WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

గుంటూరు గబ్బర్‌సింగా...మజాకా...!?

గుంటూరు పట్టణ పరిసర ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణలో ఎస్పీ విజయారావు మరియు ఆయన టీం సభ్యులు కఠినంగా వ్యవహరించిన నేపథ్యంలో దొంగతనాలు తగ్గిపోయాయి...రౌడీ షీటర్ల ఆగడాలు ఆగిపోయాయి..పట్టణంలో ట్రాఫిక్‌ పరిస్థితి బాగా మెరుగుపడిందని చెప్పవచ్చు. ఈ మూడు విషయాల్లో అర్బన్‌ ఎస్పీ విజయారావు కిందిస్థాయి నుండి సమీక్షా సమావేశాలు నిర్వహించి...ఎవరెవరు ఏ విధంగా బాధ్యతలు నిర్వహించాలి..ఎవరెరు ఏయే బాధ్యతలు స్వీకరించాలనే దానిపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో..వారందరూ శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో దృష్టిసారిస్తున్నారు. కొద్ది రోజుల కిందట అర్థరాత్రి ఎస్పీ విజయారావు డిఎస్సీలతో, సిఐలతో గుంటూరు పట్టణంలోని పలు ప్రాంతాలను సందర్శించారు. అంతకు ముందు దొంగతనాలు జరిగిన ప్రాంతాలు..తాజాగా..ఏయే ప్రాంతాల్లో దొంగలను రెక్కీ నిర్వహిస్తున్నారనే ప్రాంతాలను దర్శించడమే కాకుండా...ఆయా ప్రాంతాల ప్రజలను స్వయంగా కలుస్తూ...మీరందరూ ఒక్కటిగా వ్యవహరించండి...మీ వెనుక మేము ఉంటాం..అని హామీలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ...పలువురు రౌడీ షీటర్లకు కోటింగ్‌ ఇచ్చి వారి ఆగడాలను కట్టడి చేశారు. గుంటూరు పట్టణం మరియు ఆ పరిసర ప్రాంతాలలో ఇటీవల దొంగతనాలు జరగడం లేదన్నది వాస్తవం. గతంలో పొరుగు రాష్ట్రాల నుంచి టీమ్‌లు..టీమ్‌లుగా గుంటూరు పట్టణంలోకి ప్రవేశించి...ఖాళీగా ఉన్న ఇళ్లల్లో రెక్కీ నిర్వహించి...దొంగతనాలు చేసి భారీ ఎత్తున ఆస్తులు దోచుకున్నారు. దోచుకున్న ఆస్తులను వెంటనే తమ సొంత ప్రాంతాలకు తరలించిన నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు వెళ్లిన పోలీసు అధికారులను స్థానికులు ప్రతిఘటించడంతో తిరిగి రావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. పొరుగు రాష్ట్రాలకు చెందిన టీమ్‌లు రూరల్‌ ప్రాంతాలపై దృష్టిసారించినట్లుపోలీసు అధికారుల దృష్టికి రావడంతో వారు కూడా అర్బన్‌ప్రాంత అధికారుల వలే కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇంత వరకు గజిబిజిగా ఉన్న గుంటూరు ట్రాఫిక్‌ సమస్య 75శాతం పరిష్కారం అయింది. ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వ్యాపారా కూడలిలో ట్రాఫిక్‌ కూడలిలో ఉదయం నుంచి సాయంత్రంవరకు కనిపిస్తూనే ఉన్నారు. అందుకేనేమో..కొన్ని ప్రాంతాల్లో ఆదివారం సెలవు ఉన్నప్పుడు ఉన్న విధంగా ఉంటున్నాయి. దీంతో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారమైందని చెప్పుకోవచ్చు. గుంటూరు పట్టణంలో రౌడీ షీటర్ల కార్యకలాపాలు..బాగా నిలిచిపోయాయని స్థానికులు చెబుతున్నారు. శాంతిభద్రతలు, రౌడీషీటర్లపై ప్రత్యేక దృష్టిసారించడం, దొంగతనాలను అరికట్టడం వంటి కార్యక్రమాలను యుద్ధప్రాతిపదికన చేపట్టిన..ఎస్పీ విజయారావుకు అన్ని విధాలుగా కలసివచ్చి సత్పలితాలు ఇచ్చింది. ఈ మూడు సమస్యలు ఇంత త్వరగా పరిష్కారం అవుతాయని కిందిస్థాయి అధికారులు భావించలేదు. రౌడీ షీటర్ల తమ కార్యకలాపాలకు స్వస్తిచెప్పి..వ్యాపారాలు చేసుకుంటున్నారని, ఎక్కడైనా..ఎవరినైనా బెదిరించినట్లు తమ దృష్టికి వస్తే..ఆగమేఘాలపై వారి వద్దకు వారి భరతం పడుతున్నామని..ఈ విషయంలో మా ఎస్పీ విజయరావు పూర్తిగా సహకరిస్తున్నారని పలువురు డిఎస్పీలు, సిఐలు మీడియా వర్గాలకు చెబుతున్నాయి. కొద్ది రోజుల కిందట...ఒక ప్రాంతంలో జరిగిన చిన్నపాటి తగాదాను ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా స్థానిక పోలీసులువెంటనే ఆ సమస్యను పరిష్కరించడమే కాకుండా..కారుకులైన వారిపై చర్యలు తీసుకున్నారు. ఇంత వరకు భూముల విషయంలో జోక్యం చేసుకునే కిందిస్థాయిపోలీసు అధికారులు తాజాగా ఎస్పీ కఠిన వైఖరి అవలంభించడంతో సివిల్‌ వ్యవహారాల్లో పోలీసు స్టేషన్‌కు రావద్దని కోరుతున్నారు. ఇదే దూకుడు మరికొద్ది రోజులు కొనసాగిస్తే..రౌడీ షీటర్లు కార్యకలాపాలు నిలిచిపోతాయి...ట్రాఫిక్‌ సమస్య పరిష్కారం అవుతుందని, దోపిడీ దొంగలు ఈ ప్రాంతాన్నివదలి పోతారని చెబుతున్నారు. తాజాగా వేసవి సెలువులు వచ్చిన నేపథ్యంలో పలు ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక దృష్టిసారించి ఎటువంటి అవాంచనీయ ఫలితాలు సాధించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి ఎవరెవరు వస్తున్నారు..? వారికి స్థానికంగా సహకరిస్తున్నవారెవరు..అన్నదానిపై ఎప్పటికప్పుడుసమాచారం తెలుసుకోవడంతో..దాదాపు..పొరుగు రాష్ట్రాల నుంచి దొంగతనాలకు వచ్చే వారి సంఖ్య తగ్గిపోయింది. బదిలీలు, పోస్టింగ్‌ల్లో పారదర్శకంగా వ్యవహరించడమే కాకుండా, స్వయంగా కలసి విజ్ఞప్తి చేసుకున్నవారికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటూ...కొన్నేళ్లు సర్వీసు పూర్తి చేసిన వారిని వారు కోరుకున్న ప్రాంతానికి బదిలీ చేస్తున్నారు. దీంతో బదిలీలకు, పోస్టింగ్‌లకు లంచాలు ఇవ్వాల్సిన పనిలేదని, రాజకీయ నాయకులను ఆశ్రయించాల్సిన అవసరం లేదని...రాజకీయ సిఫార్సులు కూడా తగ్గిపోయాయని...అర్బన్‌ కార్యాలయ అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ సచివాలయం, ముఖ్యమంత్రి నివాసం అర్బన్‌ ప్రాంతంలో ఉండడంతో...విశ్రాంతి తీసుకోకుండా ఎక్కువ సమయం కేటాయిస్తున్నామని ఊరేగింపులప్పుడు, సమావేశాలప్పుడు, శాంతిభద్రతలకు విఘాతం కల్గింఛకుండా, ట్రాఫిక్‌ సమస్యలు ఏర్పడకుండా, ఆయా ప్రాంతాల్లో జేబు దొంగలపై ప్రత్యేక దృష్టిసారిస్తూ...అందరికీ వారిపాలిట యముడుగా పోలీసు ల్లో ఎస్పీ విజయారావు పూర్తిగా విజయం సాధించినట్లేనని ఇటీవల జరిగిన సంఘటనలు స్పష్టం చేశాయి.

(229)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ