WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'రాంనారాయణరెడ్డి'ని బతిమాలడవద్దు బాబుగారూ...!?

మాజీమంత్రి ఆనం రాంనారాయణరెడ్డి అసంతృప్తితో ఉన్నారని ఆయన టిడిపిని వీడి 'జగన్‌' పార్టీలో చేరతారని నెల్లూరు జిల్లాలో ప్రచారం జోరుగా జరుగుతోంది. ఆయనను పార్టీలో చేర్చుకోవద్దని 'మేకపాటి' వర్గం...పార్టీని వీడిపోతే పోనివ్వండి...అని 'చంద్రబాబు'ని కొందరు కోరుతున్నారు. వాస్తవానికి కాంగ్రెస్‌ హయాంలో నెల్లూరు జిల్లాను శాసించింది..ఆనం సోదరులే..! అప్పట్లో...నేదురుమల్లి జనార్థన్‌రెడ్డి భార్య రాజ్యలక్ష్మికి మంత్రి పదవి ఇచ్చినా..పెత్తనమంతా...'ఆనం' సోదరులే..నిర్వహించారు. జిల్లా స్థాయిలో బదిలీలు, పోస్టింగ్‌లు 'ఆనం' సోదరులే చేశారు. ఈ విషయంపై 'జనార్థన్‌రెడ్డి' ఆవేదన కూడా వ్యక్తం చేశారు. రాం నారాయణరెడ్డికి ఎందుకు అసంతృప్తి అని...ఆయన పార్టీలో చేరితే వెంటనే ఎమ్మెల్సీ...ఇవ్వాలా..? చంద్రబాబుపై వారు ఎన్ని విమర్శలు చేశారు..? జిల్లా అంతటా మా వర్గం ఉంది...స్వతంత్య్రంగా బరిలోకి దిగి గెలుస్తామని చెబుతున్న 'ఆనం' సోదరుల్లో 'రాంనారాయణరెడ్డి' కాంగ్రెస్‌ పోటీ చేస్తే...పది వేల ఓట్లు రాలేదు. ఇటీవల మరణించిన 'ఆనంవివేకానందరెడ్డి' కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేయడానికే ఇష్టపడలేదని...నెల్లూరు జిల్లాలో ఆనం వర్గం లేదని...ఆయన సామాజికవర్గానికి చెందిన వారందరూ 'జగన్‌' చెంతకు చేరారని ఆ జిల్లాకు చెందిన టిడిపి బిసి నేతలు చెబుతున్నారు. 

   రాంనారాయణరెడ్డి వైకాపాలో చేరితే..ఆయనకు 'జగన్‌' బ్రహ్మరథం పట్టరని...తాను నిలబెట్టిన అభ్యర్థిపై 30వేల ఓట్లుతేడాతో ఓడిపోయిన 'రాంనారాయణరెడ్డి'ని 'జగన్‌' ఎందుకు ఖాతరు చేస్తారని...ఆయన వల్ల గ్రూపులు పెరుగుతాయని...బెదిరిస్తే..బెదిరిపోవడానికి 'జగన్‌' చంద్రబాబు కాదు. ఇప్పటికే...ఆయన జిల్లాలో ఎవరెవరిని ఎక్కడ పోటీ చేయించాలనేదానిపై 'జగన్‌'కు ఒక నిర్ణయానికి వచ్చారు. ఆనం సోదరుల అవసరం 'జగన్‌'కు లేదు. మరి 'చంద్రబాబు' ఎందుకు 'ఆనం' కుటుంబం కోసం పాకులాడుతున్నారు. ఇదే విషయంపై టిడిపికి చెందిన ఒక ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ మా నేతకు భయం..అందుకే...ఆనంను బతిమిలాడుతున్నారేమో..? ఉంటే పార్టీలో ఉంటారు..పోతే పోతారు..అని ఆ ఎమ్మెల్యే 'చంద్రబాబు'ను కోరారు. జిల్లాలో తెలుగుదేశం వర్సెస్‌ వైకాపాగా ఉంటుందని ఆయన అంటున్నారు. ఆనం కుటుంబ ప్రభావం జిల్లా అంతటా లేదని, ఆత్మకూరులో కాంగ్రెస్‌ అభ్యర్థిగా రాంనారాయణరెడ్డి పోటీ చేస్తే తొమ్మిదివేలు ఓట్లు వచ్చాయని...జిల్లా అంతటా వారి వర్గం పైపైన కనిపిస్తుందని..ఎన్నికల సమయాన వారి వర్గం అంతా 'జగన్‌' వైపే మొగ్గుచూపుతారని టిడిపి నాయకుల నమ్మకం. అందుకేనేమో..రాంనారాయణరెడ్డి విషయంలో 'చంద్రబాబు' మౌనం వహిస్తున్నారని చెప్పవచ్చు.

(244)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ