WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'చంద్రబాబు'ను ఎ1గా చేసేందుకు 'మోడీ' కుట్ర...!

ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబును ఏ1 ముద్దాయిగా..చేసేందుకు ప్రధానమంత్రి మోడీ, కెసిఆర్‌లు కుట్ర పన్నుతున్నారని మాజీ టిడిపి నేత, కాంగ్రెస్‌ నాయకుడు రేవేంత్‌రెడ్డి చేసిన విమర్శలు సంచలనం సృష్టిస్తున్నాయి. భయపెట్టో, బెదిరించో తనను లొంగతీసుకోవడానికి కెసిఆర్‌ ప్రయత్నించారని, అదే విధంగా 'చంద్రబాబు'ను కూడా పలు విధాలుగా బెదిరించి విఫలమైన ప్రధాని మోడీ...తాజాగా తెలంగాణ సిఎం కెసిఆర్‌ను చంద్రబాబుపై ప్రయోగించబోతున్నారు. ఇప్పటి వరకు ఓటుకు నోటు కేసులో ఎ1గా రేవంత్‌రెడ్డి, ఎ2గా సెబాస్టియన్‌, ఎ3గా ఎమ్మెల్యే సండ్రవెంకట వీరయ్య, ఎ4గా ఉదయసింహ,ఎ5 మత్తయ్యలుగా ఉన్నారు. దీనికి వెనుక చంద్రబాబు ప్రమేయం ఉందని..ఆయనను ఎ1గా చేర్చేందుకు తెలంగాణ సిఎం ప్రయత్నించారని, అది తమ వల్ల కాదని చేతులు ఎత్తేశారని 'రేవంత్‌రెడ్డి' చెబుతున్నారు. ఒకవైపు తెలంగాణ సిఎం కెసిఆర్‌ రేవేంత్‌రెడ్డిని టార్గెట్‌ చేయడంలో దూకుడు తగ్గించి..బిజెపి పెద్దల ప్రమేయంతో 'చంద్రబాబు'ను ఇబ్బంది పెట్టేందుకు పథకాలు రూపొందిస్తున్నారు. 

  నిన్నటి మొన్నటి వరకు బిజెపి పెద్దలకు లొంగని కెసిఆర్‌ తాజాగా ఎవరి ఒత్తిళ్లు పనిచేశాయో కానీ...అందుకు సంబంధించిన కేసుపై రివ్యూలు చేస్తున్నట్లు లీకులు ఇస్తున్నారు. కోర్టు పరిధిలో ఈ కేసు పెండింగ్‌లో ఉండగా కెసిఆర్‌ ఏ విధంగా రివ్యూ చేస్తారు. అందుకేనేమో..రిటైర్డ్‌ అయిన మాజీ ఏసీబీ డిజిపి ఎ.కె.ఖాన్‌ను సమావేశాలకు పిలిచినట్లు విశ్వసనీయ సమాచారం. ఏదో విధంగా 'చంద్రబాబు'ను ఇబ్బంది ఆయనను రాజకీయంగా దెబ్బకొట్టాలని ప్రధాని మోడీ, అమిత్‌షాలు చేస్తోన్న ప్రయత్నాలు తెలంగాణలో కూడా బెడిసి కొట్టడంతో...'చంద్రబాబు'పై ఎటువంటి చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారో తెలియడం లేదని రేవంత్‌రెడ్డి చెబుతున్నారు. ఎవరు ఏమి చేసినా...'చంద్రబాబు'ను భయపడరని, కెసిఆర్‌ తాటాకు చప్ఫుళ్లకు, తెరవెనుక ఉండి...వ్యూహాలు రచించినా..ఏమీ చేయలేరని టిడిపి మంత్రులు, నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా 'చంద్రబాబు'ను మోడీ, అమిత్‌షాలు ఏమీ చేయలేరని..కెసిఆర్‌ కాకుండా మరెవరి ద్వారా అయినా ప్రయత్నాలు చేసినా..మరింత భంగపాటు తప్పదని టిడిపి నాయకులు హెచ్చరిస్తున్నారు.

(344)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ