ఏకబిగిన...12గంటల పాటు కలెక్టర్ల సమావేశాలా...!? 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఏకబిగిన...12గంటల పాటు కలెక్టర్ల సమావేశాలా...!?

బిత్తరపోయిన కలెక్టర్లు, శాఖాధిపతులు...!

మంగళవారం,బుధవారం నాడు జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఉదయం 9 గంటల  నుండి రాత్రి 9 గంటల వరకు సమావేశాలు నిర్వహించడంపై శాఖాధిపతులు, డైరెక్టరేట్‌ అధిపతులు, కలెక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. వరుసగా 12గంటల పాటు సమావేశంలో కూర్చోవడంపై వారు బిత్తరపోయారు. మధ్యాహ్నం కాసేపు భోజన విరామం తప్ప...మిగతా సమయమంతా...సమీక్షల్లో కూర్చోవడంపై పలువురు ఉన్నతాధికారులు, కలెక్టర్లు,శాఖాధిపతులు, మంత్రులు ఇబ్బందులతో  పాటు ఒత్తిడికిలోనయ్యామని...అది తమకు టార్చర్‌గా అనిపించిందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక సీనియర్‌ అధికారి 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' ప్రతినిధితో వ్యాఖ్యానించారు. కలెక్టర్ల సమావేశం నిర్వహించడంలో తప్పులేదు.  ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది వరకు సమయం తీసుకోవడంపైనే అభ్యంతరమని...అన్ని గంటల పాటు సమీక్షపై దృష్టిసారించి కూర్చోవడం కష్టమైనపనేనని ఆయనతో పాటు మరి కొందరు వ్యాఖ్యానించారు. తామంతా సమావేశంలో ఉన్నా..మనస్సు మాత్రం అక్కడ లేదని పలువురు కలెక్టర్లు 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌'తో అన్నారు. సమావేశాలకు ఇంత సమయం తీసుకోవడానికి బాగాలేదు...కావాలనుకుంటే మరో రెండు రోజుల పాటు పెట్టుకోవచ్చు..కానీ..రాత్రి తొమ్మిది గంటల వరకు సమయం తీసుకోవడం సరి కాదని, తీవ్ర ఇక్కట్లకు, ఇబ్బందులకు గురయ్యామని...వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

  రెండు రోజుల కలెక్టర్ల సమావేశాల్లో సాధించిందేమిటి...? సాధించబోయేదేమిటి..? అనే దానిపై స్పష్టత లేదు. ఒకవైపు నిధుల కొరత, మరోవైపు అవినీతి ఈ రెండింటిని అధిగమించాలంటే...చాలా కష్టం. దీనిపై పలువురుశాఖాధిపతులు ఆఫ్‌ ది రికార్డుగా మాట్లాడుతూ ఎక్కడో మారు మూల కూర్చుని పనిచేస్తేనే బాగుంటుంది...ఈ వయస్సులో ఇంత టార్చర్‌ అవసరం లేదు...గత సమావేశాల కన్నా...ఈసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి మందలింపులు, చివాట్లు లేవని దాని వరకు సంతోషమేనని....కానీ...ఇంత సమయం తీసుకోవడం బాగాలేదని...చెప్పారు. కావాలంటే సమావేశాల రోజులు పెంచండి...కానీ...సమయం మాత్రం తగ్గించండి..అని సిఎంను కోరతామని పేరు చెప్పడానికి ఇష్టపడని సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు. కలెక్టర్ల సమావేశాలు జరిగే రెండు రోజుల పాటు ఉదయం ఆరు గంటలకే తాము తయారు అయ్యామని...ఆ రోజు సమావేశాల నోట్స్‌..తదితరాలను సిద్దం చేసుకుని సమావేశ ప్రాంగణానికి ఎనిమిదిన్నర గంటలకే వచ్చామని...ఇక అక్కడ నుంచి ఇంటికి వెళ్లే సరికి రాత్రి పది గంటలు దాటిపోయిందని...అంటే దాదాపు 14గంటల పాటు..పనిచేశామని..ఒక అధికారి చెప్పారు. అసలే ఎండాకాలం....సమీక్షలతో గంటల తరబడి కూర్చోవడంతో...ప్రాణం పోయినంతపనైంది...! ఎసీల్లో కూర్చున్నా...ప్రాణం లాగేసిందని.. వడలిపోయామని...అధికారులు..'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' ప్రతినిధితో వాపోయారు. మొత్తం మీద... ఎర్రటి ఎండల్లో...జరిగిన కలెక్టర్ల సమావేశాలు...అధికారులకు చుక్కలు చూపించాయనడంలో ఎటువంటి సందేహం లేదు.

(237)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ