WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

కెసిఆర్‌ను వణికిస్తోన్న కర్ణాటక ఎన్నికలు...!

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ అధికార కాంగ్రెస్‌పార్టీ విజయం సాధిస్తుందన్న ఎగ్జిట్‌పోల్స్‌ సర్వేలు తెలంగాణ సిఎం కెసిఆర్‌కు మింగుడుపడడం లేదు. తెలంగాణకు పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో కాంగ్రెస్‌ విజయం సాధిస్తే...ఆ ప్రభావం తమ రాష్ట్రంపై ఉంటుందని...మొదటి నుంచి తెలంగాణ ముఖ్యులు చెబుతూనే ఉన్నారు. అందుకే...అక్కడ కాంగ్రెస్‌ గెలవకుండా...ఉండేందుకు...జెడిఎస్‌కు ఓటు వేయాలని...ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రత్యేకంగా వెళ్లి ప్రచారం చేసి వచ్చారు. తాను...కాంగ్రెస్‌కు, బిజెపికి వ్యతిరేకంగా ఉన్నానని...అందుకే జెడిఎస్‌కు ఓటు వేయాలని కోరానని...ఆ సందర్భంగా కెసిఆర్‌ చెప్పారు. అయితే లోగుట్టు వేరే ఉందని అప్పుడే విశ్లేషణలు వెలువడ్డాయి. దీని ప్రకారం రెండు లక్ష్యాలతో కెసిఆర్‌ కర్ణాటక వెళ్లారని..వాటిలో ఒకటి కాంగ్రెస్‌ గెలిస్తే...పొరుగునే ఉన్న...తమపై ఆ ఫలితాల ప్రభావం ఉంటుందనేది ఒకటి...కాగా..తన రహస్యస్నేహితుడైన 'మోడీ'ని ఎలాగైనా గట్టెక్కించాలనే ఉద్దేశ్యంతోనే ఆయన కర్ణాటక వెళ్లారనేది రెండోది. అందుకే కర్ణాటకలో బిజెపి బి టీమ్‌ అయిన జెడిఎస్‌కు ఓటు వేయాలని కోరడం. ఆ పార్టీ ఎన్నికల్లో స్వంతంగా ఎలాగూ మెజార్టీ సాధించలేదు కనుక...ఆ పార్టీ కొన్ని ఓట్లు చీలిస్తే...అది బిజెపికి ఉపయోగమని..తద్వారా..దక్షిణాదిలో కాంగ్రెస్‌ను నిలువరించాలనేది...కెసిఆర్‌ ప్లాన్‌. దీనిలో భాగంగానే...ఆయన చేయాల్సిన ప్రచారం చేసివచ్చారు. అయితే..ఈ రోజు జరిగిన ఎన్నికల పోలింగ్‌ కెసిఆర్‌కు రుచించడం లేదు. మళ్లీ అక్కడ కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందని ఎగ్జిట్‌పోల్స్‌ చెప్పడంతో...కెసిఆర్‌ తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారట.

ముస్లింలు కాంగ్రెస్‌ వైపే...!

కర్ణాటక ఎన్నికల్లో మైనార్టీల్లో మెజార్టీ ఓటర్లు అధికార కాంగ్రెస్‌కే ఓటు వేశారనేది ఎగ్జిట్‌పోల్స్‌ సర్వే సారాంశం. కర్ణాటకలోని ముస్లింలు కాంగ్రెస్‌కు ఓటు వేస్తే...తెలంగాణలో ఉన్న ముస్లింలు కూడా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఏకపక్షంగా ఓటువేస్తారనే భయం కెసిఆర్‌లో కనిపిస్తుందని..విశ్లేషకుల మాట. తెలంగాణలోని ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని..కెసిఆర్‌ గత ఎన్నికల సందర్భంగా ప్రకటించి వారిని ఆకట్టుకున్నారు. కానీ...ఆయన అధికారంలోకి వచ్చిన తరువాత దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. హైదరాబాద్‌లో బలంగా ఉన్న ఎంఐఎంతో దోస్తీ కట్టి...ముస్లిం వర్గాలను దగ్గరకు తీశారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వారికి ఇవ్వాల్సిన రిజర్వేషన్లు ఇవ్వకపోవడం, దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ పుంజుకోవడంతో..మళ్లీ ముస్లిం వర్గాలు మొత్తం కాంగ్రెస్‌ వైపే చూస్తున్నాయి. ఇది కెసిఆర్‌కు దెబ్బే. తెలంగాణలో గణనీయంగా ఓటు కలిగిన ముస్లిం ఏకపక్షంగా కాంగ్రెస్‌ వైపు నడిస్తే...కెసిఆర్‌కు పరాజయం తప్పదు. తెలంగాణకు పక్కనే ఉన్న బీదర్‌,గుల్బర్గా, రాయచూర్‌,బిజపూర్‌, కొప్పల్‌లో ఉండే ముస్లిం వర్గాలన్నీ కాంగ్రెస్‌ వైపే నడిచాయి. వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభావం తెలంగాణ ముస్లింలపైన ఖచ్చితంగా ఉంటుంది. స్వాతంత్య్రానంతరం నుంచి ముస్లింలు కాంగ్రెస్‌ను వెన్నంటే ఉంటున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే పరిస్థితి ఉంటుందనడంలో సందేహం లేదు.

అదే దారిలో ఎస్సీ,ఎస్టీలు...

కర్ణాటకలో మెజార్టీ ఎస్సీ,ఎస్టీలు కాంగ్రెస్‌నే సమర్ధించాయని ఎగ్జిట్‌పోల్స్‌ చెబుతున్నాయి. అదే దారిలో తెలంగాణలోని ఎస్సీ,ఎస్టీలు నడుస్తారని ఆయా వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలకు ముందు ఈ వర్గాలకు అనేక హామీలు ఇచ్చిన కెసిఆర్‌..తరువాత వాటిలో ఒక్కటీ నిలబెట్టుకోలేదని వారు నిలదీస్తున్నారు. ఎన్నికల్లో గెలిస్తే..దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానన్న కెసిఆర్‌ మాట తప్పారని, అదే సమయంలో ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాలు ఇస్తానన్న వాగ్దానాన్ని మరిచారని, దళిత నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానని ప్రకటించిన ఆయన దాన్ని కూడా నిలబెట్టుకోలేదనే అభిప్రాయం వారిలో ఉంది. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా...దళితులపై దాడులు పెరిగాయని...వాటిని నిరోధించడంలో కెసిఆర్‌ వైఫల్యం చెందారనే ఆగ్రహం వారిలో ఉంది. దీంతో..వారంతా కాంగ్రెస్‌ సమర్థిస్తారని..చెబుతున్నారు.

మెజార్టీ కులాలు కాంగ్రెస్‌ వైపే...!

కాగా...కర్ణాటకలో మెజార్టీ ఓటర్లు కాంగ్రెస్‌ను సమర్థించిన రీతిలోనే...తెలంగాణలోనూ..మెజార్టీ వర్గాలైన ఎస్సీ,ఎస్టీ,ముస్లిం,రెడ్డి,ఓబీసీలు కాంగ్రెస్‌ను సమర్థిస్తాయి. ఇప్పటికే ఈ కులాలకు చెందిన సంఘాలు తమ అభిప్రాయాలను బహిరంగంగా చెబుతున్నాయి. తాజాగా ఈ వర్గాలకు తోడు...కమ్మ సామాజికవర్గం కూడా కాంగ్రెస్‌ వెంట నడవాలనే అభిప్రాయం ఉంది. హైదరాబాద్‌,రంగారెడ్డి, నిజామాబాద్‌, కరీంనగర్‌,నల్లగొండ జిల్లాల్లో ఈ సామాజికవర్గం గెలుపు ఓటములను నిర్ణయించే స్థితిలో ఉంది. వెలమ,వైశ్య,బ్రాహ్మిన్స్‌, కొన్ని బిసి కులాలు కెసిఆర్‌ వెంట నడిచినా...కాంగ్రెస్‌కు ఉన్నంత మద్దతు మాత్రం లేదని స్పష్టంగా చెప్పవచ్చు. మొత్తం మీద..కులాల వారీగా, మతాల వారీగా.. లెక్కలు వేసుకుంటే...రాబోయే రోజుల్లో కెసిఆర్‌కు కష్టాలు తప్పవని తేలుతోంది. అంతే కాకుండా...రహస్యంగా బిజెపికి మద్దతు ఇస్తోన్న కెసిఆర్‌పై ఉన్నతవిద్యావంతులు మండిపడుతున్నారు. ఇదే కనుక ఎన్నికల్లో ప్రతిఫలిస్తే...తెలంగాణలో కాంగ్రెస్‌ విజయం సునాయాసం అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.


(501)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ