WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఛలో హైదరాబాద్‌ అన్న...ఐఎఎస్‌ బాబులు...!

ఇప్పటికీ హైదరాబాద్‌లోనే స్థిరనివాసం ఉంటున్న పలువురుశాఖాధిపతులు, డైరెక్టరేట్‌ అధికారులు, గురువారం నాడే...హైదరాబాద్‌కు తరలివెళ్లిపోయారు. మంగళ,బుధవారాల్లో కలెక్టర్ల సమావేశాలు ముగిసిన తరువాత..గురువారం ఉదయం నుండే హైదరాబాద్‌కు వీరు పయనమయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 'దినేష్‌కుమార్‌' కూడా హైదరాబాద్‌ వెళ్లారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత మిగిలిపోయిన తరువాత సంస్థల విభజన కోసం ఆయన తెలంగాణ సిఎస్‌తో సమావేశమయ్యారు. గురువారం నాడే బోసిపోయిన సచివాలయం..శుక్రవారం నాటికి మరింత బోసిపోయింది. విభజన చట్టంలోని సెక్షన్‌ 9,10 సంస్థల ఆస్తుల పంపకాలపై ఎపి సిఎస్‌ ఆధ్వర్యంలోని బృందం..తెలంగాణ సిఎస్‌ ఆధ్వర్యంలోని బృందంతో సమావేశమైంది. శని,ఆదివారం సెలవు కావడంతో మళ్లీ సోమవారం నాడే...హైదరాబాద్‌కు తరలివెళ్లిన ఐఎఎస్‌లు తిరిగి వెలగపూడి రానున్నారు. ఈ వారంలో సచివాలయం కేవలం రెండు రోజుల పాటు పనిచేసిందని చెప్పవచ్చు. కింది స్థాయి ఉద్యోగులుమాత్రమే సచివాలయంలో కనిపించారు. ఇదే విషయంపై కొందరు ఉద్యోగులు మీడియాతో వ్యాఖ్యానిస్తూ...మూడేళ్లు లో రిటైర్‌ కానున్న ఐఎఎస్‌ అధికారులు..హైదరాబాద్‌ నుండి వెలగపూడి వచ్చే ప్రసక్తేలేదని...ఈ విధంగానే..వారంతా రాకపోకలు సాగిస్తారని...అదే విధంగా కిందిస్థాయి ఉద్యోగులు నడుస్తారని, ఎప్పటికి పరిస్థితి చక్కబడుతుందో..అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శాఖాధిపతులు, గురువారం ఉదయమే హైదరాబాద్‌ వెళ్లడంతో...ప్రభుత్వ కార్యక్రమాలపై వెళ్లారా..? లేక సెలవుపై వెళ్లారా..అనేది అంతుబట్టడం లేదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 'దినేష్‌కుమార్‌' ఆధ్వర్యంలోని అధికార బృందం...తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకు వెళ్లిందని ఆయన అంతరంగిక అధికారులు చెబుతున్నారు. శుక్రవారం నాడే సమావేశం ముగుస్తుందా..? లేక శనివారం కూడా ఉంటుందా..? అనేది ఇప్పుడే తెలియదని...ఉద్యోగులు చెబుతున్నారు.

(130)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ