WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఆగస్టు 29న మంత్రి అఖిలప్రియ వివాహం...!

రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి అఖిల్‌ప్రియ త్వరలో వివాహం చేసుకోబోతున్నారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన సీనియర్‌ రాజకీయ నాయకులు భూమానాగిరెడ్డి, శోభానాగిరెడ్డిల కుమార్తె అయిన 'అఖిలప్రియ' గత ఎన్నికలకు ముందు..ఆమె తల్లి అయిన శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంలో రాజకీయాల్లోకి వచ్చారు. తరువాత జరిగిన ఉపఎన్నికల్లో ఆమె ఏకగ్రీవంగా వైకాపా నుంచి గెలుపొందారు. తరువాత తండ్రి భూమానాగిరెడ్డితో కలసి ఆమె తెలుగుదేశం పార్టీలో చేరారు. టిడిపిలో చేరిన కొన్నాళ్లకే 'భూమానాగిరెడ్డి' మరణించడంతో వచ్చిన ఉపఎన్నికల్లో 'నాగిరెడ్డి' సోదరుడి కుమారుడిని ఎన్నికల్లో నిలబెట్టి..టిడిపి అభ్యర్థిగా గెలిపించుకున్నారు.

  గతంలోనే మంత్రి అఖిలప్రియకు వైకాపా అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి బంధువులకు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. అయితే...భర్త నుంచి 'అఖిలప్రియ' విడాకులు తీసుకున్నారు. భూమా దంపతులు వైకాపా నుంచి బయటకు రావడానికి...ఈ వివాహం కూడా ఒక కారణమని అప్పట్లో ప్రచారం జరిగింది. తరువాత పరిణామాల్లో...శోభానాగిరెడ్డి,భూమా నాగిరెడ్డిల మరణంతో...'అఖిలప్రియ' ఆ కుటుంబానికి పెద్దదిక్కు అయింది. ఈనేపథ్యంలో ఆమె రెండో వివాహం చేసుకోబోతున్నారు. మాజీ డీజీపీ సాంబశివరావుకు బంధువైన భార్గవ్‌తో ఆమెకు ఈ రోజు నిశ్చితార్థం జరిగింది. గత కొన్నాళ్లుగా వారిద్దరూ ప్రేమించుకుంటున్నారని, ఆగస్టు 29న వివాహం చేసుకోవాలని నిర్ణయించారని తెలుస్తోంది.  

(855)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ