WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'చంద్రబాబు' మార్కు ప్రజాస్వామ్యానికి హ్యాట్సాఫ్‌....!

కాలం కలసిరాకున్నా...దురదృష్టం వెంటాడినా...రాజే కింకురుడు అగును..కింకరుడే..రాజు అగును..అని సత్యహరిశంద్ర నాటకంలో ఉంది. హరిశంద్రుడు చివరకు కాటికాపరిగా ఉద్యోగం చేయాల్సి వచ్చింది.ఎక్కడ చక్రవర్తి..ఎక్కటి కాటికాపరి ఉద్యోగం. అదే విధంగా...జరిగిన వింత పరిణామం గురించి కొంత మంది పోలీసు అధికారులు చర్చించుకుంటున్నారు. ఆ పరిణామం ఏమిటంటే...విజయవాడ పోలీసు కమీషనర్‌గా 'సురేంద్రబాబు' బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు కింద స్థాయి పోలీసు అధికారిగా 'వర్ల రామయ్య' బాధ్యతలు నిర్వహించారు. 'సురేంద్రబాబు' ఐపిఎస్‌ అధికారి...వర్ల రామయ్య..కింది స్థాయి అధికారి. సురేంద్రబాబు ముందు కనీసం కూర్చోవాలంటే...కింది స్థాయి అధికారి అయిన 'రామయ్య'కు ధైర్యం చాలదు. అటువంటి సమయంలో 'వర్ల' రామయ్య..పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసి...రాజకీయాల్లోకి వచ్చారు. రెండేళ్లపాటు...హౌసింగ్‌కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా పనిచేశారు..ఇటీవలే ఆర్టీసీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. గతంలో విజయవాడ పోలీసు కమీషనర్‌గా బాధ్యతలు నిర్వహించిన 'సురేంద్రబాబు'...తాజాగా..ఆర్టీసీ ఎండి అయ్యారు. అప్పట్లో..'సురేంద్రబాబు' కనిపిస్తే...శాల్యూట్‌ కొట్టారు 'వర్ల రామయ్య'. ఇప్పుడు..పరిస్థితి...మారింది..ఆర్టీసీ ఛైర్మన్‌గా 'వర్ల రామయ్య' ఉంటే...ఎండిగా ఉన్న 'సురేంద్రబాబు' ఆయనకు శాల్యూట్‌ చేయాల్సి వస్తోంది. తన కింద పనిచేసిన అధికారే...ఇప్పుడు తనకు బాస్‌గా రావడంపై 'సురేంద్రబాబు' ఏ విధంగా ఫీలవుతున్నారో బయటపడడం లేదు. ఏదైనా ఇలాంటి నియామకాలు ఎప్పుడూ జరగలేదు. 

 ముఖ్యంగా ఆర్టీసీలో అసలు జరగలేదు. ఉమ్మడి సంస్థలో ఆర్టీసీ ఎం.సత్యనారాయణ, ఆరేటి కోటయ్యలు ఛైర్మన్‌లుగా ఆరేళ్లు బాధ్యతలు నిర్వహించారు. గత ఎన్నికలకు ముందు ప్రమాదానికి గురైన చనిపోయిన శోభానాగిరెడ్డి కూడా ఆర్టీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. వీరందరూ రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేసిన వారు..సీనియర్లుగా పేరున్నవారే. ఇక్కడ ఛైర్మన్‌గా ఎవరినైనా...ప్రభుత్వం నియమించవచ్చు...ఒక ఐపిఎస్‌ అధికారి వద్ద పనిచేసిన కిందిస్థాయి అధికారిని ఆర్టీసీ ఛైర్మన్‌గా నియమించిన సందర్భాలు లేవు. ఈ అనుభవం సురేంద్రబాబుకు ఎటువంటి అనుభూతిని కల్గిస్తుందో...అంతే కాకుండా...విద్యాశాఖాధిపతిగా డాక్టర్‌ సాంబశివరావు బాధ్యతలు నిర్వహించినప్పుడు ప్రస్తుత ఎక్సైజ్‌శాఖ మంత్రి టీచర్‌గా, సంఘ నాయకుడిగా ఉండేవారు. అప్పట్లో...సాంబశివరావును ఆయన కలవాలంటే...స్లిప్‌ పంపాలి...అటువంటి 'జవహర్‌'...టీచర్‌ పదవికి రాజీనామా చేసి టిడిపిలో చేరి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. 'సాంబశివరావు' అదృష్టమో...దురదృష్టమో...ఆయన నిర్వహించే..శాఖకే... 'జవహర్‌' మంత్రి అయ్యారు. ఈ పరిస్థితి పెద్దగా అభ్యంతరం లేకపోయినా...'సురేంద్రబాబు'...అంత మాత్రం కాదు. ఇదే ప్రజాస్వామ్యం...అందమని కొందరి రాజకీయవిశ్లేషకులు...చెబుతున్నారు.

(166)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ