WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

సంచలనం సృష్టించిన 'అఖిలప్రియ'...!

'భూమా అఖిలప్రియ'కు ఆళ్లగడ్డ నియోజకవర్గం నుండి పోటీ చేసే అవకాశం ఉండదని ఆమె రాజకీయంగా తెరమరుగు అవడానికే కులాంతర వివాహం చేసుకుంటోందని..ఈ విషయాన్ని ఆమె 'చంద్రబాబు'కు ముందే చెప్పిందని విశ్వసనీయ సమాచారం. రాజకీయంగా తెరమరుగు అవతానని చెప్పకపోయినా...ఈనోటా...ఆ నోటా బయటపడడంతో...ఇంకా జాప్యం చేయకుండా...కులాంతర వివాహానికి సిద్దమయ్యారని వార్తలు వస్తున్నాయి. కులాంతర నిశ్చితార్థం వెనుక మంత్రి అఖిలప్రియ వ్యూహం మరో రకంగా ఉందని తెలుస్తోంది. నియోజకవర్గంలో 'బలిజ' కులస్తులు ఎక్కువగా ఉన్నారని...వారి ఆదరాభిమానాలతో విజయంసాధించవచ్చునని ఆమె నమ్ముతుందట. ఈ రెండు కథనాలపై నంద్యాల ప్రాంతంలో రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. మంత్రిగా వివాహం నిశితార్థం చేసుకున్న ఏకైక మంత్రిగా భూమా అఖిలప్రియ చరిత్రలో నిలిచిపోనుంది. భూమా కుటుంబంలో ఒకరికి ఆళ్లగడ్డ,ఎవి సుబ్బారెడ్డికి నంద్యాల నుంచి పోటీ చేసేందుకు 'చంద్రబాబు' ఒప్పించారని తెలుస్తోంది. అఖిలప్రియ సోదరుడైన భూమా బ్రహ్మానందరెడ్డికి సీటు ఇస్తానని చెప్పారని ప్రచారం జరుగుతోంది. ఆమె నిశ్చితార్థానికి చెందిన ఫోటోలు అటు సోషల్‌మీడియాలోనూ..ఇటు నియోజకవర్గంలో కనిపించడంతో ఆమె బంధు మిత్రులు, సామాజికవర్గానికి చెందినవారు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఏది ఏమైనా ఆమె రాజకీయాలకు దూరంగా ఉండేందుకే కులాంతర వివాహానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. మహిళా మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ...నిశ్చితార్థం చేసుకున్న ఏకైక మహిళాగా భూమా అఖిలప్రియ రికార్డు సృష్టించారు.

(361)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ