WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

నెల్లూరు ఎంపిగా పోటీచేయను:ఆదాల

ఎంపి పదవికి మేకపాటి రాజమ్మోహన్‌రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో...దానిని ఆమోదించి..తిరిగి ఉప ఎన్నిక జరిగితే...అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దింపాలని 'చంద్రబాబు' పలువురు నేతలను ప్రశ్నించగా..ఎక్కువ మంది 'ఆదాల' పేరు సూచించారని...ఇదే విషయాన్ని చంద్రబాబు...ఆదాలను అడగగా...ఎంపీగా పోటీ చేయనని...ఆయన ఖరాఖండిగా చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. 2014 ఎన్నికల్లో తమ నాయకుడు ఎంపిగా పోటీ చేసి రూ.40కోట్లు ఖర్చుచేశారని....కేవలం పదివేల ఓట్లతేడాతో ఓడిపోయారు..ఆయన ఓడిపోవడానికి...ఆత్మకూరు టిడిపి అభ్యర్థి 30వేల తేడాతో ఓడిపోవడమేనని వారు చెబుతున్నారు. మూడు సార్లు ఓడిపోయిన 'చంద్రమోహన్‌రెడ్డి'ని 'చంద్రబాబు' భుజాన ఎక్కించుకుంటున్నారని...ఇటువంటి...నాయకులను ప్రోత్సహిస్తున్న చంద్రబాబు మాట తమ నేత ఎందుకు వినాలని వారు ప్రశ్నించారు. చంద్రబాబు మాట విని పోటీ చేసి..కోట్లు పోగొట్టుకున్నా...ఆయనకు అన్యాయం జరుగుతున్నా...వివిధ కారణాలతో... అవమానిస్తున్నా...బాహాటంగా, విమర్శలు, ఆరోపణలు చేశారా..? మౌనంగా భరించి ఊరుకున్నారే తప్ప...ఏనాడూ...పార్టీ విషయాలను బజారు పాలు చేయలేదు. తమ నేత...ఈసారి ఎంపీగా పోటీ చేస్తే...గెలవడం ఖాయం. కానీ...ఆయన పోటీ చేస్తానన్న తాము చేయనీయమని..ఆగ్రహంతో చెబుతున్నారు. ఒక్కొక్క నాయకుని ఏకాంతంగా పిలిచి నెల్లూరు జిల్లాలో పార్టీ పరిస్థితి ఏమిటి..? ఎవరెవరు ఏ విధంగా పనిచేస్తున్నారు..ఎవరెవరు కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. ఎవరెవరు అక్రమార్జనలకు పాల్పడుతున్నారనే విషయాన్ని 'చంద్రబాబు' తెలుసుకోగలిగారు. ఆ విధంగా ఏకాంతంగా మాట్లాడిన వారిలో ఎక్కువ మంది...సోమిరెడ్డికి మద్దతు ఇస్తూ..మంత్రి నారాయణను మా జిల్లాపై పెత్తనం చేయించారు...అందరికి అందుబాటులో ఉండే ఆదాలను అభిమానించారు. వ్యక్తిగత అభిమానంతో..ప్రజల్లో వ్యతిరేకత ఉన్నవారిని మాపై రుద్దారు అని గట్టిగా చెప్పినట్లు తెలిసింది. ఈ సమావేశంలో కొందరు నాయకులు ఏకాంతంగా 'చంద్రబాబు'తో మాట్లాడినప్పుడు విచిత్రమైన విషయాలు బయటకు వచ్చాయి. నెల్లూరు జిల్లాలో మొదటి నుంచి రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారే అధికారం చెలాయించేవారు..ఏ పార్టీ అధికారంలో ఉన్నా అదే సామాజికవర్గానికి మంత్రి పదవి దక్కేది..మీరు మూడేళ్లపాటు..నారాయణకు పదవి ఇవ్వడంతో 'రెడ్డి' సామాజికవర్గ నాయకులు, ఓటర్లు ఆగ్రహంతో ఊగిపోయారు. గత చరిత్ర మీరే చూసుకోండి...ఎన్నికల్లో మనం ఓడిపోయినప్పుడల్లా 'రెడ్డి' సామాజికవర్గం వ్యతిరేకత కాదా..? ఆ సామాజికవర్గంలో ఎంతో కొంత పలుకుబడి, ఉన్నవారికి అధికారం ఇవ్వండి...ఇది సోమిరెడ్డి వ్యవహారం వల్ల కాదు. నారాయణను మరింత దూరం పెట్టండి..అని పలువురు చెప్పడం జరిగింది. ఇప్పుడిప్పుడే...చంద్రబాబు చేసిన తప్పేమిటో తెలుసుకున్నారు. ఎవరెవరిని కత్తిరించాలో వారిని కత్తిరించబోతున్నారు. సీనియర్‌ నేతలకు, కార్యకర్తలకు పదవులు ఇవ్వడం ఖాయమని ఆయన చెప్పారని..వారు చెబుతున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు రవిచంద్రయాదవ్‌ కూడా పార్టీకి నష్టం చేకూరుస్తున్నారని పలువురు చెప్పారు. మేకపాటి రాజీనామాకు ఆమోదం వేస్తే...ఉప ఎన్నికలు వస్తే...తామెవరం..పోటీ చేయం..తమవల్ల కాదు..మీరే అభ్యర్థిని ఎంపిక చేయండి...అని ఎక్కువ మంది 'చంద్రబాబు'కు చెప్పడం జరిగింది. కానీ..వీరిలో ఎక్కువ మంది..ఆదాల పేరునే సూచించడం జరిగింది. అంతే కాకుండా..మాజీమంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిని ఇతర ముఖ్యనాయకులను పార్టీలో చేర్చుకోగలిగితే...ఎంపిగా టిడిపి విజయం ఖాయం అవుతుందని పలువురు చెప్పారట. చంద్రబాబు బుజ్జగించి చెప్పినా..పోటీ చేయనంటున్న ఆదాల మనసు మార్చుకుని పోటీ చేస్తారని, కానీ...సోమిరెడ్డి దూకుడు తగ్గిస్తేనే ఇది సాధ్యపడుతుందని..పలువురు చంద్రబాబుకు సూచించారు. ముఖ్యనాయకులతో,ఎమ్మెల్యేలతో ఏకాంతంగా చంద్రబాబు చేసిన చర్చల్లో అనేక వాస్తవాలు బయటకు వచ్చాయి. ఆయన దృష్టికి రాని విషయాలను కూడా చంద్రబాబు తెలుసుకోగలిగారు. నెల్లూరు జిల్లా పార్టీ బలం మరింత పెంచేందుకు ఆయన నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

(158)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ