WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'చంద్రబాబు'ను భేఖాతరు చేస్తోన్న మంత్రి సోమిరెడ్డి...!

మీరు ఎన్నిసార్లు చెప్పినా..హెచ్చరించినా..మందలించినా...ఎమ్మెల్యేలకు, నియోజకవర్గాల పార్టీ ఇన్‌ఛార్జిలకు తెలియకుండా...ఎటువంటి ప్రారంభోత్సవాలు చేయవద్దని మంత్రి సోమిరెడ్డిని ఆదేశించినా...ఆయన ఖాతరు చేయడంలేదని పలువురు నేతలు ఈ సమావేశంసందర్భంగా ఫిర్యాదు చేశారు. దీనికి ఉదాహరణగా..కొద్దిరోజుల కిందట నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో జరిగిన ప్రారంభోత్సవానికి ముందుగానే తేదీలు సమయం నిర్ణయించారు...ఆ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఆదాల ప్రభాకర్‌రెడ్డికి సమాచారం ఇవ్వలేదు. ఆఖరి నిమిషంలో గంట ముందు కార్యక్రమానికి హాజరు కాలేదు. దీనికంతటికి కారణం మంత్రి సోమిరెడ్డి అని పలువురు నేతలు ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా బెట్టింగ్‌ కేసులో ముద్దాయిగా నేడో..రేపో జైలుకు వెళ్లబోతున్న కోటంరెడ్డికి మంత్రి పరోక్ష మద్దతు ఉందని, ఆయన చేసిన సూచనలు, సిఫార్సులన్నీ క్షణాల్లో అవుతున్నాయని ఫిర్యాదు చేశారు. ఈ విషయాలన్నింటిని ఆధారాలతో, కటింగ్‌లతో ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన ఫైళ్లును కూడా అందించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు వాస్తవాలను దృష్టికి తీసుకురావడం లేదని చెప్పారు. ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి టిడిపి కార్యకర్తలను విస్మరించి, కాంగ్రెస్‌ కార్యకర్తలను ప్రోత్సహిస్తున్నారని, అటువంటి వ్యక్తులనే సోమిరెడ్డి వెనుకేసుకు వస్తున్నారని పలువురు ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా సోమిరెడ్డి వ్యవహారశైలిని ఆయన దూకుడును తగ్గించకుంటే...పార్టీకి 2004 ఎన్నికల ఫలితాలు పునరావృతం అవడం ఖాయమని పలువురు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాలో అటవీ ప్రాంతానికి సంబంధించిన సెలికామైనింగ్‌కు సంబంధించి మంత్రి సోమిరెడ్డి బినామీ పేర్లతో అవినీతికి పాల్పడ్డారని సర్వేపల్లి ఎమ్మెల్యే చేసిన ఆరోపణలను చంద్రబాబుకు అందించారు. ఏది ఏమైనా 'సోమిరెడ్డి'పై ఇంత వ్యతిరేకత ఉందనే విషయం...జిల్లా పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యులతో ఏకాంతంగా మాట్లాడడం..చంద్రబాబు తెలుసుకోగలిగారు. దీనిపై...ఆయన ఏవిధంగా స్పందిస్తారో..కట్టడి చేస్తారో..?

(212)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ