WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'కన్నా' నిజాయితీపరుడా...! 'సోము' అవినీతి పరుడా...!?

బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు అవినీతితో అక్రమాస్తులు భారీ ఎత్తున్న కూడగట్టుకున్నారని, ఆధారాలు లేని విమర్శలు, ఆరోపణలు చేసి...ఎపిలో బిజెపి ప్రతిష్టను పూర్తిగా నాశనం చేశారని...ఈ నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్ష పదవి ఆయనకు ఇవ్వవద్దని...అదే సామాజికవర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణకు ఇవ్వాలని కొందరు బిజెపి నేతలు అమిత్‌షాకు లేఖ రాసినట్లు బయటకు పొక్కింది. దీంతో అధిష్టానం 'కన్నా'ను బిజెపి అధ్యక్షుడిగా నియమించింది. దీనిపై 'సోము' అనుచరులు మండిపడుతున్నారు. కన్నా రాజకీయ ప్రస్తానవన సమయంలో ఉన్న ఆస్తులు ఎంత..? ఇప్పుడు ఉన్న ఆస్తులు ఎంత..? అనే విచారణ జరిపే దమ్ముందా..? అని వీర్రాజు అనుచరులు నిలదీస్తున్నారు. ఒకప్పుడు సామాన్య వ్యక్తిగా రాజకీయ జీవితం ప్రారంభించిన 'సోము' ఈ రోజు కోటీశ్వరుడు అయ్యాడంటే...ఆయన ఏ విధంగా సంపాదించారు...? అని బిజెపి నాయకులే పలు సందర్బాల్లో ప్రశ్నించడం జరిగింది. 'జగన్‌' పంచన చేరబోయి రంగం సిద్ధం చేసుకుని...అనారోగ్య కారణాలతో హాస్పటల్‌లో చేరి టిడిపిలో చేరేందుకు తన రహస్య వ్యాపార భాగస్వాముల ద్వారా ప్రయత్నించిన 'కన్నా'ను ఏ అర్హతతో అధ్యక్షుడిగా నియమించారని 'సోము' ప్రశ్నిస్తున్నారు. గతంలో కన్నా..చంద్రబాబుపై చేసిన విమర్శలు, ఆరోపణల కన్నా..మా నాయకుడు సోము వీర్రాజు టిడిపి ప్రభుత్వాన్ని దుయ్యబట్టి...చంద్రబాబు కంటికి నిద్రలేకుండా చేశారని ఆయన అనుచరులు చెబుతున్నా...సంపాదించినసొమ్మును పార్టీకి ఖర్చు పెట్టే విషయంలో పిసనారిగా వ్యవహరిస్తారని, అదే కన్నా అయితే..కోట్లు ఖర్చు పెట్టగలరని...ఈ కారణాలతోనే ఆయనకు బిజెపి అధ్యక్ష పదవి దక్కినట్లు భావిస్తున్నట్లు బిజెపిఎల్‌పి నాయకుడు విష్ణుకుమార్‌రాజుతో పాటు ఇతర ముఖ్యనాయకులు కూడా సన్నిహితల వద్ద వ్యాఖ్యానిస్తున్నారు. సోము వీర్రాజు కన్నా 'కన్నా' ధీటైన నాయకుడేనని...ఆయనకు కాపు సామాజికవర్గంలో పలుకుబడి ఉన్న మాట నిజమేనైనప్పటికీ...తాజా పరిస్థితుల్లో వారిలో ఎక్కువ మంది 'జనసేన' వైపు వెళతారని వారు గుర్తు చేస్తున్నారు. 2009లో ప్రజారాజ్యం ప్రభావం గుంటూరు పట్టణంలో భాగా ఉన్నప్పటికి కాపు ఓటర్లలో పట్టుసడలకుండా...ఇతర వర్గాలను కూడా ఆకర్షించి...తమ నాయకుడు ఎమ్మెల్యేగా విజయం సాధించారని...కన్నా అనుచరులు ఎదురుదాడి చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో 'కన్నా' అంటే అభిమానం ఉన్న ఆయన సామాజికవర్గ ఓటర్లల్లో ఎక్కువ మంది..టిడిపికి వ్యతిరేకంగా ఓటు వేసిన వారే. ఈ నేపథ్యంలో 'కన్నా' మిగతా ఓటర్లను ఆకర్షించే శక్తి ఉందా..? సోము వీర్రాజు పార్టీలో సీనియర్‌ కావచ్చు...ఆర్‌ఎస్‌ఎస్‌లో కీలకపాత్ర పోషించవచ్చు.. ఆ రెండు అర్హతలు ప్రస్తుత పరిస్థితుల్లో పనికిరావని, కోట్లు ఖర్చు పెట్టగల వ్యక్తితో పాటు, సామాజికవర్గంలో పట్టున్న 'కన్నా' సమర్థుడని...అందుకే ఆయనను ఎంపిక చేశారని గుంటూరు జిల్లాకు చెందిన బిజెపి నాయకులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ...సోము వీర్రాజు అవినీతి అక్రమాలను అధిష్టానానికి పంపించడంలో ఆయన వ్యతిరేకులు సఫలీకృతులయ్యారు. ఇవన్నీ 'కన్నా'కు కలసి వచ్చి..పదవి దక్కింది.

(177)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ