WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

కర్ణాటకలో నెక్‌ టు నెక్‌...!?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు మరో ఐదు రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ప్రచారం హోరెత్తుతోంది. కాంగ్రెస్‌,బిజెపిలకు చెందిన ప్రధాన నాయకులు సుడిగాలి పర్యటనలు చేస్తూ..ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రచారం ఆరంభించిన తొలినాళ్లలో మళ్లీ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని..ఎక్కువ మంది భావించారు. ఆ పార్టీ మరోసారి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తధ్యమని...అంతరంగిక చర్చల్లో బిజెపి నేతలు కూడా అంగీకరించారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా...తొలి రోజుల ఎన్నికల ప్రచారంలో తడబడడం..అత్యంత అవినీతిపరుడు...యడ్యూరప్ప అని వ్యాఖ్యానించడంతో...బిజెపి సెల్ఫ్‌గోల్‌ వేసుకుందని...ఆ పార్టీ ప్రచారంలో పుంజుకోవడం కష్టమని వారంతా భావించారు. పడతా లేస్తూ...ప్రచారం చేసిన బిజెపి...ఒకదశలో తమ తురుపు ముక్క 'మోడీ'ని సైతం ప్రచారంలో దింపడానికి తపటాయించింది. అయితే...ప్రచారం ముగియడానికి మరో పది రోజుల సమయం ఉన్నప్పుడు 'మోడీ' రంగంలోకి దిగి...ప్రచారాన్ని హోరెత్తించారు. 

   అప్పటి దాకా...కాంగ్రెస్‌ గెలుపు ఏకపక్షమని భావించిన వారికి 'మోడీ' సభలకు వచ్చే ప్రజలను చూసి...పోటీ ఏకపక్షం కాదని...హోరాహోరి ఉంటుందని అంగీకరించారు. అయితే...ప్రచారం చివరి రోజుకు వస్తే సరికి...కాంగ్రెస్‌, బిజెపి సమాన స్థాయిలో ఉన్నాయని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్‌ కన్నా కొద్దిగా బిజెపికే..ఆధిక్యత ఉన్నట్లు కనిపించడంతో..రాజకీయాల నుంచి తప్పుకున్నానని ప్రకటించిన ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు 'సోనియాగాంధీ' రంగంలోకి దిగారు. 'మోడీ'కి తానే సరైన ప్రత్యర్థినని ఆమె నిరూపించారు. 'సోనియా' సభలకు జనం ఇరగబడడంతో...లెక్క సరిసమానంగా మారింది. అయితే...ఎన్నికల ప్రచారానికి మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో...ఈ ప్రచార వేడి...ఇంకా పెరగనుంది. అదే సమయంలో...గెలుపు కోసం బూత్‌స్థాయిలో పార్టీలు మొహరించి...విజయవ్యూహాలను రచిస్తున్నాయి. ఓటర్లను పోలింగ్‌ బూత్‌లకు తీసుకురావడం, వారితో ఓట్లు ఎవరు వేయించగలుగుతారో..వారే ఈ హోరాహోరి పోటీలో విజయం సాధించగలుగుతారు.  


(205)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ