WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

పంచాయితీ ఎన్నికలపై బాబు,జగన్‌లు అనాసక్తి...!

పంచాయితీ సర్పంచ్‌ ఎన్నికల జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ప్రతిపక్షనేత 'జగన్‌' కూడా కోరుకోవడం లేదట. టిడిపి ప్రభుత్వ పాలనపై 70శాతం ప్రజలు సంతృప్తిగా ఉన్నారు..ఈ పరిస్థితుల్లో..ఓటర్లలో చీలిక వస్తే..సాధారణ ఎన్నికల్లో..తమకు ఇబ్బంది అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పుడిప్పుడే...ప్రజలు..చంద్రబాబు పాలనపై అసంతృప్తిగా ఉన్నారని...అదే సమయంలో కొన్ని సామాజికవర్గాలకు చెందిన వారు కూడా తన వైపే వస్తున్నారని...ఇప్పుడు పంచాయితీ ఎన్నికలు జరిగి ఓటర్లు చీలిపోతే తనకు నష్టం జరుగుతుందని ప్రతిపక్షనేత 'జగన్‌' కూడా భావిస్తున్నారట. అందుకే...పంచాయితీ ఎన్నికలు జరగాలని ఆయన పట్టుపట్టడంలేదట. జూలై31కు పంచాయితీల పదవీ కాలం పూర్తి అయినా...తిరిగి ప్రభుత్వం ఎన్నికలు జరిపినా...జరపకపోయినా..స్థానిక సంస్థల ఎన్నికల కమీషనర్‌ తాను నిర్వహించాల్సిన పాత్ర నిర్వహిస్తున్నారు. ఓటర్ల జాబితా తయారు చేయడం, పంచాయితీల రిజర్వేషన్లు తదితర కార్యక్రమాలను జూన్‌ 15లోపల పూర్తి చేయాలని కలెక్టర్లకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలు జరగవని...స్థానిక సంస్థల కమీషనర్‌కు తెలుసు. జరిపించాలని చంద్రబాబు అనుకోవడం లేదు..జరిపించకపోతే తన పరిస్థితి మెరుగుపడుతుందని 'జగన్‌' నమ్మకం. 

 ఎవరి స్వార్థం..వారిదే..కాలపరిమితి పూర్తి అయిన పంచాయితీలకు ఎన్నికలు జరిపించి.. ప్రజాస్యామ్యాన్ని నిలబెట్టాలని ఎవరూ అనుకోవడం లేదు. పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని జనసేన అధ్యక్షుడు 'పవన్‌కళ్యాణ్‌' కానీ...బిజెపి నేతలు కానీ కోరడం లేదు. పంచాయితీ ఎన్నికలు జరిగితే..తమకు నష్టమని...అభ్యర్థుల కోసం కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుందన్న అనుమానం అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎన్నికల నిర్వహణకు అడ్డుపడుతున్నారు. అదే విధంగా పంచాయితీ ఎన్నికలు వస్తే..తమ సొంత సొమ్ము ఖర్చుపెట్టుకుని గెలిపించుకోవాలి..ఒకవేళ గెలిపించుకున్నా... తమకు ఎమ్మెల్యే సీటు 'జగన్‌'' ఇస్తాడన్న నమ్మకం లేదు..దీంతో వారు కూడా ఎన్నికలు జరగకూడదని కోరుకుంటున్నారు. మొత్తం మీద...ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రతిపక్షనేత వై.ఎస్‌.జగన్‌, పవన్‌,బిజెపి నేతలు..ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అభ్యర్థులు కోరుకుంటున్నారు. అయితే...ఇవన్నీ ఎలా ఉన్నా..ఎన్నికల కమీషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఎన్నికల జాబితాను, ఇతరాలను సిద్ధం చేస్తున్నారు.

(182)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ