WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

సుపరిపాలన గుంటూరు నెంబ‌ర్ వ‌న్...!

సుపరిపాలన అందించడంలో రాష్ట్రంలో గుంటూరు జిల్లా మొదటి స్థానంలో  నిలిచినందుకు జిల్లా యంత్రాంగం  కృషి ఎంతో వుందని, వారి సహకారం వల్లే ఇది సాధ్యమైందని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు.  మైనింగ్, ఇసుక పాలసి అమలులో ప్రజల సంతృప్తి స్థాయి సాధించడంలో రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్నామని కలెక్టర్ తెలిపారు.  అలాగే విద్యుత్ శాఖ ద్వారా సేవలందించడంలో గుంటూరు జిల్లా రెండవ స్థానంలో వుందని కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు.  పేరేచర్ల నుండి కొండమోడు వరకు 4 లైన్ల రోడ్డు నిర్మాణం ఆవశ్యకతను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకునిరాగా ముఖ్యమంత్రి  అంగీకరించి సంబంధిత అధికార్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు కలెక్టర్ వివరించారు.  అలాగే స్పైసేస్ పార్క్ కు సంబంధించి అప్రోచ్ రోడ్డు నిర్మాణం ఆవశ్యకతను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకునిరాగా అంగికరించారని కలెక్టర్  కోన శశిధర్ తెలిపారు. చంద్రన్న బీమా అమలులో గుంటూరు జిల్లా 100 శాతం ప్రగతి సాధించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.  పట్టణ గృహ నిర్మాణ పధకం మరియు పురపాలక సంఘాలలో త్రాగునీటి సరఫరాలో గుంటూరు జిల్లా రెండవ  స్థానంలో నిలిచిందని కలెక్టర్ తెలియజేసారు.  అంతేకాక జిల్లాలో పలు శాఖలకు సంబంధించి ప్రజల సంతృప్తి స్థాయిని అనుకున్న  స్థాయిలో నెరవేర్చగలిగామని, ఇంకా మెరుగుపడాల్సిన శాఖల  ప్రజల సంతృప్తి స్థాయి పెరిగేలా చర్యలు తీసుకుని ముఖ్యమంత్రి ఆలోచనా విధానాలకు తగ్గట్టుగా 100 శాతం సాధించేందుకు కృషి చేస్తామని కలెక్టర్ తెలియజేసారు.  


(186)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ