ముఖ్యకార్యదర్శి హోదా కోరుకుంటున్న 'అనురాధ'...! 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ముఖ్యకార్యదర్శి హోదా కోరుకుంటున్న 'అనురాధ'...!

దేవాదాయశాఖ కమీషనర్‌గా గత నాలుగేళ్ల నుంచి నిరాటంకంగా, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శలు ఎదుర్కొంటున్న అనురాధ..తాను ముఖ్యకార్యదర్శి హోదాలో రిటైర్‌ అవ్వాలని భావిస్తున్నానని ఈ నేపథ్యంలో ఆశాఖ ఎక్స్‌అఫీసియో ముఖ్యకార్యదర్శిగా నియమించమని చంద్రబాబును కోరిందట. ముఖ్యమంత్రి ఆమె కోరికను తిరస్కరించడంతో..ఏదో విధంగా అధికారుల ద్వారా ఆ హోదాను పొందేందుకు ఆమె ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 'దినేష్‌కుమార్‌'ను కలసి ఆమె తన కోరికను వెల్లబుచ్చినట్లు తెలిసింది. ఈ విషయంలో తానేమీ చేయలేనని...ముఖ్యమంత్రిని కలవాలని ఆయన సలహా ఇచ్చినట్లు తెలిసింది. ఇదే విషయంలో ఆమె సిఎంఒ కార్యాలయ ఇన్‌ఛార్జి సతీష్‌చంద్రపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. కేవలం తన సామాజికవర్గానికి చెందిన పూజారాలు, ఉద్యోగులు, అధికారులకు మాత్రమే ఆమె సహాయ,సహకారాలు అందించారని విమర్శలు ఉన్నాయి. అంతే కాకుండా 'కాకినాడ డిప్యూటీ కమీషనర్‌గా సూపరింటెండింగ్‌ అధికారిని నియమించడం వెనుక భారీ ఎత్తున్న ముడుపులు మారినట్లు...అప్పట్లో మంత్రిగా ఉన్న వారు దుయ్యబట్టినట్లు తెలిసింది. తనకు అన్యాయం జరిగిందని, ప్రమోషన్లు ఇవ్వాలని కోరుతున్న కిందిస్థాయి అధికారుల మొర ఆలకించడం లేదు...సరికదా ఇన్‌ఛార్జిగా కూడా ఇవ్వలేదని ప్రచారం జరుగుతోంది. ఆమె పేరుతో..ఆమె కుటుంబ సభ్యులు కోట్లాదిరూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డ జయరాజ్‌ అనే అధికారిపై అనురాధ ఎక్కువ ఆధారపడి నిర్ణయాలు తీసుకున్నారని ఆశాఖలో ప్రచారం జరుగుతోంది. 

  నిజాయితీ ముసుగులో అవినీతి ముసుగా...లక్షలు చేతులు మారిన మాట యధార్థమే...ఎవరెవరు..ఎవరి ద్వారా తీసుకున్నారో విచారణ జరిపితే వాస్తవాలు బయటపడతాయి..ముఖ్యంగా ఆమె కుటుంబ సభ్యులపై విచారణ జరిపితే...ఆమె అక్రమాలు బయటపడతాయని...ఆశాఖలో పనిచేస్తోన్న అధికారి ఒకరు చెబుతున్నారు. శాఖాధిపతిని పట్టించుకోరు..నిన్నటి వరకుమంత్రిగా పనిచేసిన మాణిక్యాలరావును పట్టించుకోలేదు. దేవాదాయశాఖకు మంత్రిగా, కమీషనర్‌గా, ఆమే ఒంటెత్తుగా నిర్ణయాలు తీసుకున్నారనే విమర్శలు తెచ్చుకున్నారు. దేవాదాయశాఖాధిపతి మన్మోహన్‌సింగ్‌ తన పరిధిలోకి వచ్చే ఫైళ్లను నిబంధనల ప్రకారమే పరిష్కరించారు తప్ప..కింది స్థాయిలో ఏమి జరుగుతుందని తెలుసుకోలేదు. కానీ ఆయనను ఆ పోస్టు నుంచి తప్పించి...తనను ఆ పోస్టులో నియమించాలని...అనురాధ కోరుకున్న విషయం బయటకు పొక్కడంతో ఏమీ తెలియనట్లు 'మన్మోహన్‌' భావిస్తున్నారు. ఇంతకీ ఆమె పోస్టు ఇవ్వాడానికి ముఖ్యమంత్రి అంగీకరించలేదా..? ఇంకెవరైనా అడ్డుపడ్డారా..? అనే విషయం ఇప్పటికీ బయట పడడం లేదు. కమీషనర్‌గా రిటైర్డ్‌ అయితే విలువ ఉండదని..కనీసం కార్యదర్శి హోదాలో రిటైర్‌ అయితే...బావుంటుందని..ఐఎఎస్‌ అధికారుల నమ్మకం. ఆ నమ్మకంతోనే అనురాధ ఆశాఖాధిపతి పోస్టుకు ప్రయత్నించారు..విఫలమయ్యారు..ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

(2518)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ