోలేదని...వస్తోన్న రిపోర్టులను బట్టి స్పష్టమవుతోంది. 

   విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసేనాటికి వారసత్వంగా వచ్చిన సమస్యలకు తోడు, విభజిత కష్టాలు, సహకరించని కేంద్రం, ఇష్టారీతిన వ్యవహరించే ప్రతిపక్షం ఉన్నా...ఆయన కొన్ని పథకాలను సమర్థవంతంగానే అమలు చేశారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ నాలుగేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల్లో 'పించన్లు,చంద్రన్నభీమా, ఎన్‌.టి.ఆర్‌.వైద్యసేవలు, పేదలకు ఇళ్ల నిర్మాణం, 24గంటల విద్యుత్‌ సరఫరా, రైతుల రుణమాఫీ, ప్రజాపంపిణీ ప్రజల్లోకి దూసుకువెళ్లాయి. గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో రూ.200/- ఫించన్లు ఇస్తే...దాన్ని చంద్రబాబు ప్రభుత్వం వెయ్యి రూపాయలు చేసింది. అదే విధంగా దేశచరిత్రలో లేని విధంగా...'చంద్రన్నభీమా' చేపట్టింది. ఈ రెండు పథకాలు 'చంద్రబాబు'కు ఎంతో పేరు తెస్తున్నా... ఇంకా వాటిని వందశాతం అమలు చేయలేకపోతున్నారు. ఫించన్లు పంపిణీలో సగం జిల్లాలు ఇంకా వందశాతానికి చేరుకోలేదు. అదే విధంగా 'చంద్రన్న భీమా' పథకం అమలులో 'పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కడప,చిత్తూరు,విజయనగరం జిల్లాలు వందశాతం సంతృప్తిస్థాయికి రాలేదు. అదే విధంగా ముఖ్యమంత్రి ఆరోగ్యకేంద్రాల్లో సంతృప్తి స్థాయి ఏ ఒక్క జిల్లాలోనూ వందశాతాన్ని తాకలేదు. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలు 72శాతంతో ముందు వరుసలో ఉండగా..మిగతా జిల్లాల్లో సరాసరి 67శాతం దాటడం లేదు. ఇదే విధంగా పలు సంక్షేమ కార్యక్రమాల్లో ప్రభుత్వం అనుకున్న రీతిలో ఫలితాలను సాధించడం లేదు. రాబోయే ఎన్నికల్లో ఓట్లు రాలుస్తాయని భావిస్తోన్న సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ఇంకా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

వై.ఎస్‌ను...చూసి నేర్చుకోండి...!

గతంలో వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ప్రచారం జరిగినా...ఆయన తాను అమలు చేయాలనుకున్న నాలుగు సంక్షేమ కార్యక్రమాలను వందశాతం అమలు చేసి...మళ్లీ అధికారంలోకి వచ్చారు. ముఖ్యంగా  'ఫించన్లు, ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్యశ్రీ,విద్యార్థులకు ఉపకారవేతనాలు'లపై దృష్టిసారించి ఆయన  ఫలితాలను సాధించగలిగారు. వ్యక్తిగతంగా వై.ఎస్‌ ఎంతటి అవినీతి పరుడైనా..ప్రజలకు తమకు అందుతున్న సౌకర్యాలపై నాడు సంతృప్తి చెందడం వల్లే...అంతటి వ్యతిరేకతను సైతం ఎదుర్కొని ఆయన విజయం సాధించగలిగారు. రెండు వందల రూపాయల ఫించన్‌ ఇస్తేనే...వై.ఎస్‌ దేవుడు..అయితే..మరి ఇప్పుడు వెయ్యి రూపాయలు ఫించన్‌ ఇస్తోన్న 'చంద్రబాబు' ఏమవుతాడు..దీనిపై టిడిపి ప్రభుత్వం ఎప్పుడైనా ప్రచారం చేసుకుంటుందా..? లేదు..? అదే విధంగా పేద కుటుంబానికి చెందిన వ్యక్తి ప్రమాదవశాత్తో...అనారోగ్యంతోనే మృతి చెందితే..ఐదు లక్షల రూపాయలు ఇస్తోన్న టిడిపి ప్రభుత్వం దానిపై ప్రచారం చేసుకుంటుందా..? లేదనే సమాధానం వస్తోంది. నాడు వై.ఎస్‌ హయాంలో...ఆరోగ్యశ్రీ పేరిట...కుయ్యమ్‌..కుయ్యమ్‌..అని ఆరోగ్యశ్రీ వాహనాలు వస్తేనే...దాన్ని ఎలా ప్రచారం చేసుకుని ఓట్లు చేసుకున్నారో...టిడిపి నేతలకు తెలియదా..? మరి ఇప్పుడు..ఆ విధంగా..ఎందుకు చేయలేకపోతున్నారు..? అదే విధంగా నిరంతర విద్యుత్‌ సరఫరా...సంక్రాంతి, రంజాన్‌తోపా, వివాహ కానుకలు వంటి వాటిపై ప్రభుత్వ అధికారులు కానీ...టిడిపి నాయకులు కానీ ప్రచారం చేసుకోవడంలో ఘోరంగా విఫలమవుతున్నారు. ఆర్థిక కష్టాలు ఉన్నా...వేల కోట్లు సంక్షేమానికి ఉపయోగిస్తున్నా... ప్రచారం చేయడం చేతకాక..టిడిపి ప్రభుత్వం ప్రజల నుంచి అసంతృప్తిని ఎదుర్కొంటోంది. కాపులకు, బిసీలకు, ఎస్సీ,ఎస్టీలకు,మైనార్టీలకు వేలకోట్ల రూపాయలను గుమ్మరించిన టిడిపి ప్రభుత్వం వాటిపై కూడా ప్రచారం చేసుకోవడం లేదు.

సిఎంఆర్‌ఎఫ్‌పై ప్రచారం ఏది...!?

వై.ఎస్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో...ఎవరైనా..అనారోగ్యానికి గురైనా..లేక ఏమైనా వ్యక్తిగత ఇబ్బందులు ఉన్నా..ఉదయం పూట..సిఎం క్యాంప్‌ కార్యాలయంలో ఆయనను కలిస్తే.. ఆయన వారికి సానుకూలంగా 20 వేల నుంచి 80 వేల వరకు సహాయం చేసేవారు. దానికే వై.ఎస్‌..దేవుడు అయిపోయాడు..మరి ఇప్పుడు...ఎవరైనా అనారోగ్యం పాలైనా..వ్యక్తిగత ఇబ్బందులు ఉన్నా.. సిఎంఆర్‌ఎఫ్‌ నుంచి సహాయం చేస్తున్నారు. ఒక్కొక్కరికి వారు అనారోగ్యానికి అయిన దానిలో లక్ష కానీ...రెండు లక్షలు కానీ...ఎంతైతే..దానిలో దాదాపు 70శాతం చెల్లిస్తున్నారు. ఇలా ఈ నాలుగేళ్ల కాలంలో దాదాపు రూ.725కోట్లను పేదలకు సహాయంగా ప్రభుత్వం ఇచ్చింది. కానీ..దీనిపై ఎటువంటి ప్రచారం లేదు. రూ.700కోట్లు ఇస్తే..దాని గురించి ప్రచారం చేసుకోని..ప్రభుత్వాన్ని ఏమనాలి..? వేల రూపాయలు ఇచ్చి...వందల కోట్ల రూపాయల ప్రచారం చేసుకున్న వై.ఎస్‌ వీరికి గుర్తు రాలేదా..? లేక ఉదాసీనతా..? వందల కోట్ల రూపాయలను ఉదారంగా..అడిగిన వారికి కాదనకుండా ఇస్తుంటే...దానిపై ప్రచారం చేసుకోవడం టిడిపి ప్రభుత్వానికి చేతకావడం లేదా..? ప్రతిరోజూ ఆర్థిక కష్టాలు వేధిస్తున్నా...మడమ తిప్పకుండా...వేలకోట్లు సంక్షేమంపై ప్రభుత్వం ఖర్చు చేస్తూనే..దాని ఫలాలను ఓట్ల రూపంలోకి మార్చుకోలేక..టిడిపి ప్రభుత్వం అష్టకష్టాలు పడుతోంది...అధికారపార్టీ అధి నాయకత్వం. పార్టీ నాయకుల్లో ఆవరించిన ఉదాశీనత, అన్నీ ఆయనే చూసుకుంటాడులే.. మనకెందుకు..అన్న నిర్లిప్తత..పార్టీని కష్టాలు పాలు చేస్తుంది. ఇప్పటికైనా...అధికారగణంతో ఆగమేఘాలపై పనులు చేయిస్తూనే...తాము చేసిన పనులను ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


(348)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ